Breaking News Live Telugu Updates: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు, యథావిధిగా కేబినెట్ భేటీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Jun 2022 10:00 PM

Background

నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ...More

సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు, యథావిధిగా కేబినెట్ భేటీ

రేపటి ఏపీ  కేబినెట్ భేటీ యథావిధిగా జరగనుంది. సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దైన కారణం కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ రేపు దిల్లీ  వెళ్లనున్నట్లు ముందు వార్తలు వచ్చాయి కానీ ఆ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. మంత్రులందరూ 11 గంటలకు హజరవ్వాలని సీఎంవో ప్రకటన జారీ చేసింది.