Breaking News Live Telugu Updates: రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చు- మాజీ మంత్రి పేర్ని నాని  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Dec 2022 05:59 PM
రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చు- మాజీ మంత్రి పేర్ని నాని  

మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చన్నారు. హరిరామ జోగయ్య దీక్షను స్వాగతిస్తున్నామన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి వచ్చినప్పుడు కాపు సీఎం కావొచ్చన్నారు. 

దిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం జగన్ 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీ బయలుదేరారు. రేపు(బుధవారం) మధ్యాహ్నం ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. 

Telangana BJP: బీజేపీ ఆందోళన, బీఆర్ఎస్ పార్టీపై ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు ధర్నా, రైతు దీక్ష పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Tirumala News: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు దర్శించుకున్నారు.. మంగళవారం ఉదయం స్వామి వారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు, తెలంగాణ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ రావు, ఇందుకూరి రఘురాజులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,‌ ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ప్రసాదాలు అందజేశారు.

Woman Cricket Coach: తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా బుర్రా లాస్య 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్రా లాస్య తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక పరీక్ష నిర్వహించగా.. దేశంలో ఎంపికైన ముగ్గురు క్రీడాకారుల్లో లాస్య ఒకరు. బాల్యం నుంచే లాస్యకు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి. అదే ఆసక్తితో క్రికెట్‌ ఆట మెలకువలపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఐసీసీ నిర్వహించే మొదటి శ్రేణి శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. అందులో ఉత్తీర్ణత సాధించి కోచ్‌గా ఎదిగారు. శనివారం తన తండ్రి రమేష్‌తో కలిసి వచ్చిన లాస్య.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించి రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. లాస్య తల్లి సునీత జాతీయ అథ్లెట్‌. తండ్రి రమేష్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు. ప్రస్తుతం లాస్య తల్లి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల అధికారిణిగా, తండ్రి జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మనుగా కొనసాగుతున్నారు. క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లాస్య తెలిపారు.

Medical Education: కొత్త కాలేజీలతో పెరిగిన మెడికల్ సీట్లు - హరీశ్ రావు

  • 8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు!

  • రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు

  • కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలతో అదనంగా 1150 ఎంబీబీఎస్‌ సీట్లు

  • బి- కేటగిరీలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్‌

  • 6శాతం నుంచి 10శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్‌

  • రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు భారీగా తగ్గిన మార్కుల కటాఫ్‌

  • రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన వైద్య విద్య అవకాశాలు

  • డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేస్తున్న తెలంగాణ సర్కారు నిర్ణయాలు

  • వైద్య సీట్లలో దేశంలోనే అగ్రస్థానానికి చేరిన తెలంగాణ

  • జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్‌ సీట్లలో నెం.1, పీజీ సీట్లలో నెం.2

  • సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం చేరువ అవుతున్నామని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్య

MLA Rohit Reddy: ఈడీ విచారణకు రానన్న రోహిత్ రెడ్డి, బలమైన కారణం చెప్పిన ఎమ్మెల్యే

బెంగళూరు డ్రగ్స్ కేసులో రేపు రెండో సారి ఈడీ విచారణ ఉండగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాను విచారణకు రానని చెప్పారు. ఆ మేరకు తాను ఈడీ ఆఫీసుకు రావడం లేదని ఈడీకి మెయిల్ పంపారు. హైకోర్టులో రిట్ పిటిషన్ నేపథ్యంలో రోహిత్ రెడ్డి పిటిషన్ కోర్టులో రేపు విచారణకు రానుంది. అందుకే మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది.

Background

శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నైరుతి దిశగా కదులుతున్నందున సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదైంది.

పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

‘‘నేడు అక్కడక్కడ మాత్రమే, కొద్ది పాటి వర్షాలను చూడగలము. నిన్న శ్రీలంక మీదుగా ఉన్న అల్పపీడనం నేడు హిందూ మహాసముద్రం వైపుగా వెళ్లింది. దీని వలన మనం నేడు కొద్దిసేపు వర్షాలు, ఎండ మారుతూ ఉండడాన్ని గమనించవచ్చు. దక్షిణ ఆంధ్ర జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, చిత్తూరు అలాగే సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం చూడగలం. కడప జిల్లాలోని పలు భాగాల్లో కూడా వర్షాలు ఉంటాయి. రేపటికి ఈ వర్షాలు మరింత తగ్గుముఖం పట్టనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,480 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,480 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.