Breaking News Live Telugu Updates: మంత్రి మల్లారెడ్డి బంధువు సంతోష్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు సీజ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Nov 2022 05:10 PM
మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు స్వాధీనం 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి బంధువు సంతోష్ రెడ్డి ఇంట్లో భారీ నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేస్తు్న్నారు. రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. 

Mallareddy News: ఆస్పత్రికి మంత్రి మల్లారెడ్డి, వెంటనే ఐటీ అధికారులు కూడా

  • తన కొడుకు మహేందర్ రెడ్డిని చూడడానికి సూరారంలోని హాస్పిటల్ కి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి

  • సూరారం హాస్పిటల్ కి మల్లారెడ్డితో పాటు వెళ్లిన ఐటీ అధికారులు

  • బీజేపీ రాజకీయ కక్ష్యతో నాపై నా బంధువులపై ఐటీ రైడ్స్ చేయిస్తుంది - మల్లారెడ్డి

  • నా కొడుకును ఐటీ రైడ్స్ పేరుతో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వేధించారు

  • నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు.. అందుకే ఆసుపత్రి పాలయ్యాడు

  • ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయట్లేదు.. క్యాసినోలు నడిపించట్లేదు

  • కావాలని నాపై ఐటీ దాడులు చేస్తున్నారు

  • 200 మంది ఐటీ అధికారులతో మాపై దాడులు చేయించి భయపెడతారా?

  • నా కొడుకుని చూద్దాం అంటే కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు

  • చుట్టూ అధికారులు, CRPF పోలీసులను పెట్టారు 

  • నా కొడుకు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు - మల్లారెడ్డి, మంత్రి

Minister Mallareddy: మల్లారెడ్డి కుటుంబంలో మరొకరికి అస్వస్థత

  • మల్లారెడ్డి కుటుంబంలో వరసగా అస్వస్థతకు గురవుతున్న కుటుంబ సభ్యులు

  • మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌ రెడ్డికి కూడా అస్వస్థత

  • సూరారంలోని ఆస్పత్రికి తరలించిన ఐటీ అధికారులు

  • మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది - వైద్యులు

  • చెస్ట్ పెయిన్‌, ఎడమ షోల్డర్‌ పెయిన్‌తో ఆస్పత్రికి తీసుకొచ్చారు - వైద్యులు

  • గతంలోనూ ఆయనకు ఇలా ఒకసారి నొప్పి వచ్చింది - వైద్యులు

ఆ వ్యాఖ్యలు అర్ధరహితం - కొడాలి నాని

క్యాబినెట్లో కమ్మ కులానికి ప్రాధాన్యత లేదంటూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అన్ని రంగాలలో పురోగమనంలో ఉన్న కమ్మ కులస్తులు చీఫ్ జస్టిస్, ఉపరాష్ట్రపతి, సీఎం సహా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారని ఆయన తెలిపారు. బీసీలకు, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే మంత్రి పదవులు సర్దుబాటు జరిగిందన్నారు. ఎన్టీఆర్ ను ఒక కులానికి పరిమితం చేస్తూ వసంత వ్యాఖ్యలు చేయడాన్ని నాని తప్పు పట్టారు.

CM Jagan In Srikakulam: శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన, లబ్ధిదారులకు భూహక్కు పత్రాల పంపిణీ

సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తున్నారు. జగనన్న భూహక్కు - భూరక్ష పథకంలో భాగంగా హక్కు పత్రాలను సీఎం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అంతకుముందు సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం లబ్ధిదారులు, సర్వేయర్లతో ముచ్చటించారు. కాసేపట్లో తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు

  • ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు

  • మరో ఇద్దరికి నోటీసులు జారీ

  • నందు భార్య చిత్రలేఖకు సిట్ నోటీసులు

  • అంబర్ పేటకు చెందిన అడ్వికేట్ ప్రతాప్ గౌడ్ కి సైతం నోటీసులు

  • ఈ రోజు ఇద్దరూ విచారణకు రావాలని సిట్ ఆదేశం, హాజరుపై ఉత్కంఠ

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 24 గంటలకు పైగా వేర్వేరు షిఫ్టుల్లో ఐటీ అధికారులు నిరంతరంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, నేడు (నవంబరు 23) ఉదయం మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కుమారుడ్ని చూసేందుకు మల్లారెడ్డి కూడా ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఆస్పత్రి వద్ద మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు తమను వేధిస్తున్నారని ఆరోపించారు.

Background

మంగళవారం రోజు పలువురు మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయ పన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్ లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది. కేంద్రం వైఖరిపై సీఎం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 


కేసినో కేసుతో ప్రారంభించి.. ఐటీ దాడుల వరకూ ! 


చీకోటి ప్రవీణ్ కేసినో కేసు అంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది. ఆయన సోదరులను ... పీఏను ప్రశ్నించారు. కుమారుడికీ నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. పాటు తాజాగా మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేశారు. మల్లారెడ్డి వ్యాపార వ్యవస్థపై ఏకంగా యాభై బృందాలతో దాడులు చేశారు అధికారులు.  మల్లారెడ్డి చేసే వ్యాపారాల్లో ఎన్నో లొసుగులు ఉంటాయని.. వాటిని ఐటీ సులువుగా పట్టుకోగదలని అంటున్నారు. రేపు ఎవరిపై చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా మంది ఐటీ, ఈడీ రాడార్‌లో ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తుడిపేసుకోలేని వ్యవహారాలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తూంటాయి. దీంతో ఆయా నేతలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు. 


రేపు టార్గెట్ అయ్యే నేత ఎవరు ? 
 
ఇది బిగినింగ్ స్టేజేనని.. టీఆర్ఎస్ ఆర్థిక మూల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసినప్పుడు చాలా వరకూ సమాచారం సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా చేసిన సోదాల్లోనూ మరిన్ని వివరాలు సేకరించారు. గత ఎన్నిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆర్ధికంగా స్థిరపడ్డారు. వారందరిపై ఐటీ, ఈడీలు దృష్టి పెట్టడం ఖాయమని చెబుతున్నారు.  ఎంత పారదర్శకంగా వ్యవహారాలు నడిపినా..ఏదో ఓ లొసుగు బయటపడితే దొరికిపోతామని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్ మైనింగ్ కేసే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. గ్రానైట్ మైనింగ్ లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యాపారం ఎవరూ చేయలేరని.. కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వం చూసీ చూడకుండా పోతుందని. ..దాన్నే నేరగా ఇప్పుడు ఈడీ, ఐటీ చూపిస్తున్నాయని నేతలంటున్నారు. అందుకే సోదాలంటేనే వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో కలిసి ఏం చేయాలనే అంశంపై చర్చించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.