Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ప్రారంభం, అమిత్ షా రాజకీయ తీర్మానం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Jul 2022 12:53 PM

Background

నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించినా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. శనివారం నాడు ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని...More

BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ప్రారంభం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు హెచ్ఐసీసీలో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. మొదటి రోజైన శనివారం సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నోవాటెల్ హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే.