Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Mar 2023 04:49 PM

Background

నిన్నటి ద్రోణి విధర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఉంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో తుపాను ప్రసరణ...More

కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని డి.శ్రీనివాస్ అన్నారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలన్నారు. ఆ సందర్భంలో తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్... తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేకు లేఖ రాశారు డీఎస్.