Breaking News Live Telugu Updates: ఏపీకి విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించండి, తెలంగాణకు కేంద్రం ఆదేశం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Aug 2022 08:10 PM
ఏపీకి విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించండి, తెలంగాణకు కేంద్రం ఆదేశం 

తెలంగాణ నుంచి ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బాకాయిలు 30 రోజుల్లో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బాకాయిలను చెల్లించేలే ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతుంది. 

ఎల్లుండి బిహార్ కు సీఎం కేసీఆర్, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం  

CM KCR : సీఎం కేసీఆర్ ఆగస్టు 31న బిహార్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

సీఎం కేసీఆర్ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం 

Peddapalli : పెద్దపల్లి సీఎం కేసీఆర్ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.  వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.  

సజ్జల రామకృష్ణారెడ్డితో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో భేటీ అయ్యారు. గత కొద్ది కాలంగా ఆమె పార్టీపై అంసతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంపై అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంపై ఆమె వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత కూడా ఉన్నారు. 

Kakinada Chemical Blast: డ

కాకినాడలో ఓ రసాయన పరిశ్రమలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్ పేలవడం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లోనే ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. వారం క్రితం ప్రమాదం జరిగినా పరిశ్రమ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్యాక్టరీ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దీపావళి నాటికి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు 

Jio 5G Services : రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం జరుగుతోంది. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జియో 5జీ సేవలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు.  దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ముందుగా దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తం జియో 5జీ సేవలు విస్తరిస్తామని వెల్లడించారు.  

జంతు వధపై కర్ణాటక ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా జంతువధ (Animal Slaughter )పై నిషేధం విధించింది. వినాయక చవితి ఉత్సవాలు ముగిసే వరకు జంతువధ చేయరాదని సూచించింది.

Supreme Court: హిజాబ్ బ్యాన్ - కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

క‌ర్ణాటకలోని బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కొంత మంది ముస్లింలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పునిచ్చింది.


నేడు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కర్ణాటక ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ 5వ తేదీన విచారించ‌నున్న‌ట్లు కోర్టు తెలిపింది. 
  

Weather News: సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్!

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంటలో 13.9, వడ్డెమాన్‌లో 10.2, నారాయణపేట జిల్లా జక్లేర్‌లో 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి, రాహుల్ తో భేటీ

  • రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సమావేశం కోసం ఢిల్లీకి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

  • తెలంగాణలో పాదయాత్ర పొడిగించాలని కోరనున్న రేవంత్‌.. తెలంగాణలో 13 రోజులు పాదయాత్ర చేయనున్న రాహుల్‌.. మరో రెండు రోజులు పొడిగించాలని కోరనున్న రేవంత్‌

AP Power Charges: టారిఫ్ లో ఎలాంటి మార్పులు లేవు - దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న విద్యుత్ శాఖ

వినాయక చవితి ఉత్సవాల పందిళ్ళకు విద్యుత్ ఖర్చులు పెరిగాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని గణేష్ ఉత్సవ కమిటీ  సభ్యులకు, భక్తులకు, నిర్వహకులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థన రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్ ను  పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్ కి కూడా రూ.1000 తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750 గా నిర్ణయించామన్నారు.


అప్పట్నుంచీ అవే చార్జీలు:
రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి  అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం 500 వాట్స్ కి రూ.1000, 1000 వాట్స్ కి రూ.2250, 1500 వాట్స్ కి రూ.3,000, 2000 వాట్స్ కి రూ.3,750, 2500 వాట్స్ కి రూ.4,550, 3000 వాట్స్ కి రూ.5,250, 3,500 వాట్స్ కి రూ.6,000, 4000 వాట్స్ కి రూ.6,750, 5000 వాట్స్ కి రూ.8,250, 6000 వాట్స్ కి రూ.9750, 10000 వాట్స్ కి రూ.15750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఈ  కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్తును వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది మండపాల వద్ద అందుబాటులో ఉంటారని, ఏ ఇబ్బంది కలిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయాలని వారు కోరారు.

Tirumala Updates: శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తమిళ సినీ నటుడు విజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులు జూనియర్ శ్రీదేవి, రుక్మిణీ, అరుణ్ విజయ్, ఎమ్మెల్యే రాములు నాయక్‌లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

KCR Peddapalli Tour: నేడు పెద్దపల్లికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా హైదరాబాదు నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా పెద్దపల్లికి చేరుకోనున్న ఆయన రాజీవ్ రహదారికి ఆనుకొని  పెద్దకల్వల వద్ద నూతనంగా దాదాపుగా 49 కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. తిరిగి అక్కడి నుండి మంథని వైపు వెళ్లే రహదారి పక్కన నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ఆ తరువాత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి రెండు గంటలకు పెద్దకల్వల వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు .అయితే రాత్రి వరకు కూడా సీఎం పర్యటన గురించి మినట్టు మినిట్ షెడ్యూల్ పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు.. దీంతో కొంతవరకు సీఎం టూర్ ఏ రకంగా సాగుతుంది అనే దానిపై సందిగ్ధం నెలకొంది. అయితే ఉదయం సమయంలో పూర్తిస్థాయిలో మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో దానికి తగినట్టుగా అటు పోలీసు అధికారులు ఎటు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక కలెక్టరేట్ భవనాన్ని పూలతో అలంకరించారు.

మేడ్చల్ జిల్లాలో అదుపు తప్పిన కారు, మహిళ దుర్మరణం

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ దూలపల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. దూలపల్లి NTR వద్ద జరిగిన ‌ఘటన జరిగింది. రోడ్డు పక్కన మొక్క జొన్నలు అమ్ముకుంటున్న మహిళ (60) మృతి చెందింది. దూలపల్లి నుండి మైసమ్మ గూడ వెళ్తున్న బ్రీజ కారు TS 09 FH T/R 6218 అది వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ దూలపల్లి X రోడ్డు లోని NTR విగ్రహం వద్ద కూర్చుని ఉన్న వృద్ధరాలి పైనుంచి దూసుకొని వెళ్ళింది. దీంతో వృద్దురాలు (60) అక్కడికక్కడే మృతి చెందింది. బ్రీజా కార్ నడిపిస్తున్న అజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Background

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.  


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.


రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవిస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.


తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. 


ఆగస్టు 30, 31న సైతం ఈ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ నగరంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం లేదు. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 23, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.