Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Dec 2022 04:13 PM

Background

Weather Latest Update:  ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ పసిఫిక్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన సుమత్రా దీవులకు దగ్గర ఉంది. ఈ ఆవర్తనం బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ...More

ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ నోటీసులపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈ నెల 13 వరకు హైకోర్టు స్టే పొడిగించింది.  జగ్గుస్వామి నోటీసులపై కూడా హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.