Breaking News Live Telugu Updates: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఆత్మహత్య

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Feb 2023 07:15 PM
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి

ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి...


 1) ఎంసెట్ - మే 7 నుంచి 14 వరకు 


 2) ఎంసెట్ ఇంజినీరింగ్ - మే 7 నుంచి 11 వరకు 


 3) ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా - మే 12 నుంచి 14 వరకు 


 4) ఎడ్‌ సెట్‌ పరీక్ష - మే 18 


 5) ఈ సెట్‌ పరీక్ష - మే 20 


 6) పీజీ లా సెట్‌, పీజీఎల్‌సెట్ - మే 25 


 7) టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష - మే 26, 27 


 8) టీఎస్‌పీజీ ఈ సెట్‌ పరీక్ష - మే 29 నుంచి జూన్‌ ఒకటి

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఆత్మహత్య

బ్రేకింగ్...
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య...
ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

బీజేపీ కార్యకర్తపై మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం

సంగారెడ్డి జిల్లా... బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం


 ఫోన్ చేసిన ఆందోల్ నియోజకవర్గ బిజెపి కార్యకర్త వెంకట రమణని బండ బూతులు తిట్టిన బాబు మోహన్


మీతో కలిసి పార్టీలో పని చేస్తానని చెప్పిన కార్యకర్త


నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోల్ ని అభివృద్ధి చేశానని చెప్పిన బాబు మోహన్


నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తను తిట్టిన మాజీ మంత్రి


నేను రెండు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారన్న బాబుమోహన్


నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై బాబు మోహన్ తిట్ల పురాణం


బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు అన్న బాబు మోహన్


ఇంకో సారి నాకు ఫోన్ చేస్తే జ చెప్పు తీసుకుని కొడుతా అంటూ కార్యకర్తకు బెదిరింపు


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో

Jallikattu: జల్లికట్టులో అపశృతి, ఎద్దు‌ ఢీకొని ఒకరు మృతి, మరో నలుగురికి గాయలు

చిత్తూరు జిల్లా, వికోట‌ మండలం, ఎర్రినాగేపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడు సాంప్రదాయాన్ని పాటిస్తూ సంక్రాంతి పండుగ తరువాత జల్లి కట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ జల్లికట్టును వీక్షించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే ఎద్దులను కట్టిన బహిమతులను చేజిక్కించుకునేందుకు యువత ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలో ఎద్దులు పరుగులు పెడుతున్న సమయంలో జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన మోర్నాపల్లికి చేందిన శీనప్ప (54) ను ఢీ కొనడంతో శీనప్ప తీవ్రంగా పడ్డాడు. మరో నాలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన వికోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శీనప్ప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై‌ కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమాస్టం‌ నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

SVBC Chairman: ఎస్వీబీసీ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగ దుర్గారావు

టిటిడి ఎస్వీబీసీ సలహాదారుడిగా నాగ దుర్గా రావు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నాగదుర్గా రావు దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయానికి ఆయన, ప్రభుత్వ ఆదేశానుసారం టీటీడీ ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయంలో సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు.

Gali Janardhan Reddy: శ్రీవారి సేవలో గాలి జనార్దన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు నాలుగు నెలల సమయమే ఉన్నందున పార్టీ గెలిచే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామని, ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాం అనేది పూర్తి సమాచారం నెల రోజులలో  తెలియజేస్తాం అని అన్నారు.

MLA Pouching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తీర్పుపై ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్‌లో అడ్వకేట్ జనరల్ లంచ్ మోషన్ దాఖలు చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సస్పెన్షన్ ను మూడు వారాలకు పొడిగించాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది. తాము సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే వరకూ తీర్పు పై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్ ను ధర్మాసనం అంగీకరించగా, మధ్యా్హ్నం 2.30 గంటలకు విచారణకు రానుంది.

