Breaking News Live Telugu Updates: ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Oct 2022 09:58 PM

Background

నైరుతి రుతుపవనాల ప్రభావంతో సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య...More

ఈ నెల 6న వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం 

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు.  7వ తేదీన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. పాదయాత్రను మధ్యలో ఆపి మరి ఢిల్లీకి వెళ్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు.  ఇప్పటికే గవర్నర్ తమిళ సైకి సైతం ఫిర్యాదు చేశారు.  ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.