Breaking News Live Telugu Updates: గన్నవరంలో ఉద్రిక్తత, టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 20 Feb 2023 05:55 PM
గన్నవరంలో ఉద్రిక్తత, టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి 

గన్నవరంలో టీడీపీ ఆఫీస్ కు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కారుకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. 

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్..

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..


హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ రోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.. 


హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.. 


అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలను నిర్వహించారు. 


తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించ లేదని అధికారులు తెలిపారు.


మరోవైపు, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టు లోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.


చెన్నై లో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. 


విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించ లేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపు లోకి తీసుకున్నారు.

మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు


కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తండ్రి మోహనకృష్ణ


తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు


తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు


మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ 


తారకరత్న అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొన్న అభిమానూలు, తెదేపా కార్యకర్తలు

Prithvi Raj: కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చారని వస్తున్న వార్తలపై పృథ్వీ రాజ్ స్పందన

  • తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్

  • పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి వార్తలు వేస్తున్నారు

  • అప్పట్లో పృథ్వీ రాజ్ కు రూ. 200 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.. 

  • ఆ రూ.200 కోట్లు లెక్క పెట్టి రావడానికి ఇన్ని రోజులు పట్టింది..

  • జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. 

  • అలాంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి నీచానికి పాల్పడే వ్యక్తి కాదు..

  • ట్యాక్స్ కట్టడానికే రూ.9 కోట్ల రూపాయలు అప్పు చేశాడు పవన్ కళ్యాణ్..

  • అలాంటి వార్తలు వేస్తే సర్క్యూలేషన్ వస్తాయని రాధాకృష్ణ భావించి ఉండవచ్చు..

  • తారకరత్న విషయంలో లక్ష్మీ పార్వతి మాటలు బాధాకరం..

  • అలాంటి మాటలు ఆమె మాట్లాడి ఉండకూడదు..

  • లోకేష్ ఐరన్ లెంగ్ అంటూ ఆయన పాదయాత్ర వల్లే తారకరత్న చనిపోయాడు అని లింక్ చేస్తూ చెప్పడం బాధాకరం.. 

ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు
పెనుమత్స సూర్యనారాయణ రాజు- విజయనగరం
పోతుల సునీత- బాపట్ల
కోల గురువులు- విశాఖపట్నం
బొమ్మి ఇజ్రాయిల్- బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా 
జయమంగళ వెంకట రమణ- ఏలూరు
చంద్రగిరి ఏసు రత్నం- గుంటూరు
మర్రి రాజశేఖర్‌ రెడ్డి-పల్నాడు

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే 

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే 
లోకల్ బాడీ ద్వారా ఎన్నికాబోయే  ఎమ్మెల్సీ అభ్యర్థలు
నర్తు రామారావు -ఇచ్చాపురం
కుడుపూడి సూర్యనారాయణ రావు -అమలాపురం
వంకా రవీంద్రనాథ్‌- తణుకు
కావురు శ్రీనివాస్‌-పాలకొల్లు
మేరుగు మురళీధర్‌రావు- గూడూరు
సిపాయి సుబ్రహ్మమణ్యం -శ్రీకాళహస్తి
రామసుబ్బారెడ్డి - వైఎస్‌ఆర్ కడప
ఏ మధుసూదన్- కర్నూలు
మంగమ్మ- అనంతపురం

Tirumala News: తిరుమలలో అనుమానాస్పద రీతిలో శవం లభ్యం

తిరుమలలోని పార్వేటి మండపం వద్ద గల అన్నమయ్య నడక మార్గంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం అయింది. ఘటన స్థలానికి చేరుకున్న తిరుమల టూ టౌన్ పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి కి చెందిన గుమ్మా సిద్దారెడ్డిగా (93) గుర్తించారు పోలీసులు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 14వ తేదీన సిద్ధారెడ్డి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారని ట్రాఫిక్ తిరుమల డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. ఎవరైనా హత్యా చేశారా.. లేక జంతువులు దాడి చేశాయా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే వివరాలు దర్యాప్తులో తేలతాయని తెలిపారు.

Secunderabad News: ఇద్దరు కవలలతో కలిసి తల్లి ఆత్మహత్య

మేనరికం కారణంగా పుట్టిన పిల్లలు చనిపోతారని భయంతో ఓ తల్లి ఇద్దరు కవలలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంధ్యారాణి అనే వివాహిత గతంలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన కొన్నాళ్లకే ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతి కి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల మరోసారి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సుధారాణి మేనరికం మూలంగా పిల్లలు చనిపోతారని భావించి పిల్లలను సంపులో పడేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు పుట్టి కేవలం 15 రోజులు మాత్రమే గడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Srisailam News: శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులు 

శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ హరిచంద్రన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంట హెలికాప్టర్ లో చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైల క్షేత్రానికి రాష్ట్ర గవర్నర్ దంపతులు వెళ్లారు. అనంతరం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో లవన్న, చైర్మన్ జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని, ఎస్పీ రఘువీర్ రెడ్డి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ హరిచందన్ దంపతులకు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచన మండపంలో గవర్నర్ హరిచందన్ కు అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి, అమ్మవార్ల చిత్రపట జ్ఞాపికను, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు ఆలయ ఈవో లవన్న, చైర్మన్ అందజేశారు.

Bandi Sanjay: జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ సన్మానం

హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్-బీజేపీ ఘర్షణనలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 5న బీఆర్ఎస్ గుండాలు మా కార్యకర్తలపై దాడి చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఈటల కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే మా కార్యకర్తలపై కేసులు పెడతారా..? పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రు. గుండాలకు తుపాకుల లైసెన్సు ఇస్తారా..?’’ అని బండి సంజయ్ మాట్లాడారు.

Tarakaratna News: మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతిక కాయం

తారకరత్న భౌతిక కాయాన్ని ఆయన సొంతిల్లు ఉన్న శంకర్ పల్లిలోని మోకిల నుంచి నగరంలోని ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. అభిమానుల సందర్శన కోసం తారకరత్న భౌతిక కాయాన్ని మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత ఫిల్మ్ నగర్‌ సమీపంలోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Rayadurgam News: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం

  • రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో బాలుడిని ఢీకొన్న కారు

  • చిత్రపురి HIG-5- 705 లో నివాసం ఉంటున్న  జీవాన్ష్ కుటుంబం

  • జీవాన్ష్ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని అడుకుంటుండగా సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు

  • బాలుని తలకు తాకుతూపోయిన కారు, పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

  • సాయి౼శ్రావణి దంపతుల కుమారుడు మృత్యువుతో పోరాడుతున్న జీవాన్ష్

  • ఈ మధ్య కాలంలో HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా పనిచేసిన బాలుడి తండ్రి సాయి

  • ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబం

  • ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న  కుటుంబానికి మరో దెబ్బ

  • భర్తను కోల్పోయి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణనాతీతం

  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు

Sandhya Convention: హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్

హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్


సంధ్య శ్రీధర్‌ ని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు


అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో శ్రీధర్ అరెస్ట్


రూ.2.5 కోట్ల మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సంధ్య శ్రీధర్

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


తెలంగాణలో క్రమంగా చలి తగ్గుతోంది. నిన్న మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ అవ్వగా.. నేడు రాష్ట్రమంతా సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.









ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడా ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.