Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Feb 2023 09:51 PM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) ( సైదాబాద్ లో నివాసముండే సోదరి కుమారుడు) గుండెపోటుతో మృతి చెందారు. సంతోష్ నగర్ డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి కన్నుమూశారు.

బేగంపేటలోని బ్లైండ్ స్కూల్లో విషాదం, బిల్డింగ్ పైనుంచి పడి  విద్యార్థి మృతి

బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో విషాదం


బిల్డింగ్ పైనుంచి పడి  విద్యార్థి మృతి..


కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో  కింద పడ్డ లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..


ఆరో అంతస్తు నుంచి పడిపోయిన
 12 సంవత్సరాల లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..

యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించిన భట్టి విక్రమార్క

సికింద్రాబాద్: తెలంగాణ లో అరాచక పాలన, అప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగుతుందని కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు


వరంగల్ లో జరిగిన దాడి ఘటనలో గాయాలపాలై సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ను బట్టి విక్రమార్క పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..


భారాస నాయకులు గుండాల మాదిరిగా వ్యవహరిస్తూ దాడులకు దిగబడడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు గా మారిందన్నారు..


బారాస నాయకుల రాక్షసత్వం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని అనుమానం తలెత్తుతుందనీ అన్నారు..


వరంగల్లో పవన్ పై జరిగిన దాడి భాదాకరమని అన్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులపై బారాస నాయకులు దాడులకు దిగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానం

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో కన్నాతో పాటు మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.

Osmania Dental Collage: ఉస్మానియాలో విద్యార్థుల ఆందోళన 

ఉస్మానియా డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ వైఖరికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహాలు ఖాళీ చేయాలంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు కాలపరిమితి పూర్తికాకుండానే హాస్టల్ ఎలా ఖాళీ చేస్తామని యూజీ, పీజీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tirumala Updates: శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని జబర్దస్త్ బృందం దర్శించున్నారు. గురువారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు సంజయ్ స్వరూప్, సినీనటి శ్రీలక్ష్మీ, చైల్డ్ కమెడియన్స్ యోధ, దివెన, నటుడు గెటప్ శీనులు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన గెటప్ శీను మీడియాతో మాట్లాడుతూ. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కోవిడ్ తర్వాత మొదటి సారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. భోళా శంకర్, రాజు యాదవ్, పొలిమేర-2, హనుమెన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు గెటప్ శీను తెలియజేశారు.

Minister KTR Tour in Bhupalpally: భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన

జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు ఘనపురానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ ZP చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 


అనంతరం మంత్రి కేటీఆర్ ములుగు ఘనపురంలో మండల తహశీల్దార్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే, జ్యోతిరావు ఫూలే బాలికల ఆవాస పాఠశాలకు, సింగరేణి వెయ్యి క్వార్టర్స్ కి ప్రారంభోత్సవం చేశారు. అలాగే భూపాలపల్లి కి చేరుకుని అర్ అండ్ బి అతిథి గృహానికి, దివ్యాంగుల కమ్యూనిటీ హాలుకు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కు ప్రారంభోత్సవం చేశారు.

Warangal: కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

  • మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నం నేపథ్యంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో KMC ముట్టడికి పిలుపు

  • ముందస్తుగా మోహరించిన పోలీసులు

  • విద్యార్థి సంఘాలను లోపలికి అనుమతించకుండా అరెస్ట్ చేసిన పోలీసులు

  • కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట

  • పరిస్థితి ఉద్రిక్తం

Hyderabad Murder: జగద్గిరిగుట్టలో యువకుడి హత్య

  • జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బండెల మనోజ్(22) అనే యువకుడిని హత్య

  • సత్తి, మోహన్ అనే ఇద్దరు మనోజ్ అనే యువకుడిపై కత్తితో దాడి

  • చికిత్స పొందుతూ మృతి చెందిన మనోజ్

  • హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

TTD News: లంచం తీసుకుంటూ విజిలెన్స్ వింగ్ కి పట్టుబడ్డ టీటీడీ ఉద్యోగి

నలభై వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ విజిలెన్స్ వింగ్ అధికారులకు పట్టుబడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ లోని దుకాణం సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ ఫైల్ ప్రాసెస్ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన టీటీడీలో రెవిన్యూ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ నవీన్ రూ.40 వేలు లంచం తీసుకుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా టీటీడీ ఉద్యోగిని నవీన్ ను విజిలెన్స్ వింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ లోని ఓ దుకాణం యజమాని జానకిరామ్ ఫిర్యాదుతో టిటిడి విజిలెన్స్ వింగ్ అధికారులు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే టీటీడీ చరిత్రలో మొదటి సారి టిటిడి ఉద్యోగి లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం మూడు రోజుల క్రితం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీటీడీలో చర్చనీయాంశంగా మారింది.

