Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Advertisement

ABP Desam Last Updated: 23 Aug 2022 07:30 PM

Background

Breaking News Live Telugu Updates: ఏపీలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద నిధులు ఇవాళ విడుదల చేయనున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా నిధులను...More

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు 

Mla Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  రిమాండ్ ను  నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. 41  సీఆర్సీపీ కండిషన్ ను పోలీసులు పాటించలేదని  కోర్టు అభిప్రాయపడింది. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదన్న కోర్టు...  రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరించింది.  వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే అంతకు ముందు రాజాసింగ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు వార్తలు వచ్చాయి. 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.