Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Apr 2023 07:50 PM
ఏపీ సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కాలినొప్పి. ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. తాజాగా మళ్లీ కాలినొప్పి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.

అమలాపురంలో దారుణం - సైకో చేతిలో మహిళ దారుణ హత్య, మరో మహిళకు తీవ్ర గాయాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా..


అమలాపురంలో దారుణం..


సైకో చేతిలో మహిళ దారుణ హత్య.. మరో మహిళకు తీవ్ర గాయాలు..


అమలాపురంలోని మున్సిపల్‌ ఏఎంజీ కాలనీలో ఘటన..


మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి పనిచేసుకుంటుండగా వెనుక నుంచి వచ్చి చాకుతో పీక కోసిన సైకో..


అక్కడే ఉన్నన ఇంటి యజమాని పైకూడా దాడి.. మరో మహిళ వీపుపై చాకుతో దాడి.. తీవ్ర గాయాలు..


మృతి చెందిన మహిళ పేరు మన్నె శ్రీదేవిగా(28) గుర్తించిన పోలీసులు.. గాయపడిన మహిళ కమ్మిడి వెంకటరమణ(45) గాయాలు...


వెనుక నుంచి వచ్చి చాకుతో శ్రీదేవి పీక కోయడంతో అక్కడికక్కడే దుర్మరణం..


తీవ్ర గాయాలతో మరో మహిళ వెంకటరమణ అమలపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స..


దాడిచేసిన సైకో అతని వద్దనున్న కార్డుల ఆధారంగా నెల్లూరు వాసిగా గుర్తించిన స్థానికులు..


దాడిచేసిన సైకో పూర్తిగా మతి స్తిమితం లేకుండా ఉండడంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పోలీసులు..


పట్టుకునే సమయంలో కూడా స్థానికులపై దాడికి తెగబడ్డ సైకో...


సంఘటనపై దర్యాప్తు చేపట్టిన అమలాపురం పోలీసులు..

తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ ఈ నెల 6కు వాయిదా 

హైదరాబాద్ 


తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ ఈ నెల 6కు వాయిదా 


రెండు రెగులర్ బెయిల్స్, ఒక్కటి ఆంటీస్పెటరీ బెయిల్ కలిపి విచారించాలంటూ కోరిన మల్లన్న వ్యయవాది శరత్ 


మూడు ఒక్కేసారి విచారిస్తామన్న మల్కాజిగిరి కోర్ట్ 


మల్లన్న పై రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదు 


పిటి వారెంట్ పై తీసుకెళ్లొద్దు అంటూ ఇప్పటికే హై కోర్ట్ ఆదేశం

Komatireddy Venkat Reddy: హైకోర్టుకు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ

  • హైకోర్టుకు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ

  • తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పిటిషన్

  • పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్

  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హత్య ప్రయత్నం నేరం ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే ఆరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్

  • ఎంపీ నుండి ప్రాణ హాని ఉందని పిటిషన్

  • చెరుకు సుధాకర్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ

Telangana SSC Exams: తెలంగాణలో నిన్న తెలుగు పేపర్, నేడు హిందీ పేపర్ లీక్

తెలంగాణలో పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.

Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్., ఎంపీ మాలోతు కవితలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్., ఎంపీ మాలోతు కవితలు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయానికి కృషి చేస్తున్న సీఎం కెసిఆర్ కు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.. 

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన 6E897 నెంబరు ఇండిగో విమానం ఒకటి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానం మంగళవారం ఉదయం 5 గంటల 10 నిమిషాలకు బెంగళూరులో టేకాఫ్‌ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో ఉదయం 6 గంటల 16 నిమిషాలకు హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇండిగో సంస్థ ప్రకటించింది.

Background

నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి ఉన్న ద్రోణి/గాలి విచ్చిన్నతి, ఈ రోజు విదర్భ నుండి మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల 5 రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుందని వాతావరణ అధికారులు వెదర్ బులెటిన్‌లో తెలిపారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో చాలా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


రాయలసీమలో ఎండలు విపరీతంగా
‘‘రాయలసీమలో ఎండలు విపరీతం అవ్వనున్నాయి. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కర్నూలుతో పాటుగా చిత్తూరు, కడప​, అనంతపురం, సత్యసాయి, నంద్యాల​, అన్నమయ్య జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. కర్నూలు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ఎండల తీవ్రతలో నేడు అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది.


నేడు కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 6/7 నుంచి తెలంగాణలో వర్షాలు మొదలయ్యే సూచనలు కనబడుతూ ఉన్నా, మరో నాలుగు రోజులు మాత్రం కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగనున్నాయి. నేడు సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లో వర్షాలు, పిడుగులు మధ్యాహ్నం మొదలై సాయంకాలం లేదా రాత్రి మొదలయ్యే వరకు కొనసాగనుంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ​, కొనసీమ​, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్.టీ.ఆర్., గుంటూరు, బాపట్ల​, ప్రకాశం (కోస్తా ప్రాంతం మాత్రమే), నెల్లూరు (కోస్తా ప్రాంతం మాత్రమే), తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా (తూర్పు భాగాలు మాత్రమే) అక్కడక్కడ నేడు వర్షాలు చూడగలము. నేడు గత రెండు వారాలతో పోలిస్తే తక్కువ శాతం వర్షాలే ఉంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ విశ్లేషించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.