Breaking News Live Telugu Updates: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తదుపరి ప్రధానమంత్రి ఎన్నికయ్యే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. ట్రస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది వారాల తరువాత, ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగం పార్టీలో తిరుగుబాటును ప్రేరేపించింది. గత వారం రోజుల్లో ఇద్దరు మంత్రులు ఈ పదవికి రాజీనామా చేశారు
మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగించింది ఎన్నికల కమిషన్. జగన్నాథరావు స్థానంలో రోహిత్ సింగ్ ను నియమించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై ఎన్నికల సంఘం వేటు వేసింది.
- మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమాధి కలకలం
- బౌండరీలు దాటేసిన మునుగోడు రాజకీయం
- ఏకంగా గోతులు తవ్వి సమాధులు కడుతున్న వైనం
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమాధి కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
- మునుగోడుకి ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇవ్వనందుకు జేపీ నడ్డ కి సమాధి కట్టిన మునుగోడు వాసులు
- తమకు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన
- ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత శ్రావణి ఆత్మాహుతి
- పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న న్యాయ విద్యార్థిని శ్రావణి
- భర్త వినయ్ తో కొంతకాలంగా గొడవలు
- భర్తపై ఫిర్యాదు నేపథ్యంలో స్టేషన్ కి కౌన్సిలింగ్ కు వచ్చిన భార్యాభర్తలు
- మంటలతో తగలబడుతుండగా కాపాడే ప్రయత్నం చేసిన ఎస్సై, ఎస్సై కు గాయాలు
- చికిత్స నిమిత్తం సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన పోలీసులు
- చికిత్స పొందుతూ మృతి చెందిన న్యాయ విద్యార్థిని శ్రావణి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోర్రాయిపల్లె గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని మెడలో వేసుకున్న కార్యకర్తతో తాత్కాలికంగా వేసిన పందిరిని రిబ్బన్ కటింగ్ చేస్తూ గృహప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్ నాయకుడు తమ గ్రామం పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు చెందినవారు సర్పంచ్ గా ప్రాతినిథ్యం వహిస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించారని, మోర్రయి పల్లి గ్రామంలో దళిత సర్పంచ్ ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు తమ గ్రామం పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసుకుంటానని హామీలు ఇస్తున్న మంత్రి కేటీఆర్ మొదలు తన సొంత నియోజకవర్గంలోని గ్రామాలకు న్యాయం చేయాలని అన్నారు. మోర్రాయి పల్లే గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయని పక్షంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
- MBS జువెల్స్ అధినేత సుఖేష్ గుప్తాను కస్టడీ ఇవ్వాలని ఈడీ పిటిషన్
- వారం రోజుల పాటు సుఖేష్ గుప్తాను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసిన ఈడీ అధికారులు
- రెండు రోజుల పాటు సోదాలు చేసి వంద కోట్ల బంగారపు ఆభరణాలను సీజ్ చేసిన ఈడీ
- MMTC సంస్థ నుండి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలు జరిపిన డబ్బులు ఎక్కడికి తరలించారని ఆరా తీస్తున్న ఈడీ
- ఇప్పటికి సుఖేష్ గుప్తా ను అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలు కు తరలింపు.
- కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు లోకి వస్తాయని భావిస్తున్న ఈడీ
జగిత్యాలలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో SKNR చౌరస్తా వద్ద గుడిసెల్లోకి కారు దూసుకెళ్లింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్డులోని SKNR డిగ్రీ కళాశాల వద్ద అర్ధరాత్రి TS 21J 9740 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న శంకరమ్మకు (55) తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శంకరమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చందు, రాజు అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
- మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఈసీ ఆదేశం
- గుర్తుల జాబితా సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
- రిటర్నింగ్ అధికారి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
- సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
- మునుగోడు ఆర్వోపై ఈసీ ఆగ్రహం
- రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయంపై ఆగ్రహం
- ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశం
- ఆర్వో వివరణపై సాయంత్రం నివేదిక పంపాలని ఆదేశం
- మూడో రోజు ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
- ఎమ్మిగనూరు మండలం బనవాసి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర
- ఉదయం ముగతి గ్రామం వరకు సాగనున్న పాదయాత్ర
- సాయంత్రం నాలుగు గంటలకు హాలహర్వి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పాదయాత్ర
- 6:30 గంటలకు కల్లుదేవకుంట గ్రామంలో కార్నర్ మీటింగ్
- రాత్రి మంత్రాలయం మండలం చెట్నిహళ్లి లో బస చేయనున్న రాహుల్
- పాదయాత్ర అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోనున్న రాహుల్
Background
తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. నేడు (అక్టోబరు 20), రేపు ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అక్టోబరు 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడుతుందని చెప్పారు. చివరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాల పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు.. అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగగా హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అక్టోబరు 20 తెల్లవారుఝామున 3.30 గంటలకు విడుదల చేసిన నౌకాస్ట్ వార్నింగ్ ప్రకారం.. నేడు ఉదయాన్నే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణం ఇలా
అక్టోబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, యానంలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీనివల్ల వరి, అరటి పంటలకు కాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో జనం ఇళ్లలో ఉండాలని, చెట్ల కింద ఉండడం సరికాదని అధికారులు హెచ్చరించారు. ఎలక్ట్రిక్ పోల్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈశాన్య రుతుపవనాలు కూడా ఓ కారణం - ఏపీ వెదర్ మ్యాన్
‘‘ఈశాన్య రుతుపవనాల వల్ల 20న తెల్లవారిజామున నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ఈ వర్షాలు అన్ని చోట్లల్లో పడదు, కానీ కోస్తా భాగాల్లో మోస్తరు నుంచి భారీగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం వలన ఏర్పడిన గాలుల సంగమం వలనే ఈ వర్షాలు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 50,780 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 46,550 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,780 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,500 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -