Breaking News Live Telugu Updates: గుడివాడలో తెలుగుదేశం మినిమహానాడు వాయిదా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
దీపక్ హుడా నుంచి సంచలన విషయాలు! సురేశ్ రైనా, కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ తర్వాత భారత్ తరఫున అతి తక్కువ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన నాల్గవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతను ఈ రాత్రి కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు మరియు భారతదేశం యొక్క T20 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు అతనిని గమనించమని సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చాడు.
తెలుగుదేశం పార్టీ గుడివాడలో చేపట్టేబోయే మినీమహానాడు వాయిదా పడింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్టు పార్టీ లీడర్లు ప్రకటించారు. మహానాడు నిర్వహించబోయే గ్రౌండ్ మొత్తం బురదమమయమైందని అందుకే వాయిదా వేస్తున్నట్టు టీడీపీ చెబుతోంది.
తెలంగాణ రాజ్ భవన్‌లో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో రాజ్ భవన్ సమీపంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను కూడా మళ్లించారు.
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సీజేకు పుష్ఫగుచ్ఛం అందించారు. దీంతో దాదాపు 8 నెలల తర్వాత సీఎం రాజ్ భవన్ కు వచ్చినట్లయింది.
Background
నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడన ద్రోణి ఉత్తర భారత ద్వీపకల్ప 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలులకోత సగటు సుమద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఏపీలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, అంతకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఒకట్రెండు చోట్ల 36, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లులు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు నగరం, కర్నూలు - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని నారాయణపేట, వికారబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -