Breaking News Live Telugu Updates: ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Oct 2022 04:04 PM

Background

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడుతుందని, దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ...More

ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రు హై స్కూల్ కి చెందిన ఐదుగురు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని 108లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హై స్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పంచాయితీ భవన నిర్మాణం కోసం ఐరన్ పనులు చేయడం కోసం విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిని తొలగించకపోవడంతో విద్యార్థులకు షాక్ కు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండుగా ఐదుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.