Breaking News Live Telugu Updates: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Subhash Patriji No More : ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌కు ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం పత్రిజీ మరణించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు తెలిపింది.
Subhash Patriji No More : ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌కు ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం పత్రిజీ మరణించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు తెలిపింది.
Prakasam Barrage : కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్యారేజ్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల గరిష్ట స్థాయికి నీటిమట్టం చేరడంతో అధికారులు 70 గేట్లలో 30 గేట్లను 2 అడుగుల చొప్పున, 40 గేట్లను ఒక అడుగు చొప్పున మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 76,266 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇందులో కృష్ణ డెల్టా కాలువలకు 4924 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద నిలకడగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- హైదరాబాద్ బంజారాహిల్స్ లో హుక్కా పార్లర్ పై టాస్క్ ఫోర్స్ రైడ్స్
- ఇద్దరు నిర్వాహకులు ఫిరోజ్, కైఫ్ ల అరెస్ట్
- ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా హుక్కా పార్లర్ నిర్వహణ
- 20 హుక్కా పాట్స్, 8 బాక్స్ ల ఫ్లేవర్స్, 3 సిల్వర్ రోల్స్, 20పైప్స్ సహా పలు సామాగ్రి స్వాధీనం
శ్రావణ భార్గవి అంశంపై బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. శ్రీవారి ఆలయం ముందు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యలని తెలిపారు.. 32 వేల సంకీర్తనలు స్వామి వారిపై భక్తితో ఆలపించారన్నారు. కొందరు భుక్తి కోసం స్వామి వారి సంకీర్తనలు ఇష్టానుసారం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సంగీత కళాకారులైన శ్రావణ భార్గవి సైతం స్వామి వారి కీర్తనలను తినుబండారాలు తింటూ కాళ్ళు ఊపుతూ చిత్రీకరించడం సబబు కాదన్నారు.. ఇలాంటి పనులు చేసే సమయంలోనే ఆలోచించాలని సూచించారు. భక్తితో పాడితే ఆలయంలో పాడాలి, ఇలా ఇంట్లో పడుకొని ఎవరు పాడరని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై టీటీడీ, అన్నమయ్య వంశస్థులు పేటెంట్ తీసుకోవాలని డిమాండ్ చేసారు.. స్వామి వారి పాదాలకు అంకితం చేసిన కీర్తనలు ఇష్టానుసారం వినియోగించరాదని అన్నారు. అలా ఎవరైనా వినియోగిస్తే టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్., బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏక్తా కపూర్., బీహార్ మంత్రి ప్రమోద్ కుమార్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం అందించగా,ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత 15 రోజులుగా వరద కొనసాగుతూనే ఉంది. వానా కాలం సీజన్ ఆరంభంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీకి ఈ జులై మాసంలో రికార్డు స్థాయిలో వరద వస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గత కొన్ని రోజులుగా నీటితో కళకళలాడుతోంది. భారీగా వరద దిగువ గోదావరికి వెళుతోంది. 18 గేట్ల ద్వారా వరదను దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.6అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.14 టీఎంసీలుగా ఉంది.
Background
నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మరో 4 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. జూలై 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉత్తర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బలపడిన రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్తక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తోంది.
అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టంపై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు జార్ఖండ్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఒడిశా, పరిసర ప్రాంతాలపై ఉండగా.. సగటు సముద్ర మట్టంపై 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న మూడు నుంచి 5 రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం .. ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయని ఈ 5 ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -