Breaking News Live Telugu Updates:హనుమకొండ బీజేపీ సభాస్థలి అనుమతి రద్దు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Aug 2022 09:42 PM
హనుమకొండ బీజేపీ సభాస్థలి అనుమతి రద్దు 

హనుమకొండ బీజేపీ సభకు అనుమతి ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. పోలీసుల నుంచి సమాచారం రాని కారణంగా సభ అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ లేఖ రాశారు. సభ కోసం కాలేజీ గ్రౌండ్ కు చెల్లించిన రూ.5 లక్షలు వాపస్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎల్లుండి ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు.   

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసే పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. 

మతపిచ్చి లేపే తెలంగాణ కావాలా -పంటలు పండే తెలంగాణ కావాలా: కేసీఆర్

కొంగరకలాన్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే రాజకీయానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేసిన మోదీ ఆధ్వర్యంలోనే బీజేపీ... తెలంగాణపై పడిందన్నారు. అర్థంపర్థంలేని మత పిచ్చి లేపి ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేద్దామనుకుంటోందని విమర్శించారు. 


గతంలో జరిగిన చిన్న తప్పు కారణంగా యాభై ఎనిమదేళ్లు తెలంగాణ అనేక బాధలు అనుభవించిందని గుర్తు చేశారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత క్రమంగా సమస్యల నుంచి బయటపడుతున్నామన్నారు. ఇలాంటి సందర్భంలో మరోసారి తప్పు చేస్తే మాత్రం ఇకపై కోలుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశంలో నడుస్తున్న అసూయ రాజకీయలను గమనించాలని ప్రజలకు హితవు పలికారు. 


భారత్‌లో ఏ రాష్ట్రంలో లేని అద్భుత సంక్షేమ పథకాలు ఇక్కడ అందిస్తున్నామన్నారు కేసీఆర్.  రైతులతోపాటు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు... వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇలాంటి సదుపాయాలు వస్తాయన్ని ఎప్పుడైనా అనుకున్నామా అని ప్రశ్నించారు. సొంత పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి సదుపాయాలు ఉండాలా.. వద్దా... ఇవి కాపాడుకోవాలా.. వద్దా అని ప్రశ్నించారు. నిద్రపోతే చాలా ప్రమాదానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 


పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో మంటలు రేపే తెలంగాణ కావాలా అని ప్రజలను అడిగారు సీఎం కేసీఆర్.  సంకుచిత మత పిచ్చి మంటలు మండే రాష్ట్రమైతే భవిష్యత్‌ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇవాళ ఇండియా ఏం జరుగుతోందో చూడాలన్నారు. దీన్ని సహించుకొని మౌనంగా ఉందామా.. పిడికిలి ఎత్తి పోరాడదామా... అని సలహా అడిగారు.  కేంద్రం ఒక్కటంట్టే ఒక్కటైనా మంచి పని చేసిందా అని నిలదీశారు. ఆ చేసిన పని ఏమైనా కనిపిస్తుందా.. ఒక్కప్రాజెక్టైనా కట్టారా అని క్వశ్చన్ చేశారు. ప్రధాని, మంత్రులు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని వారి చేసిన మంచి ఏంటో చెప్పాలన్నారు.  


తాను సీఎం అయిన తర్వాతే మోదీ పీఎం అయ్యారని గుర్తు చేశారు. తాము తెలంగాణంలో 24గంటలు కరెంటు ఇస్తున్నామని.. దేశంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. అలాంటి వాళ్లు మాత్రం ఇక్కడకు వచ్చి నీతులు చెప్పాలా.. డైలాగ్‌లు చెప్పాలా.. వాళ్ల మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోవాలా అని అడిగారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కి మరో షాక్, బీజేపీలోకి శ్రీరాం చక్రవర్తి 

Karimnagar Congress : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఇవాళ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు.  కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరుస్తూ ఆహ్వానించడంపై శ్రీరాం చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు  రాహుల్ గాంధీ విముక్తి చూపిస్తున్న టైంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు వస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇంతలో ప్రక్రియే వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ పోలీసుల నుంచి నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు మళ్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ఇంకోసారి అరెస్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో రాజాసింగ్ తన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ సహా శాయినాథ్‌ గంజ్ పీఎస్‌లలో నమోదైన కేసులలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. 41 ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి.

Chandrababu In Kuppam: రోడ్డుపై కూర్చొని చంద్రబాబాబు నిరసన

కుప్పంలో నేడు ప్రారంభించనున్న అన్నా క్యాంటిన్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు నిరసనగా ప్రస్తుతం కుప్పం రెండో రోజు పర్యటనలో ఉన్న ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతకుముందు ఆయన కార్యకర్తలతో కలిసి కుప్పంలోని అన్నా క్యాంటిన్ వరకూ ర్యాలీగా వచ్చారు. 