Revanth Reddy: రెండోరోజు హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి

రెండవ రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. టి .పి సి సి చీఫ్  చేపట్టిన పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. ములుగు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గ్రామంలో మొదటి రోజు యాత్ర ముగించుకున్న రేవంత్ రెడ్డి బస చేశారు. నేడు రెండవ రోజు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో  రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి రెండవ రోజు హాత్ సే హాత్ యాత్ర రామప్ప నుండి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే సీతక్క తో పాటు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Minister Malla Reddy: రాష్ట్ర బడ్జెట్ లో కార్మికులకు పెద్ద పీట - మల్లారెడ్డి

రాష్ట్ర బడ్జెట్ లో కార్మికులకు పెద్ద పీట వేసినట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మికుల డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించి ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులను దశల వారీగా అందిస్తామని అన్నారు. భవన కార్మికులకు సెస్ రూపంలో నిధులు ఉన్న తరుణంలో బడ్జెట్లో కేటాయించిన విధంగా వారికి లక్ష మోటార్ సైకిల్ అందజేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్మికులకు మోటారు వాహనాలను అందజేయడం, కార్మికుల సంక్షేమం, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు నష్టపరిహారం, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేటాయిస్తామని అన్నారు.. కార్మికులు అడిగిన డిమాండ్లను నెరవేర్చెందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.. కార్మిక సంఘాల వారు వచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Vanasthalipuram Car Accident Update: వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ లో ఘోర ప్రమాదం

వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ లో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున అతి వేగంగా వచ్చిన కారు షాప్ ల పైకి దూసుకెళ్లడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. తెల్లవారు జామున కావడంతో ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పిందని చెపుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్ లో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కారులో ముగ్గురు యువకులు  ఉన్నట్లు వారు మద్యం మత్తులో అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగింది. వారికి తీవ్ర గాయలవ్వడంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుండి పరారైనట్లు ప్రతక్ష సాక్షులు చెపుతున్నారు. కారు సీట్ లలో బయట రక్తపు మరకలు ఎక్కువగా ఉండటంతో కారులోని వారికి గాయాలు ఎక్కువగా అయినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన యువకులు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Vanasthalipuram Accident: వనస్థలిపురంలో ఘోర ప్రమాదం, 180 కిలో మీటర్ల వేగంతో ఢీకొన్న కారు

వనస్థలిపురంలో ఓ కారు అత్యంత ఘోరమైన రీతిలో ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన కారు దుకాణాలను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం స్పీడో మీటరు పరిశీలించగా ఆ ముల్లు 180 వద్ద ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పోలీసులు కారు 180 కిలో మీటర్ల వేగంతో ఉన్నట్లుగా అంచనాకు వస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు మొత్తం నుజ్జునుజ్జయింది.

BJP News: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్

రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. 11 వేల కార్నర్ మీటింగ్ల కోసం దాదాపు 800 మంది లీడర్లను బీజేపీ గుర్తించింది. బీజేపీ నాయకులకు నేడు ఒక్క రోజు శిక్షణ ఇవ్వనున్నారు. మన్నెగూడలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఏ అంశాలు చర్చించాలనే అంశంపై లీడర్లకు సునీల్ బన్సల్, బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు.

JEE Main Results విడుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన JEE Main సెషన్‌-1 పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో JEE Main Results ను ఉంచారు. అప్లికేషన్‌ నంబర్‌, డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్‌ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు.

Pembarthi Accident: పెంబర్తి సమీపంలో ఘోర ప్రమాదం, ముగ్గురు మృతి

  • జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

  •  ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు, డీసీఎం డ్రైవర్, క్లీనర్ మృతి

  • డీసీఎం పంక్చర్ కావడంతో టైరు మారుస్తుండగా ఘటన

  • కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆరేళ్ల పాప మృతి

  • హైదరాబాద్ కొండాపూర్ చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి కుటుంబం తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఘటన

  • ట్రైన్ లో కాజీపేటలో దిగి కారులో హైదరాబాద్ కు వెళుతుండగా నిద్ర మత్తు, పొగ మంచు కారణంగా ప్రమాదం

  • కార్ డోర్ ఓపెన్ అయి కింద పడి ఆరేళ్ళ పాప శ్రీహిత, కారు మీద పడడంతో డ్రైవర్ క్లీనర్ మృతి

  • దేవేందర్ రెడ్డి ఆయన భార్య శ్రీవాణికి తీవ్ర గాయాలు

Background

సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేశారు.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మొన్న (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 13 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది.  ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.


ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 6) రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో సగటు సముద్ర మట్టం కంటే 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడిందని వివరించింది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.