Breaking News Live Telugu Updates: గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి: ఎమ్మెల్సీ మాధవ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Mar 2023 05:39 PM

Background

దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు  రాయలసీమ, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది....More

ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి: ఎమ్మెల్సీ మాధవ్

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియా పాయింట్స్ 


గతంలో కూడా తమ పార్టీ ఓటమి చెందినా.. ఆ తర్వాత పుంజుకున్న సంఘటనలు ఉన్నాయి


ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయి


ఉత్తరాంధ్ర లో మాత్రమే బీజేపీ వైఫల్యం చెందింది


భవిష్యత్ లో ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలనేది మా పెద్దలు సూచనలు చేశారు 


ఏప్రిల్ 14 వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపడుతున్నాం


11సభ్యులతో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేస్తాం


వీటికి సంబంధించి కొత్తగా యాప్ ను కూడా రూపొందిస్తున్నాం


రాష్ట్ర వ్యాప్తంగా 15రోజుల పాటు అందరూ భాగస్వామ్యులు అయ్యేలా సూచిస్తున్నాం


రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది ఈ పనిలో నిమగ్నమవుతారు


బీజేపీ ఎఫ్పడూ వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంది


ఇసుక, మైనింగ్, మద్యం వంటి అంశాలలో పోరాటాలు కూడా చేశాం


గతంలో ప్రజా పోరు పేరుతో వీధి సభలు పెట్టాం


రెండో విడత కూడా వీధి సమావేశాలు పెట్టి.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం


యువతను, ఉద్యోగులను, మహిళలను జగన్ మోసం చేశారు


రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండి.. జీతాలు కూడా సకాలంలో వేయని పరిస్థితికి తెచ్చారు


మే 1వ తేదీ తర్వాత ఛార్జిషీటు కార్యక్రమం చేపడతాం


ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తాం


వాటిని అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేసిందీ వివరిస్తాం


ఈ ఛార్జిషీటు మొత్తం రెడీ అయ్యాక బహిరంగ సభలు నిర్వహిస్తాం


బీజేపీ పొత్తులకు సంబంధించి కూడా అనేక అంశాలు ప్రచారం జరుగుతున్నాయి


ఎపీలో బీజేపీ బలోపేతం కోసం తాము కృషి చేస్తాం


పొత్తులపై మాత్రం మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.