Chandrababu Kuppam Tour: రెండో రోజు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన - వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం

  • రెండో రోజు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం

  • భారీగా మోహరించిన పోలీసులు..

  • నిన్న కొల్లుపల్లిలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తలెత్తిన ఘర్షణ

  • నేడు కుప్పంలో వైసీపీ నేతలు బంద్ కు పిలుపు

  • రెండో రోజు చంద్రబాబు పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభం..

  • ప్రారంభోత్సవానికి చేరుకుని అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నేతలు

  • అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ నాయకులపై దౌర్జన్యంతో దాడికి దిగ్గిన వైసీపీ నేతలు.

  • వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

  • కుప్పంకు చేరుకున్న చిత్తూరు ఎస్పీ

  • వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద, కట్టుదిట్టమైన బలగాళ్లతో మోహరించిన పోలీసులు

  • పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి

  • కుప్పంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసు యంత్రాంగం

Governor Tamilisai: కాసేపట్లో వరంగల్ పర్యటనకు గవర్నర్ తమిళిసై

టీఆర్ఎస్, బీజీపీల మధ్య పొలిటికల్ వార్ తో ఓ వైపు రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు ఆమె వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీకి కాసేపట్లో చేరుకోనున్నారు. యూనివర్శిటీలో జరిగే 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేయనున్నారు. మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. 


గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు బయల్దేరారు. కార్యక్రమం అనంతరం రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. ఇటీవలి కాలంలో గవర్నర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమె ఇచ్చిన హైటీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ పర్యటనకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ యూనివర్శిటీలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్నాతకోత్సవం జరిగే ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

Governor Tamilisai: కాసేపట్లో వరంగల్ పర్యటనకు గవర్నర్ తమిళిసై

టీఆర్ఎస్, బీజీపీల మధ్య పొలిటికల్ వార్ తో ఓ వైపు రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు ఆమె వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీకి కాసేపట్లో చేరుకోనున్నారు. యూనివర్శిటీలో జరిగే 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేయనున్నారు. మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. 


గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు బయల్దేరారు. కార్యక్రమం అనంతరం రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. ఇటీవలి కాలంలో గవర్నర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమె ఇచ్చిన హైటీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ పర్యటనకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ యూనివర్శిటీలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్నాతకోత్సవం జరిగే ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర సహాయక మంత్రి రామేశ్వర్ తిలీ, మాజీ రాజ్యసభ సభ్యుడు టిజీ వేంకటేష్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి‌ స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్వకేట్ కరుణ సాగర్‌కు బెదిరింపు కాల్స్, పోలీసులకు ఫిర్యాదు

రాజాసింగ్ జైలుకు వెళ్లకుండా వాదించి బయటికి తీసుకువచ్చిన అడ్వకేట్ కరుణ సాగర్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. తనను చంపుతామంటూ రాష్ట్రం నుండే కాకుండా వివిధ దేశాల నుండి ఫోన్లో బెదిరించినట్లు వెల్లడించారు. అయితే, ఎన్ని కాల్స్ వచ్చినా తాను భయపడేది లేదని పేర్కొన్నారు. హిందు ధర్మం కోసం పని చేసే ప్రతి ఒక్కరికి తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Background

ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ పై ఈ వాయు గుండం ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని వివరించారు.


అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో నేటి నుంచి వచ్చే 4 రోజుల పాటు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. 


26వ తేదీన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వాతావరణ విభాగం వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లా్ల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులుహెచ్చరించారు. అరటి తోటలు సహా కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


‘‘రాష్ట్రంలో కోస్తా భాగాల మీదుగా ఏర్పడుతున్న రెండు ఉపరితల ఆవర్తనాల వల్ల ఈ రోజు నుంచి వర్షాలు జోరందుకోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నగరం పరిసరాలు, అనకాపల్లి, పాడేరు (అరకు వ్యాలీ), ఉభయ గోదావరి జిల్లాలోని పలు భాగాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలను చూడగలం. ఇవి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడాలంటే ఒకటి తెలంగాణ నుంచి మన వైపుగా రావాలి, లేదా ఒడిషా నుంచి రావాలి లేదా రాయలసీమ నల్లమల అటవి నుంచి రావాలి. ఈ సారి మాత్రం రాత్రి రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప​, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరులో మొదలై నెల్లూరు, ప్రకాశం మీదుగా బాపట్ల గుంటూరు, విజయవాడ జిల్లాల్లోకి ఈ రోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారిజామున వర్షాలు విస్తరించనుంది. రేపు తెల్లవారిజామున ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుండనుంది. మరో వైపున తెలంగాణ హైదరాబాద్ లో అర్ధరాత్రి రేపు తెల్లవారిజామున వర్షాలను మనం చూడగలము’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.