= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అమరావతి: ఫైర్ సర్వీసెస్ డీజీగా పీవీ సునీల్ కుమార్ అమరావతి: ఫైర్ సర్వీసెస్ డీజీగా పీవీ సునీల్ కుమార్..
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి..
రేపు ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు స్వీకరించనున్న సునీల్ కుమార్
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు: తెలంగాణ కేబినెట్ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం సొంతిళ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను హరీశ్‌రావు తెలిపారు.. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. అంతే కాకుండా 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో పెట్టాలని నిర్ణయించాం. నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించాం. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.3లక్షలు గ్రాంట్‌గా ఇవ్వాలని నిర్ణయించాం.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రెండో విడుతలో 1.30లక్షల మందికి దళితబంధు: తెలంగాణ కేబినెట్ నిర్ణయం దళితబంధులో 1.30లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దళితవర్గాలు దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్న పరిస్థితి. అనేక వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి దళితబంధుపై స్టడీ చేసి వెళ్తున్నారు. దళితబంధు పథకం ఆగస్ట్ 16, 2021న ప్రారంభమైంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి హైకోర్టుకు అవినాష్ రెడ్డి.. అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాది సమక్షంలో తన విచారణ జరగాలని కోరారు. 160 సీఆర్ సీపీ నోటీసులు ఇచ్చారు కనుక అరెస్ట్ చేయవద్దని కోరిన ఎంపీ అవినాష్ రెడ్డి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Kavitha News: రేపు జంతర్ మంతర్ కవిత దీక్షకు అనుమతి రద్దు రేపు జంతర్ మంతర్ కవిత దీక్షకు అనుమతి రద్దు
మరో ప్రాంతం చూసుకోవాలని సూచించిన ఢిల్లీ పోలీసులు
రేపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు సిద్దమైన కవిత
అనూహ్యంగా ఆఖరు నిమిషంలో అనుమతులు రద్దు చేసిన పోలీసులు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత
- మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్
- 16 మంది విద్యార్థినులకు అస్వస్థత
- మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు
- గత రాత్రి నుంచే విద్యార్థులకు అస్వస్థత, పట్టించుకోని యాజమాన్యం
- విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల తో కస్తూర్భా పాఠశాలలోనే సీక్రెట్ గా వైద్యం అందించే ప్రయత్నం
- సమాచారం బయటకు రావడంతో హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స
- విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కస్తూర్భ పాఠశాల యాజమాన్యం
- కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమైందో చెప్తామంటున్న డాక్టర్లు
- అస్వస్థతకు గల కారణాలు కలుషిత నీరా, లేక ఆహారమా అనేది తెలియాల్సి ఉందన్న పోలీసులు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Telangana MLC Elections: నామినేషన్లు వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గురువారం దేశపతి శ్రీనివాస్, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్ కుమార్ నామినేషన్ వేశారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వారితో ఉన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత అభ్యర్థుల ఫైల్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు వెళ్లనుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Rachakonda Police: బాలాపూర్ లో ఓ యువకుడి హత్య రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో ఓ 18 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి చంపారు. ఈ ఘటన యువకుడి ఇంటి ముందే జరిగింది. అయితే యువకుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఇంటి బయటకు వచ్చారు. అంతలోపే దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, క్లూస్ టీమ్, బాలాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని పవన్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
NTR District Kidnap Case: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంచలనం రేపుతున్న చిన్న పిల్లల కిడ్నాప్ కేస్
- ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంచలనం రేపుతున్న చిన్న పిల్లల కిడ్నాప్ కేస్
- మహారాష్ట్రలోని ప్రభాని జిల్లా పొలం గ్రామంలో కిడ్నాప్ కేసు నమోదు
- ఈనెల 5వ తారీఖున ముంబై పోలీసులు వచ్చి జగ్గయ్యపేట మండలం దేచు పాలెం గ్రామంలో కిడ్నాప్ అయినా బాలుడి గుర్తింపు
- విజయవాడలో గతంలో ప్రైవేట్ హాస్పటల్లో నర్స్ గా పనిచేస్తున్న పగడాల శ్రావణి రంజిత్ జగ్గయ్యపేటకు చెందిన ఇరుగు శిల్పాకు కిడ్నాప్ అయిన పిల్లల అమ్మకం
- శిల్ప ఆ పిల్లలను జగ్గయ్యపేట బ్రాహ్మణ బజార్ కు చెందిన వారికి, దేచుపాలేం గ్రామానికి చెందిన ఇద్దరికీ అధిక మొత్తంలో అమ్మకం
- ఈరోజు ముంబై నుంచి వచ్చిన పోలీసులు బ్రాహ్మణ బజార్ లో ఒక బాబును దేచుపాలెం గ్రామంలో ఒక బాబును, విస్సన్నపేట గ్రామంలో ఒక బాబును గుర్తించినట్లు తెలిపిన పోలీసులు
- గతంలో శిల్ప కూడా విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేసినట్లు అప్పుడు శ్రావణితో పరిచయం ఏర్పడినట్లు సమాచారం
- లక్షలాది రూపాయలు పిల్లల అమ్మకాల్లో చేతులు మారినట్లు సమాచారం
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Telangana Cabinet నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, ఈడీ నోటీసులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరు అభ్యర్థుల్ని ఖరారు చేయడంతోపాటు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించనున్నారు. కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలన్న విషయమై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.