Breaking News Live: రజనీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 28 Sep 2021 09:39 PM

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల...More

రజనీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

మణికొండలో ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వితోబాను సస్పెండ్‌ చేశారు. మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్‌కుమార్‌పై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈనెల 25న రాత్రి 9గంటల సమయంలో ప్రమాదవశాత్తు మరమ్మతుల కోసం తీసిన గుంతలో పడి రజనీకాంత్‌ గల్లంతయ్యారు. సోమవారం అతని మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది.