= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారు..
గ్రూప్1 మెయిన్స్ పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వరకు గ్రూప్-1 మెయిన్స్ ఉంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నా ఫోన్ ట్యాప్ చేశారు, ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు అధికార వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పార్టలోనూ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ సైతం తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనకు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. సీబీఐ విచారణకు హాజరు కాలేదన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
YV Subba Reddy: విశాఖలో ఖాళీగా ఉన్న ఆ బిల్డింగులు కార్యాలయాలుగా - వైవీ సుబ్బారెడ్డి ‘‘ఏప్రిల్ లోపలే పాలనా రాజధాని వైజాగ్ నుండి పని చేస్తుంది. అప్పటిలోగా న్యాయపరమైన అన్ని అడ్డంకులనూ అధిగమిస్తాం. భీమిలి రోడ్డులో చాలా ఐటీ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే VMRD గెస్ట్ హౌస్ లూ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సీఎం కార్యాలయం నివాసం ఏర్పాటు చేసే అవకాశం ఉంది’’ అని వైఎస్ఆర్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Tirupati News: శ్రీవారి మాఢవీధుల్లో సీఎంవో వాహనం చక్కర్లు తిరుమలలో మరోమారు భద్రత వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వాహనాలు తిరగటం నిషేధించింది టీటీడీ. కానీ పీఎం, సీఎం స్థాయి ప్రోటోకాల్ వాహనాలు సైతం ఆలయ మాడవీధుల్లోకి ప్రవేశం లేదు. వైభవోత్సవ మండపం ముందుభాగంలో ఉన్న ప్రాంతంలోనే వాహనాలను నిలుపుదల చేయాలి. కానీ ఓ కారు డ్రైవర్ అత్యుత్సాహంతో కారును ఆలయ మాడవీధుల్లో పార్కింగ్ చేసాడు. అదే సమయంలో అక్కడ విజిలెన్స్ సిబ్బంది లేకపోవడంతో ఘటన చోటు చేసుకుంది. కారుపై సీఎంఓ అనే అక్షరాలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Minister KTR in Karimnagar: కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డుగా వెళ్లిన విద్యార్థులు, కరీంనగర్ లో ఉద్రిక్తత కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి ఎలాంటి ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో పోలీస్ యంత్రాంగమంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటు హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేశారు. అయినా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకొని ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ కొంతమంది విద్యార్థులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
RK Roja in Tirumala: శ్రీవారి సేవలో ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం- రియాక్టర్ పేలి ఒకరు మృతి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెజ్‌లో మరోసారి ప్రమాదం జరిగింది. జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'మేడ్ ఇన్ ఇండియా' ప్రచారం విజయవంతమైంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలో ఒకవైపు అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు ఆధునిక పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఓ వైపు కేదార్ నాథ్ ధామ్, కాశీ విశ్వనాథ్ ధామ్, మహాకాల్ మహలోక్ ను నిర్మించామని, మరోవైపు తమ ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తోందన్నారు.
