Breaking News Live Telugu Updates: గాంధీ భవన్ లో రసాభాస, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అడ్డుకున్న ఓయూ నేతలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Dec 2022 04:03 PM
గాంధీ భవన్ లో రసాభాస, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అడ్డుకున్న ఓయూ నేతలు 

హైదరాబాద్ గాంధీ భవన్ లో రసాభాస నెలకొంది. ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అడ్డుకున్నారు. జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కమిటీల్లో ఎక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ తిరిగి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ సీనియర్లతో భేటీ సమయంలోనే ఈ రసాభాస జరిగింది. 

Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఫుడ్ ఫాట్స్ అండ్ ఫెర్టిలైజెర్స్ (ఎఫ్.ఎఫ్.ఎఫ్) ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి భయాందోళనలతో బయటకు పరుగులు తీసిన ఫ్యాక్టరీ కార్మికులు

  • ఆయిల్ లో మిక్స్ చేసే కెమికల్ సాల్వెంట్ ఆయిల్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించి ఎగసిపడిన మంటలు

  • మంటలు ఎగసిపడిన సమయంలో అక్కడ ఉన్న ఎనిమిది మంది కార్మికుల్లో జగన్నాధపురంకు చెందిన మల్లి అనే వ్యక్తి గల్లంతు

  • మిగిలిన ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు గాయాలు లేకుండా బయటపడగా మిగిలిన ఆరుగురిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు

  • హుటాహుటీన ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది

  • అంబులెన్స్ లో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలింపు

TTD News: టీటీడీ తాత్కాలిక బాధ్యతలు అనిల్ కుమార్ సింఘాల్ కి

మరోసారి టీటీడీ బాధ్యతలను అనిల్ కుమార్ సింఘాల్ కి అప్పగించిన ఏపీ ప్రభుత్వం


టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్


అడిషనల్ ఇంఛార్జ్ ఈవోగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం


ప్రభుత్వ ఆదేశాలతో 12 రోజుల పాటు టీటీడీ ఈవోగా కొనసాగనున్న అనిల్ కుమార్ సింఘాల్


12 రోజుల పాటు సెలవులో ఉన్న టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి


ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అకాల మరణంతో సెలవులో ఉన్న ధర్మారెడ్డి


12 రోజుల అనంతరం టీటీడీ భాధ్యతలను స్వీకరించనున్న ఏవీ ధర్మారెడ్డి

Congress Vs BJP: బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు

ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగ్‌పూర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాగ్‌పూర్‌లోని 236 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 200 చోట్ల విజయం సాధించింది. నాగ్‌పూర్‌లోని దేవేంద్ర ఫడణవీస్ దత్తత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం నమోదు చేసింది.

Rayadurgam News: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

  • రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

  • కారుతో బైక్ ను ఢీ కొట్టిన ఓ యువకుడు

  • ఈనెల 18న ఘటన, చికిత్స పొందుతూ మహిళ మృతి

  • ఎర్రగడ్డ నుంచి గచ్చిబౌలికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సయ్యద్ సైఫుద్దీన్, అతని భార్య మరియా మీర్

  • మరో ద్విచక్రవాహనంపై వారి వెంటే వెళ్తున్న ఇద్దరు యువకులు (బంధువులు)

  • తీగల వంతెన వద్దకు రాగానే యువకుల పక్క నుంచి వెళ్లిన బెంజ్ కారు

  • రోడ్డుపై ఉన్న నీరు వాళ్లపై చిందడంతో కారులో ఉన్న రాజసింహ రెడ్డిని దూషించిన యువకులు

  • కోపంతో బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టిన రాజసింహ రెడ్డి

  • ఇది చూసి ఎందుకు ఢీ కొట్టావ్ అని వాగ్వాదానికి దిగిన వెనుక బైక్ పై ఉన్న సైఫుద్దీన్

  • అతణ్ని కూడా కారుతో ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి ఎగిరి కింద పడిన దంపతులు

  • తీవ్ర గాయాలు కావడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించి యువకులు

  • చికిత్స పొందుతూ ఈ రోజు మారియా మృతి

  • బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

  • నిందితుడు రాజసింహ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కారు స్వాధీనం

Background

నైరుతి బంగాళాఖాతం (తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకు­ని ఉన్న ప్రాంతం) లో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వాయు­గుండం పశ్చి­మ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమ­రిన్‌ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావర­ణ విభాగం అధికారులు బుధవా­రం చెప్పారు. దీని ప్రభావం ఏపీపై అంతంతమాత్రంగానే ఉంటుందని వివరించారు. 


ఏపీలో మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నే­య గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రం­లో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


‘‘బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర - ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర - వాయువ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావంతో మరో మూడు రోజులు వరకు విపరీతమైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ​, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.


అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తుంటాయి కాబట్టి. డిసెంబరు 25న ముందు చెప్పిన విధంగానే దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ప్రారంభించనుంది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.