Breaking News Live Telugu Updates: ఆ మాటలు ఫ్లోలో వచ్చాయ్, అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ వివరణ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Jan 2023 02:07 PM
ఆ మాటలు ఫ్లోలో వచ్చాయ్, అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ వివరణ 

అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ వివరణ ఇచ్చారు.  ఆ మాటలు ఫ్లోలో వచ్చాయని, అంతేకానీ అక్కినేనిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్ అని పిలిచేవాడినని, ఆయనపై ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు. ఆయన తనపై ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు.  

Droupadi Murmu: గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో రాజ్ పథ్ మార్గంలో గణతంత్ర వేదిక వద్దకు బయలుదేరారు. ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి ముగ్గురు నేతలు వెళ్లారు. ఆ తర్వాత ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

Minister Harish Rao: గణతంత్ర వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదారాబాద్ లోని కోకాపేట్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 74 ఏళ్లు అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు స్వేచ్ఛ, హక్కులను ప్రసాదించిన ఈరోజు ఒక పండుగ రోజు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రి దేశ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi: జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు

జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, త్రివిధ దళాల చీఫ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఉన్నారు.

జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ

జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు. 





Governor Tamilisai: కొంత మందికి నేను నచ్చకపోవచ్చు - తమిళిసై

ప్రసంగం చివర్లో తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా తెలుగులో మాట్లాడారు. కొంత మందికి తాను నచ్చడం లేదని అయినా తెలంగాణ ప్రజల కోసం తాను తన పని నిబద్ధతతో చేస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని అన్నారు.

Telangana Republic Day: తెలంగాణ రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలు

తెలంగాణ రాజ్ భవన్‌లో ఉదయం 7 గంటలకే గణతంత్ర వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ అంటూ తమిళిసై తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తర్వాత ఆంగ్లంలో ప్రసంగించారు.

Background

జనవరి చివరి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 27న ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి, 28న అల్ప పీడనంగా మారుతుందని తెలిపారు. అయితే, శ్రీలంకకు దక్షిణ భాగంలో ఇది ఏర్పడడం వల్ల ఆంధ్రా, తెలంగాణపై దీని ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు మాత్రం పొగమంచు అంతగా ఉండదని వివరించారు. అంతా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. రాయలసీమలోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.


ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. త్వరలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదు. మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. కొన్ని చోట్ల పొగమంచు అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.