Breaking News Live Telugu Updates: కామారెడ్డిలో బండి సంజయ్ అరెస్ట్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Jan 2023 09:05 PM
కామారెడ్డిలో బండి సంజయ్ అరెస్ట్ 

కామారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు వాగ్వాదం జరిగింది. కలెక్టర్ ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తు్న్నారు. బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ ను పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 

మలక్ పేట్ లోని ఓ హోటల్ చెలరేగిన మంటలు 

హైదరాబాద్ మలక్ పేట్ లోని సోయాల్ హోటల్ లో గ్యాస్ లీకేజ్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలించారు. సంఘటన స్థలనికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

జనవరి 10న చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ భేటీ 

జనవరి 10న టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబద్ లో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయపరంగా చర్చ జరుపుతారా? అనే చర్చ జరుగుతుంది. 

Chandrababu Kuppam Tour: చంద్రబాబు రోడ్ షో అడ్డగింత, కుప్పం గుడుపల్లి మండలంలో ఉద్రిక్తత

కుప్పం నియోజకవర్గంలో నేడు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చంద్రబాబు మూడో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ధర్నాకు దిగారు. నేడు ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. తర్వాత ఇదే క్రమంలో గ్రామాల్లో ఇంటింటి పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు గుడిపల్లి మండలంలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించాల్సి ఉండగా.. చంద్రబాబు రోడ్‌ షోలకు అనుమతి లేదని పోలీసులు ప్రచార చైతన్య రథాన్ని అడ్డుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి రథాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా గుడిపల్లి పీఎస్‌లోనే చంద్రబాబు చైతన్య రథం ఉంది. చైతన్య రథాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసనకు దిగారు. నడిరోడ్డుపై టీడీపీ శ్రేణులతో కలిసి కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది.

Eluru News: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొండ్రుప్రోలులో అర్థరాత్రి యువతి గొంతుకోశాడు కళ్యాణ్ అనే వ్యక్తి
అడ్డొచ్చిన యువతి చెల్లెలు, తల్లిపై చాకుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత 2 నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్న కళ్యాణ్‌ను ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తుంది. గతంలోనూ యువతి తండ్రికి చెందిన పశువుల మేతకు కళ్యాణ్ నిప్పుపెట్టినట్లు సమాచారం.

Telangana Congress: కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ

  • కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ

  • ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో భేటి కానున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు

  • సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం

  • 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్

  • నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన కేసు హైకోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో సంచలనం

Kamarerddy News: కామారెడ్డి రైతుల ఆందోళనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్

  • కామారెడ్డి రైతుల ఆందోళనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్

  • కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో రైతు జేఏసీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు

  • కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డిల నేతృత్వంలో ఒక బృందం

  • మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తో పాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డికి పయనం

Background

ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా ప్రాంతంపైన విండ్ కన్వర్జన్స్ (గాలుల సంగమం) కారణంగా ఆంధ్రాలో పలు చోట్ల స్వల్ప వర్షాలు పడుతున్నాయి.


ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అందులో పేర్కొంది. 


స్వల్ప వర్షాలు పడే అవకాశం
‘‘కాకినాడ నగరంలో అత్యథికంగా 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు పడ్డాయి. మరో వైపున గుంటూరు జిల్లాలోని పలు భాగాలు, కృష్ణా జిల్లాలోని పలు భాగాలతో పాటుగా బాపట్ల​, ఉత్తర ప్రకాశం జిల్లా (ఒంగోలు పరిసర ప్రాంతాలు) లలో కొద్దిసేపు వర్షాలు కొనసాగాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. నిన్నటి కంటే నేడు వర్షాలు మరింత స్వల్పంగా ఉంటాయని తెలిపారు. చాలా చోట్ల మాత్రం వాతావరణం పొడిగానే ఉంటాయని తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.


రేపు ఈ మూడు జిల్లాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు, ఎల్లుండి అదనంగా నిజామాబాద్, జగిత్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 27.4 డిగ్రీలు, 19.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.