Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Sep 2022 10:08 PM

Background

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం దాదాపుగా తగ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని...More

రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  చింతల్ మెట్ చౌరస్తాలోని met square గోదాములో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో గోదాం, పక్కనున్న వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  శంషాబాద్ జోన్ డీసీపీ, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.