Breaking News Live Telugu Updates: Crime news: తనపై ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని బండి సంజయ్ క్వాష్ పిటిషన్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి బండి సంజయ్ క్వాష్ పిటిషన్ వేశారు. కమలాపూర్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమలాపూర్ స్కూల్ హెడ్‌మాస్టర్‌తో పాటు, స్థానిక పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 16కు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
పల్నాడు జిల్లా, నరసరావుపేట..
పదో తరగతి ప్రశ్న పత్రాలు మూల్యాంకనం చేస్తూ ఉపాధ్యాయడు గుండె పోటు తో మృతి...
ఫిరంగిపురం కు చెందిన జోజప్ప అనే ఉపాధ్యాయడు రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామం లో MPPS SC పాటశాలలో విధులు నిర్వహణ
నేడు పదోతరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనం కోసం నరసరావుపేట సెయింట్ ఆన్స్ పాటశాల కు వచ్చిన జోజప్ప...
మూల్యంకన చేస్తున్న క్రమంలో గుండెలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించిన తోటి ఉపాధ్యాయులు..
అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడి...
ఇదే విధంగా నిన్న బాపట్ల లో మునిసిపల్ హైస్కూలులో ప్యాపర్ వాల్యుయేషన్ చేస్తు శ్రీనివాసరావు అనే టీచర్ స్ట్రోక్ తో మృతి చెందాడు
- మూడవ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ
- కాసేపట్లో చంచల్ గూడా జైలు నుండి కస్టడీ లోకి తీసుకోనున్న సీబీఐ
- ఇప్పటికే ఇద్దరినీ ఆరు రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు
- వైఎస్ వివేకా హత్య నిందితులతో ఉన్న పరిచయాల పై ఆరా తీసిన సీబీఐ
- సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ పై ప్రశ్నించిన సీబీఐ
- సాక్ష్యాలను తారు మారు చెయ్యడం పై ప్రశ్నలు
- నేడు మరోసారి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను కస్టడీ లోకి తీసుకోనున్న సీబీఐ
- నేడు మరోసారి సీబీఐ విచారణ కు హాజరు కానున్న ఎంపీ అవినాష్ రెడ్డి
- రెండు రోజుల పాటు సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి ని విచారించిన సీబీఐ
- వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాల పై ఆరా తీసిన సీబీఐ
- అవినాష్ రెడ్డి కి వివేకానంద రెడ్డి కుటుంబానికి మధ్య విబేధాల పై సీబీఐ ఆరా
- నిందితుల తో జరిపిన ఆర్ధిక లావాదేవీల పై ప్రశ్నించిన సీబీఐ
- 40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర పై ఆరా తీసిన సీబీఐ
- సహజ మరణంగా ఎందుకు చిత్రికరించారని ప్రశ్నించిన సీబీఐ
- వివేకా చనిపోయిన రోజు అవినాష్ రెడ్డి కాల్స్ పై ఆరా తీస్తున్న సీబీఐ
- వైఎస్ భారతి కి ఫోన్ చెయ్యడం పై పలు ప్రశ్నలు
- ఎవిడెన్స్ టాంపరింగ్ పై కూపి లాగిన సీబీఐ
- అవినాష్ రెడ్డి విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్న సీబీఐ
- నేడు మరోసారి సీబీఐ విచారణ కు హాజరు కానున్న అవినాష్ రెడ్డి
హైదరాబాద్ లోని సనత్ నగర్‌లో ఘోరం జరిగింది. ఓ బాలుడిని బలి ఇచ్చారంటూ ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. స్థానికులు ఈ ఆరోపణలతో ఓ హిజ్రా ఇంటిపై దాడికి దిగారు. సనత్ నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఎనిమిది ఏళ్ల బాలుడిని హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపించారు. బాలుడి శవం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు.
Background
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి తెలంగాణ నుండి రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల మరియు రేపు 40 డిగ్రీల కన్నా ఎక్కువ అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల, రేపు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు దకొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
21వ తేదీ నుండి 4, 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో 21 వ తేదీ నుండి 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 40 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -