Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 20 Mar 2023 09:31 PM
ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆమె ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించింది ఈడీ. సాయంత్రం 6 తరువాత సైతం ఆమె ఈడీ ఆఫీసులోనే విచారణలో ఉండటంతో అరెస్ట్ చేస్తారనే అనుమానాలు తలెత్తాయి. రాత్రి 9 గంటలకు కవిత ఈడీ ఆఫీసు నుంచి బయలుదేరి తన నివాసానికి చేరుకున్నారు.

జేఎల్ పేపర్ 2 తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

జూనియర్ లెక్చరర్ పేపర్ 2 తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
మీ ఇష్టం వచ్చినట్లుగా ఇంగ్లీష్ లోనే పేపర్ ఇవ్వాలని నిర్ణయాలు తీసుకోవడం ఏంటని హైకోర్టు టీఎస్ పీఎస్సీని ప్రశ్నించింది

విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండోసారి ఈడీ ఎదుట విచారణకు సోమవారం ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలు దాటినా కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాకపోవడం, మరోవైపు వైద్యుల టీమ్ ఈడీ కార్యాలయానికి రావడంతో కవితను అరెస్ట్ చేస్తారనే అనుమానాలు రెట్టింపయ్యాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆత్మీయ సందేశం అని లేఖ విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ కార్యాలయానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమ భరత్ వెళ్లారు. డాక్టర్ టీమ్ టెస్టులు చేసి ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయింది. అయితే ఎవరికి వైద్య పరీక్షలు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి బండి సంజయ్ లేఖ రాశారు.


 





Revanth Reddy: రేవంత్ రెడ్డికి సిట్‌ నోటీసులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినందున అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. 

MLC Kavitha ED Enquiry: ఈడీ ఆఫీసుకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీలో నేడు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత ఆ కార్యాలయానికి బయల్దేరారు.

వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయుల మధ్య ఘర్షణ

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్‌ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ చెప్పినా కూడా వాళ్లు వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు ఘర్షణ పడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా లేకుండా సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ చెప్పారు. 

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఘర్షణ, టీడీపీ ఎమ్మెల్యేపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే?

ఏపీ అసెంబ్లీలో నేడు విపరీతమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు.

Kavitha ED Enquiry: నేడు ఈడీ విచారణకు వెళ్లాలని కవిత నిర్ణయం!

ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆమె నేరుగా హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, న్యాయవాదులు, నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈడీ విచారణకు నేరుగా హాజరు కావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత లేదు. ఉదయం 10.30 నిమిషాలకు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్తారని తెలుస్తోంది. 

Background

దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్‌, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నిన్న, మొన్న (మార్చి 18, 19) పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.


తెలంగాణలో వాతావరణ స్థితి
ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, గయాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో  వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. అలాగే, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు గంటకు (30-40 కి.మీ.) వేగంతో వడగళ్లతో కూడిన వర్షాలు సాయంత్రం లేదా రాత్రికి కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.0 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 50 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతోంది. భారీ వర్షాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడగా, కొన్ని చోట్ల చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. పండిన పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండగా ఈ అకాల వర్షం రైతులకు నిద్రలేని రాత్రులను ఇచ్చింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వర్షం మరికొన్ని రోజులు కొనసాగనుంది. వాయువ్య, తూర్పు భారతదేశంలో వర్షాలు, వడగళ్ళు మార్చి 20 న కూడా కొనసాగుతాయి. ఇది కాకుండా, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉంది. మార్చి 19 నుంచి 21 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.