Breaking News Live Telugu Updates: సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Sep 2022 06:00 PM
సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో  చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.

సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో  చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.

సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో  చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.

సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో  చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.

సీపీఎస్ వీలుకాదు- జీపీఎస్‌కు అంగీకరించండి- ఉద్యోగులకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో  చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.

Suresh Raina Retires from all forms of cricket: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా

క్రికెటర్ సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రాష్ట్రం యూపీకి, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. బీసీసీఐకి, యూపీ క్రికెట్ అసోసియేషన్‌కు, సీఎస్కేకు, రాజీవ్ శుక్లాకు ధన్యవాదాలు తెలిపాడు. 





Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ వాయిదా

నేడు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి  తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం తమ శాఖల సంబంధించిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 

Telangana Assembly Session: అసెబ్లీలోకి బీజేపీ సభ్యుల అనుమతి

తెలంగాణ అసెబ్లీలోకి బీజేపీ సభ్యుల అనుమతించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Telangana Assembly Meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే, ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్థన్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. అనంతరం సభ వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగుతుంది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు

  • హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు

  • ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో సోదాలు

  • హైదరాబాద్ లో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఈడీ

  • అరుణ్ రామచంద్ర పిళ్లైతో సహా  మరో ఐదుగురిపై సోదాలు

  • బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృ జన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు 

  • రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కొనసాగుతున్న సోదాలు

Hyderabad Tank Bund: ట్యాంక్ బండ్‌పై ఉద్రిక్తత, భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టు

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌ పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరపాలంటూ నెక్లెస్ రోడ్‌లో గణేష్ ఉత్సవ సమితి చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉత్సవ నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావుతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


నిమజ్జనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ.. హుసేన్ సాగర్ చుట్టూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు బైక్ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. వారిని ర్యాలీకి ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Taneti Vanitha: గన్ చేత పట్టిన ఏపీ హోం మంత్రి వనిత

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత గన్ తో సందడి చేశారు. రివాల్వర్ షూటింగ్ శిక్షణ తరగతుల్లో హోం మంత్రి పాల్గొన్నారు. అమెరికాలో పురుషులు, స్త్రీలు అనే తారతమ్యం లేకుండా అన్ని రకాలుగా వారిని తీర్చిదిద్దుతారు. దానిలో భాగంగా వారు అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించడానికి తర్ఫీదు తీసుకోవచ్చు. ఆ ఇన్‌స్టిట్యూట్ ను హోం మంత్రి తానేటి వనిత పరిశీలించారు. గన్ షూటింగ్ లో  మెలకువలు నేర్చుకున్నారు.

Anakapalli News: అనకాపల్లిలో పేలిన మందుగుండు, నలుగురికి తీవ్ర గాయాలు

  • అనకాపల్లి: సబ్బవరం మండలం ఆరిపాకలో మందు గుండు పేలి నలుగురికి గాయాలు

  • ప్రమాదానికి గురైన శంకరరావు, మహేష్, ప్రసాద్, కమలమ్మ

  • మహేష్, కమలమ్మకు తీవ్ర గాయాలు

  • శంకర్, ప్రసాద్‌కు స్వల్ప గాయాలు

  • తీవ్ర గాయాల పాలైన మహేష్, కమలమ్మను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • రహస్యంగా మందుగుండు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అనుమానం

  • ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Background

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 


తెలంగాణలో వర్షాలు 
తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.  మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. 


నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు మరో 3 రోజుల వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడటంతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లులు కురిశాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. దక్షిణ కోస్తాంధ్రలో తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో భారీ వర్షాలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.