ప్రభుత్వ నూతన చొరవ ఫలితంగా మన రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపంలో తొలి స్వదేశీ విమాన వాహక నౌకను కూడా మన సైన్యంలో ప్రవేశపెట్టడం గర్వకారణమని ద్రౌపది ముర్ము అన్నారు. మేడిన్ ఇండియా ప్రచారం, స్వావలంబన భారత్ ప్రచారం విజయవంతం కావడంతో దేశం ప్రయోజనాలు పొందుతోందన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఆ స్ఫూర్తితో దేశం ముందుకు సాగుతోంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలు విడిచి పెట్టిన సమరయోధుల స్ఫూర్తితో దేశం ముందుకు సాగుతోందన్నారు. ఈ ప్రభుత్వం కూడా బానిసత్వ మనస్తత్వాన్ని వదిలించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుందన్నారు. ఒకప్పుడు రాజ్ పథ్ గా ఉన్న ప్రాంతం ఇప్పుడు కర్తవ్య మార్గంగా మారిందని గుర్తు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
11 కోట్ల మంది రైతులకు ప్రాధాన్యం: ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలోని 11 కోట్ల మంది సన్నకారు రైతులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదన్నారు. దశాబ్దాలుగా ఈ సన్నకారు రైతులు ప్రభుత్వ ప్రాధాన్యత కోల్పోయారన్నారు. ఇప్పుడు వారిని శక్తివంతం చేయడానికి, సుసంపన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తొలిసారిగా పురుషుల కంటే మహిళలే ఎక్కువ: రాష్ట్రపతి మహిళల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ... ఈ రోజు 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారం విజయాన్ని చూస్తున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య పెరిగిందని, మహిళల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉందన్నారు. ఏ రంగంలోనూ మహిళలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చూసుకున్నారన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ట్యాక్స్ రీఫండ్స్ ఆటోమేటిక్ గా వస్తున్నాయి: ద్రౌపది ముర్ము
గతంలో పన్ను రీఫండ్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఐటీఆర్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే రిఫండ్ వస్తుంది. నేడు జిఎస్టి పారదర్శకతతో పాటు పన్ను చెల్లింపుదారుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఆయుష్మాన్ భారత్ పథకం పేదలు నిరుపేదలుగా మారకుండా కాపాడింది: రాష్ట్రపతి ముర్ము ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలను నిరుపేదలుగా మారకుండా కాపాడిందని, 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా కాపాడిందని ముర్ము అన్నారు. 7 దశాబ్దాల్లో దేశంలో మూడున్నర కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీటిని అనుసంధానం చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పేదలకు రూ.27 లక్షల కోట్లు: ముర్ము
పూర్తి పారదర్శకతతో కోట్లాది మందికి రూ.27 లక్షల కోట్లకు పైగా అందించామని ముర్ము తెలిపారు. ఇలాంటి పథకాలు, వ్యవస్థలతో కొవిడ్ సమయంలో దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లకుండా లక్షలాది మందిని భారత్ కాపాడగలిగిందని ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
డిజిటల్ ఇండియా దిశగా అడుగులు: రాష్ట్రపతి అభివృద్దితో పాటు ప్రకృతిని కాపాడుకుంటున్నాం. అవినీతి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగుతుంది. బినామి ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నామని... సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తున్నాం. పేదల ఆలోచన స్థాయిని పెంచుతున్నాం. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి తాగున నీరు అందేంచేదుకు నిరంతరం శ్రమిస్తున్నాం.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది: రాష్ట్రపతి
ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అవినీతి నిర్మూలన దిశగా పయనిస్తుంన్నాం. విధానాల్లోని లోపాలను సరిద్దామాం. ఆత్మవిశ్వాసంతో దేశం ముందడుగు వేస్తోంది. అందుకే ప్రపంచమంతా భారత్ వైపు ఆశావాహ దృక్పథంతో చూస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దేశానికి వచ్చే పాతికేళ్లు చాలా కీలకం : రాష్ట్రపతి కొద్ది రోజుల క్రితమే అమృత్ మహోఉత్సవాలు జరుపుకున్నాం. 75 ఏళ్లు స్వాతంత్య్ర భారత్‌కు వచ్చే పాతికేళ్లు చాలా కీలకం. దేశం ఆత్మర్‌నిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోంది. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Rajanna Sircilla: ఎల్లారెడ్డిపేటలో ప్రైవేటు స్కూలు బస్సు - ఆర్టీసీ బస్సు ఢీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సును కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. సిరిసిల్ల వచ్చే దారిలో వెనక నుండి ఢీకొనగా 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. రెండు ఒకే వైపు నుండి వస్తున్నాయని, ఆర్టీసీ బస్ డ్రైవర్ స్కూల్ బస్సును ఢీకొనడంతోనే పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ పిల్లలను హుటాహుటిన అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Vasudha Group: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు
- వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు
- వసుధ గ్రూప్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు
- ఎస్.ఆర్ నగర్‌లో ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు
- మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు
- 40కి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ సోదాలు