Breaking News Live Telugu Updates: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేట్ పరం చేసింది- రాహుల్ గాంధీ    

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Nov 2022 06:30 PM
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేట్ పరం చేసింది- రాహుల్ గాంధీ    

ఇవాళ్టితో తెలంగాణ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. కామారెడ్డి మేనూరులో  కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో చాలా మందితో మాట్లాడానన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఆ మాట మరిచారని విమర్శించారు. కార్యకర్తలు చేతలు విరిగినా, కాళ్లు విరిగినా , దెబ్బలు తిన్నా కాంగ్రెస్ కోసం పోరాడుతున్నారన్నారు. తెలంగాణలో అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అమ్మేశారని మండిపడ్డారు. 

Srisailam News: శ్రీశైలంలో మంత్రి రోజా పూజలు

శ్రీశైలం ఆలయం చేరుకున్న మంత్రి రోజాకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకాలసిన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి స్వాగతం పలకకపోవడంతో మంత్రి రోజా చైర్మన్ కోసం చూశారు. రాకపోవడంతో ఈఓ లవన్న స్వాగతం పలికారు. కార్తీకమాసం అందులోను సోమవారం కావడంతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని ఏపీ టూరిజంశాఖ మంత్రి ఆర్ కే రోజా దర్శించుకుని పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి రోజాకు ఆలయ అర్చకులు ఈఓ లవన్న ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలుకారు. అనంతరం మంత్రి రోజా రాజగోపురం ముందు భాగంలో ఉన్న ద్వజ స్తంభానికి నమస్కరించి అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ప్రాంగణంలో మంత్రి రోజా కార్తీక దీపాలను వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా మంత్రి రోజకు ఆశీర్వచనలిచ్చి దీవించారు. ఈఓ లవన్న స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. అనంతరం మంత్రి రోజా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో మహాత్మాగాంధీ పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు.

Vikarabad Lorry Accident: వికారాబాద్ లారీ ప్రమాదం

  • వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి చౌరస్తాలో లారీ భీభత్సం

  • అర్ధరాత్రి ఒంటి గంటకు అతి వేగంగా ఆలంపల్లి మూలమలుపులోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

  • తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం

  • వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీసిన ఇంట్లో వ్యక్తులు, తప్పిన ప్రాణ నష్టం

TRS MLAs Buying Issue: నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు విచారణ

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఆ పిటిషన్ ను జస్టిస్ బి.ఆర్ గవై, జస్టిస్ బి.వి నాగరత్న ధర్మాసనం విచారణ చేయనుంది. రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

Background

నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. దాంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తుఫానుగా మారుతుందా, లేదా సాధారణంగానే అల్పపీడనంగానే ఉంటుందా అనే అంశంపై గురించి ఇంకా క్లారిటీ లేదని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు. కానీ అల్పపీడనం ఏర్పడ్డాక తప్పకుండా తమిళనాడు వైపు అయినా, లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపుగా అయినా రానుందని అంచనా వేశారు. ఒకవేళ ఇది వాయుగుండంగా ఏర్పడితే తమిళనాడుకి, అలాగే బలమైన తుఫానుగా ఏర్పడితే దక్షిణ కోస్తాంధ్రపై పెను ప్రభావం చూపనుంది. 


నవంబర్ 8 ఏర్పడే అల్పపీడనం, మొదటగా వాయుగుండంగా మారనుంది. అయితే ఇది శ్రీలంక వైపుగా వెళ్తుందా, లేదా తమిళనాడు వైపుగా వస్తుందా, తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే అంశం పై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన, హెచ్చరికలు లేవు. ఏపీతో పాటు యానాం, తమిళనాడులోనూ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తుండగా, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలుచోట్ల తేలికపటి వర్షం కురవనుంది. 


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 33.8 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో అత్యల్పంగా 13 డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 8న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు వర్షాలు కురవనున్నాయి.


హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30.5 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య, తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గాలుల కోస్తాంధ్ర వైపుగా కదలడంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 



దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నిన్న దక్షిణ కోస్తాంధ్రలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. నేడు ఇక్కడ సైతం వాతావరణం పొడిగా మారనుంది. అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్న​తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.