Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Sep 2022 08:10 PM
తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. రెండు రోజుల పర్యటనకు తిరుమల చేరుకున్న సీఎం జగన్...శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న బేడీ ఆంజనేయ గుడి వద్దకు చేరుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదుటిపై తిరునామం ధరించారు.  బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి కి పరివట్టం కట్టిన ఆలయ ప్రధాన అర్చకులయ వేణుగోపాల్ దీక్షితులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి,ఆర్కే రోజా, ఇతర ఎమ్మెల్యేలు టిటిడి అధికారులు ఉన్నారు.

ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు : అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం .. ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కామెంట్స్...
రైతుల పాదయాత్రను అడ్డుకోవటానికి 5 నిమిషాలు చాలు అని మంత్రి బొత్సా అంటున్నాడు.
రాష్ట్రం బొత్సా జాగీరు కాదు.
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు....
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా అని ప్రశ్నిస్తున్నారు..??
దద్దమ్మల్లారా అభివృద్ధి చేస్తే ఎవరు వద్దంటున్నారు...?
అచ్చన్నాయిడు వద్దంటున్నాడా..? చంద్రబాబు వద్దన్నాడా..??
ఉత్తరాంధ్రా ను అభివృద్ధి చేస్తామంటే ఉత్తరాంధ్ర ప్రజలు వద్దంటున్నారా..?
ప్రజలను మభ్యపెట్టడానికే మూడు రాజధానులు డ్రామాలు.
ఈ మూడు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు ఏమి చేశారు? 
మీరు చేయకపోగా ,ఉన్న అభివృద్ధిని పాతాళంలోకి తొక్కేశారు...
ఉత్తరాంధ్ర పై ప్రేమతో మీరు మాట్లాడడంలేదు...
కేవలం ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికే మీ  కపట ప్రేమ...
చివరికి ప్రకృతి ఇచ్చిన రుషి కొండను సైతం కాజేస్తున్నారు...
అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి.
పాదయాత్రకు ఆటంకం కలిగించాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా నాడు జగన్ అమరావతి రాజధాని కి అంగీకరించారు.

Kamareddy News: కామారెడ్డిలో బీజేపీ ఇంచార్జి దీక్ష భగ్నం

  • ‘ధరణితో రైతుల గోస’ పేరుతో కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

  • రమణారెడ్డిని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు

  • రమణా రెడ్డిని ఏ పోలీస్ స్టేషన్ కు తరలించారో గోప్యంగా ఉంచిన పోలీసులు

  • దీక్ష శిబిరం వద్ద కుర్చీలు, టెంటు తొలగించేందుకు యత్నం

  • అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు.. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం

మూడు రాజధానులు ఓ నాటకం - వికేంద్రీకరణ బూటకం: తులసీ రెడ్డి

ప్రభుత్వం తీరుపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి వ్యాఖ్యలు


వైకాపా చెబుతున్న మూడు రాజధానుల మాట ఒక నాటకం - వికేంద్రీకరణ పాట ఒక బూటకం


➖రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అంటారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని మాత్రమే ఉంది. రాష్ట్ర సచివాలయం ఉన్న ప్రాంతాన్నే రాష్ట్ర రాజధాని గా గుర్తించారు


➖హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం తదితర 13 రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టు లు ఉన్నాయి. వాటిని రాజధానులు అనడం లేదు


➖కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉంది. కానీ కొచ్చిన్ ను కేరళ రాజధాని అనరు. రాష్ట్ర సచివాలయం ఉన్న త్రివేండ్రం ను మాత్రమే కేరళ రాజధాని అంటారు


➖అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు. కర్ణాటక లో బెంగళూరు లో, బెల్గాం లో అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. అసెంబ్లీ భవనం ఉన్న బెల్గామ్ ను కర్ణాటక రాజధాని అనరు. రాష్ట్ర సచివాలయం ఉన్న బెంగళూరు ను మాత్రమే కర్ణాటక రాజధాని అంటారు


➖కాబట్టి ఇప్పటికైనా పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అనే పడికట్టు పదాలను వైకాపా ప్రభుత్వం మానుకోవాలి


➖పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు


➖అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారు


➖హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరు, హై కోర్టు అని మాత్రమే అంటారు.

Konaseema District News: పాశర్లపూడి గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ జరిగింది. పాశర్లపూడి గ్రామంలో కొబ్బరి తోటలో ఓఎన్జీసీకి చెందిన పైప్ లైన్ లీకేజ్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పైప్ లైన్ లీకైన విషయాన్ని స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. లీకేజీకి గురైన పైప్ లైన్ ఏ బావి (వెల్ ) కి చెందినది అనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

CM Jagan News: సీఎం జగన్ పర్యటన రేపు, తిరుపతిలో హడావుడి

తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనతో తిరుపతి నగరంలో గోడలకు వైసీపీ జెండా రంగులు పడ్డాయి. సీఎం రాకతో తిరుపతి ప్రధాన రోడ్డులో గోడలకు ఏర్పాటు చేసిన బొమ్మలపై వైసీపీ రంగులు వేశారు. చాలా కాలం క్రితం ఎంతో ఖర్చు పెట్టి గోడలపై వివిధ రకాల బొమ్మలను వేయించారు. సీఎం పర్యటన నేపథ్యంలో హడావిడిగా సోమవారం బొమ్మలపై రంగులు వేశారు. ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telangana News: రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ ద్వారా మందుల సరఫరా

రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ ద్వారా మందుల సరఫరా


నిజామాబాద్ నుంచి నిర్మల్ కు డ్రోన్ ద్వారా 20 కేజీల మందులు సరఫరా..... 
 టీశా-మెడికార్ట్ అనే కంపెనీ రాష్ట్రంలో డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. తొలిసారి నిజామాబాద్ నుంచి 70కి.మీ దూరంలోని నిర్మల్ కు మందులను చేరవేసింది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా అరగంటలోనే మందులు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. 400 అడుగుల ఎత్తులో ఎగిరి ఈ డ్రోన్.. క్యూఆర్ కోడ్ ను పసిగట్టి ల్యాండ్ అయింది. 20కేజీల వరకు ఇది మందులను సరఫరా చేయగలదు. ఎంపీ అరవింద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా 3 పదవులకు రాజీనామా చేశా: యార్లగడ్డ

విజయవాడ: మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్


వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి , వైయస్సార్ పేరు పెట్టడం సబబు కాదు


ఎన్టీఆర్ తో నాకు ఉన్న అనుబంధం కారణంగా నాకు ఉన్న మూడు పదవులకు రాజీనామా చేసాను


అదే రోజు రాజీనామా పత్రాలు అధికారులకు పంపాను


నిన్న ఒక దినపత్రికలో స్వరం మార్చిన యార్లగడ్డ అని వార్త ఇచ్చారు


ఆ పత్రిక యజమాన్యానికి లేఖ ద్వారా స్వరం మార్చలేదు, రాజీనామా పై వెనక్కి తగ్గేది లేదు


భాషాభివృద్ధికి పదవే అవసరం లేదు, పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తాను


లేఖ రాసాక ఇవాళ సవరణ అని వార్త ఇస్తారనుకున్న కానీ సవరణ ఇవ్వకుండా తిడుతున్నట్లు వార్త ఇచ్చారు


రాజీనామా చేసి జగన్ ను తిడుతున్నారెందుకు అని అమెరికా నుంచి కూడా అడుగుతున్నారు


నేనెప్పుడూ జగన్ ను పల్లెత్తు మాట అనలేదు


మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను


పేరు మార్చడం నచ్చలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చేసా


రాజీనామా పై వెనుకడుగు వేసేది లేదు


మళ్లీ తీసుకోమన్నా .. నేను వద్దనే చెబుతాను


లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఆమె ఇష్టం.. నేను స్పందించను


కొత్తగా ఏర్పడిన ఏపిలో   రాజధాని కి యన్టీఆర్‌ పేరు వచ్చేలా పెట్టాలని ఎప్పుడో చెప్పాను


ఆనాటి‌ ప్రభుత్వం అమరావతి అని పేరు పెట్టింది


దేవేంద్రుడు రాజధాని అమరావతి.. ఆ పేరు ఎపికి ఎందుకు


నేను మాట మార్చలేదు... నిర్ణయం మార్చుకోలేదు


సందేహాలు ఉంటే నా నబర్ 9849067343కి కాల్ చేస్తే అన్ని ఆధారాలు ఇస్తా


ఇకనైనా నా పై అబద్దపు ప్రచారాలు ఆపాలని కోరుతున్నా

Jeedimetla: ఇంటి వద్ద పార్క్ చేసిన 15 ద్విచక్రవాహనాలు, అటోను తగులబెట్టిన సైకో

జీడిమెట్ల సమీపంలో అర్దరాత్రి వివేకానంద నగర్ ప్రాంతంలో వివిధ ఇండ్ల వద్ద పార్క్ చేసిన 15 బైకులు ఒక అటోకు నిందితుడు పరమేశ్వర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పెట్రోల్ అదే బైక్ లలో నుండి తీసి వాటిపై పోసి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి 2.30  సమయంలో పొగలు రావడంతో స్దానికులు లేచి మంటలను ఆర్పి జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్దలానికి చేరుకొని సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితుడిని కోసం గాలిస్తున్నారు. వాహనాలు పూర్తిగా  తగలపడిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే పరమేశ్వర్ (24) జులాయిగా తిరుగుతూ తరచూ ఇతరులతో గొడవ పడుతుంటాడు. ఇతను సైకోగా ప్రవర్తిస్తాడని స్థానికులు తెలిపారు. 

CM Jagan: ఈ నెల 28న గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్

ఈ నెల 28న గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లిలో సమావేశం జరుగుతుంది. ఇందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

KTR In Sircilla: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

  • ఉదయం 11:30 గంటలకు ఎల్లమ్మ జంక్షన్ అభివృద్ధి & కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ 
    (పబ్లిక్ మీటింగ్)

  • మధ్యాహ్నం 1.30 గంటలకు వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

  • మధ్యాహ్నం 2:30 గంటలకు ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం 

  • మధ్యాహ్నం 3 గంటలకు ఆఖరి సఫర్ వెహికల్ ప్రారంభోత్సవం 

  • మధ్యాహ్నం 3:30 గంటలకు మోడల్ అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవం

  • సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం

Background

నైరుతీ రుతుపవనాల ముగింపు దశకు రావడంతో వీటి ప్రభావంతో చివరిసారి భారీగా వర్షాలు కురవనున్నాయి. నిన్న ఏపీ, తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. తెలంగాణ నుంచి భారీ మేఘాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా ఏపీలోని ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లోకి రాత్రి ప్రవేశించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఆగస్టు 1 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 


మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కొమురం భీమ్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ లో నేడు సైతం కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. అయితే 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వర్షం పడకపోతే  మధ్యాహ్నానికి ఉక్కపోత సైతం అధికం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడతారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 5 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.