Breaking News Live Telugu Updates:కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యేల కేసులో అరెస్టైన నిందితులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Oct 2022 04:26 PM
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యేల కేసులో అరెస్టైన నిందితులు 

ఎమ్మెల్యే వ్యవహారంలో అరెస్టైన ముగ్గురి నిందితుల విచారణ పూర్తయింది. కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్ట్ కి నిందితులను తరలించనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రామచంద్ర భారతి( A1), నంద కుమార్ (A2), సింహయాజి స్వామి( A3)లపై FIR నమోదు అయింది.   

TRS MLA: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసు నమోదు

  • రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు

  • మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో స్వామీజీ, నందు, సతీష్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • 120-B, 171-B r/w 171-E 506 r/w 34 IPC & Sec 8 of Prevention of corruption Act-1988 section కింద కేసు

  • బీజేపీలో చేరెందుకు 100 కోట్ల రూపాయలు డీలింగ్ నడిచినట్లు పేర్కొన్న రోహిత్ రెడ్డి

  • ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని డీలింగ్ నడిచినట్లు తెలిపిన రోహిత్ రెడ్డి

  • స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్న రోహిత్ రెడ్డి

  • డీలింగ్ లో భాగంగానే తన ఫామ్ హౌస్ కు వచ్చారని తెలిపిన రోహిత్ రెడ్డి

Bharat Jodo Yatra: ఒగ్గుడోలు కళా ప్రదర్శనను తిలకించిన రాహుల్ జీ

భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో  భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నాగరాజు కళాబృందం టేకులపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ గారు ఒగ్గుడోలు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. ఈ సందర్భంగా కళాకారులు  పలు విన్యాసాలు చేసి చూపించారు. గొల్ల కురుమ లకు సంబంధించిన ఈ కళాకారుల విశిష్టత గురించి రాహుల్ గాంధీ గారికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వివరించారు.

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ రెండోరోజు పాదయాత్ర షురూ

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర రెండవ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలో కొనసాగుతోంది. మక్తల్ సబ్ స్టేషన్ దగ్గర  నుంచి పాదయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభం అయింది. ఇవాళ పాదయాత్ర 26.7 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. నేడు బండ్ల గుంటలో లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. యలిగండ్ల శివారులో రాత్రి బస ఉంటుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Background

సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. కానీ, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడుతుందని, దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


సిత్రంగ్ తుపాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను భీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా కొన్ని జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. కాక్స్ బజార్ తీరం నుంచి వేల మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. 576 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లుగా అధికారులు తెలిపారు.


పెరుగుతున్న చలి
ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఇక అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 15 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత​ పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, మేఘాలు లేకపోవడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. తూర్పు కోస్తా నుంచి వీస్తున్న గాలుల తీవ్రత రెండు మూడు రోజుల్లో పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి, మూడు నాలుగు రోజుల్లో, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కనిపిస్తుందని తెలిపారు.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
ఇక సిత్రంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాతావరణ శాఖ ముందుగా తెలిపినట్లే సిత్రాంగ్ తుపాను ఏపీపై ప్రభావం చూపలేదు. సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటడంతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.