AP Deputy Speaker: శ్రీవారి సేవలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభధ్రస్వామి

గన్నవరం ఘటనలో టీడీపీ మహిళలే దౌర్జన్యంకు పాల్పడ్డారని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. గురువారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో కోరగట్ల వీరభద్రస్వామి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి స్వేచ్ఛగా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్న సమయంలో లేని అరాచకాలు సృష్టించి ప్రజాభిమానం పొందేందుకు రాజకీయ పార్టిలు ప్రయత్నం చేస్తుందన్నారు. అటువంటి రాజకీయ పార్టిలకు భగవంతుడే జ్ఞానంను ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో రాష్ట్రంలో పేదబడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారని, పాదయాత్ర చేసే వ్యక్తులకు బందోబస్తుగా పంపితే, పోలీసులు మాపై నిఘాకు వస్తున్నారని చెబుతారని, పోలీసులను బందోబస్తుకు పెట్టక పోతే మాకు రక్షణ లేదని అంటూ విమర్శలు చేస్తున్నారని, ఈ రెండు  మాటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, లేని జనాన్ని చూపించుకునేందుకు ఇరుగు సందుల్లో కార్యక్రమాలు నిర్వహించి తొక్కిసలాటకు కారణం అవుతున్నట్లు ఆరోపించారు. పోలీసులపైనే దౌర్జన్యాలు దిగడం, టీడీపీ పార్టిలోని మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి పోలీసులపైకి ఉసికొల్పడం ఘటన గన్నవరంలో చూసాంమని, ఇందుకు సంబంధించిన సీసీ పుటేజ్ ల్లో మహిళలు పోలీసులపై దౌర్జన్యం చేయడం ప్రజలంతా చూసారని, ఏ వాస్తవమో, ఏ అవాస్తవమో ప్రజలు తెలుసుసని, రాబోయే రోజుల్లో ప్రజలే వారి ఓటు హక్కు ద్వారా వారి అభిప్రాయంను తెలుపుతారని ఆయన అన్నారు.

Vijayawada Kanakadurga: దుర్గ గుడిలో లడ్డూ, పులిహోర స్టోర్ లో ప్రసాదంలో‌ అవినీతి

  • దుర్గ గుడిలో లడ్డూ, పులిహోర స్టోర్ లో ప్రసాదంలో‌ అవినీతి

  • రికార్డుల్లోకి ఎక్కించకుండా 430 ప్యాకెట్లు కౌంటర్ కి‌ చేర్చినట్లు ఈఓకి ఫిర్యాదు

  • విధుల్లో ఉన్న సూపరింటెండెంట్ భాగ్యజ్యోతిని విచారించాల్సిందిగా ఈఓ ఆదేశాలు

  • గుమస్తా మధు డ్యూటీ మారుతూ 430 ప్యాకెట్లు పంపాలంటూ అప్పుడే డ్యూటీకి వచ్చిన మరో గుమస్తా రామకోటేశ్వరరావుకి అప్పగింత

  • రికార్డుల్లోకి ఎక్కకుండా మధు ఉద్దేశపూర్వకంగా కౌంటర్ కు‌ వెళ్లేలా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ

  • ఇదే అంశాలను ఈఓకి వివరించిన భాగ్యజ్యోతి

  • అసలు దోషి మధుని వదిలేసి, భాగ్యజ్యోతి, మరో గుమస్తా రామ కోటేశ్వరరావు లను సస్పెండ్ చేసిన ఈఓ

  • మధును కావాలనే తప్పించారని, ఒక ఏఈఓ చక్రం తిప్పినట్లు దుర్గ గుడిలో చర్చ

  • గతంలో అవినీతిపై ఏసీబీ జరిపిన దాడుల్లో మధు ఏ వన్ ముద్దాయి

  • గతంలో చీరెల కుంభకోణంలో మధు అసలు సూత్రధారిగా గుర్తింపు

  • ఇప్పుడు పులిహోర ప్రసాదంలోనూ మధు చేతి‌వాటం

  • మధుపై చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నపై అధికారులు

  • ఈఓ భ్రమరాంబను సైతం తప్పుదారి పట్టిస్తున్న వైనం అంటూ చర్చ

Nara Lokesh Yuvagalam: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

నారాలోకేశ్ యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకు నడిచిన దూరం 329.1 కి.మీ.
యువగళం పాదయాత్ర 25వ రోజు షెడ్యూల్(23-2-2023) శ్రీకాళహస్తి నియోజకవర్గం


ఉదయం
8.00  – జీలపాలెం (రేణిగుంట మండలం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
9.30  – గాజులమాండ్యంలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ
12.30 -  రేణిగుంట వై-కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపి డాక్టర్లతో సమావేశం
1.15  – రేణిగుంట వై-కన్వెన్షన్ హాలు ఆవరణలో భోజన విరామం


సాయంత్రం
2.15 – వై.కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి
3.30 – రేణిగుంట బస్టాండు వద్ద షాప్ కీపర్స్ తో సమావేశ
6.10 – తిరుపతి అంకురా హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంలో బస

Ballari Express: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుకు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బళ్లారి ఎక్స్ప్రెస్ కు బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన జిఆర్పీ, ఆర్పీఎఫ్, గోపాలపురం పోలీసులు ప్లాట్ ఫారం 4లో నిలిచి ఉన్న రైల్ ను క్షుణ్నంగా పరిశీలించారు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో రైల్ లోని ప్రతి అణువు పరిశీలించారు. ఎటువంటి బాంబ్ లేదని తేల్చారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. రైలులో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో చెకింగ్ చేసిన పోలీసులను చూసి ప్రయాణికులంతా ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు.. దాదాపు రెండు గంటలపాటు జరిగిన హై డ్రామాకు బాంబు లేదని తెలియడంతో తెరపడింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.. అనంతరం బళ్లారి ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో బయలుదేరింది.. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు.

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.









ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 


ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.


ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.