అది భారతీయ సంప్రదాయం- చెప్పులు అందివ్వడంపై బండి సంజయ్ క్లారిటీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Background
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న సీఎం జగన్, ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. సీఎం జగన్ ఆదివారం సాయంత్రమే తాడేపల్లి నుంచి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రి...More
దిల్లీ లిక్కర మాఫియాలో పడి కొట్టుకుంటున్న వాళ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫ్యామిలీ రహస్యాలు బయటపడకుండా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం... లేకుంటే కాళ్లు పట్టుకొని గుంజడం కేసీఆర్ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందివ్వడం భారతీయతను పాటించే తమకు అలవాటు అన్నారు. తమ కుటుంబ పెద్ద, గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రికి చిన్నవాడినైన తాను చెప్పలు ఇవ్వడం గులామ్ గిరి ఎలా అవుతుందని ప్రశ్నించారు.