Breaking News Live Telugu Updates: ఇద్దరు ఆప్ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Feb 2023 06:09 PM
ఇద్దరు ఆప్ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

ఇద్దరు ఆప్ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఆప్ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా రాజీనామాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. ఇద్దరు ఆప్ మంత్రులు తమ మంత్రి పదవులకు మంగళవారం రాజీనామా చేయగా, గంటల వ్యవధిలో వారి రాజీనామాను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. 






 

Mancherial News: మంచిర్యాల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం, 15 మందికి గాయాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1 జోన్ 2లో 2 పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.  నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం వరకు పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయపడ్డారు. కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందికి కుక్కల స్వైర విహారం గురించి ఫిర్యాదు చేయగా.. గత రాత్రి నుండి మున్సిపాలిటీ సిబ్బంది వాటికి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దొరినట్టే దొరికి పారిపోవడంతో మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే వాటిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించడం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

MLA Rajasingh: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించింది. గత కొన్ని రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనం రిపేర్లు రావడంతో రాజాసింగ్ ఇబ్బంది పడ్డారు. ఇటీవల పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ ని కేటాయించింది.

Narayana Swamy: శవ యాత్రలాగా లోకేశ్ పాదయాత్ర - ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘‘ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించా. పాదయాత్ర అంటే ఒక పటుత్వం ఉండాలి.  ఎడారి యాత్రగా తీసుకుని మేము వేసిన రోడ్లపై నడుస్తూ ఏం అభివృద్ధి కాలేదని విమర్శించడం సరైన విధానం కాదు.  సైకో కు సంబందించిన పాదయాత్రగా కనిపిస్తుందే గానీ ప్రజల సమస్యలు తెలుసుకునే పాదయాత్ర కాదు. చంద్రబాబు నేను మారాను అని చెప్తాడు. మ్యానిఫెస్టో పెడుతాను అంటాడు.  మ్యానిఫెస్టో పెట్టి నేను మహిళా లోన్ లు ఎత్తి వేసానంటాడు, ఇండ్లు ఇచ్చానని, అభివృద్ధి చేసానంటాడు.  ఔరంగాజేబు మనస్తత్వం కలిగి వ్యక్తి చంద్రబాబు నాయుడు.  పాదయాత్రలో శిలాఫలకం కొట్టుకుంటూ పోతూ ఒక‌ సర్పంచ్, జెడ్పిటీసీ‌, ప్రజల్లో‌ పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు లోకేష్.  లోకేష్ పాదయాత్ర శవయాత్రగా కనిపిస్తోంది.


శిలాఫలకాలు కొట్టుకుంటూ పోయే పాదయాత్ర సైకోల పాదయాత్రగా నేను భావిస్తున్నా. చిన్న పిల్లాడు, మాటలు రానోడు, ప్రజలను మెప్పించలేనోడు రోడ్లపై పరిగెత్తి ఏదో చేసుకుంటూ పోతున్నాడు.  పిచ్చోడు ఎప్పుడూ ఏం చేస్తాడో, ఏం చెప్తాడో ప్రజలకు తెలియడం లేదు. కోటీశ్వరులంతా, భూకబ్జాదారులంతా ఒక్కటై జగన్ రామరాజ్యాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు.  ప్రజలు ఎప్పుడూ జగన్ ను నిలబెట్టుకుని శాశ్వత సీఎంను చేస్తారు’’ అని నారాయణ స్వామి అన్నారు.

Bairi Naresh News: అయ్యప్ప భక్తుల అరెస్టు

  • హన్మకొండ జిల్లాలో నిన్న సాయంత్రం బైరి నరేష్ ను అడ్డుకొని దాడి చేసిన  అయ్యప్ప భక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

  • తెల్లవారుజామున  3 గంటలకు  జనగామలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ & సుబేధారి పోలీసులు 

  • హన్మకొండ టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో అయ్యప్ప భక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వార్తలు

  • అయ్యప్ప స్వామి భక్తులను చిత్రహింసలకు గురిచేస్తే ఆందోళనలు చేస్తామంటున్న అయ్యప్ప భక్తులు

  • హన్మకొండ REC వద్ద ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నేతలు

Minister KTR Tour in Sircilla: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన వివరాలు

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గ పర్యటన వివరాలు

  • ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం మొహినికుంటలో కల్వకుంట్ల చక్రధర్ రావు గారి  కుటుంబానికి పరామర్శ 

  • ఉదయం 11.30 గంటలకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఎల్లారెడ్డిపేటలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

  • మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం

  • మధ్యాహ్నం 1 గంటకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరు. రైతువేదిక ప్రారంభోత్సవం 

  • మధ్యాహ్నం 2 గంటలకు రాచర్ల బొప్పాపూర్ లో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం

  • మధ్యాహ్నం 2.30 గంటలకు రాగట్లపల్లిలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం 

  • సాయంత్రం 3 గంటలకు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం

  • సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ లో ఇళ్ల పట్టాల పంపిణీ సిరిసిల్ల టౌన్

SI Exam Results Release: ఎస్సై పరీక్షా  ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 19న దీనికి సంబంధించి పరీక్షను నిర్వహించారు. దాదాపు 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకూ ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం ఉందని ఏపీఎస్ఎల్‌పీఆర్బీ వెల్లడించింది. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

Hyderabad IT Raids: హైదరాబాద్‌లోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు

  • హైదరాబాద్ లోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

  • ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పై కొనసాగుతున్న ఐటీ సోదాలు

  • హైదరాబాద్‌లో 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు

  • దిల్‌సుఖ్ నగర్ లోని Googee ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. రాత్రి పూట చలి విషయంలో నేడు 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.









 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 


ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.


కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.