Breaking News Live Telugu Updates: క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా ఊపందుకోనున్న బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు
• అధినేత సూచనలతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రేత్రస్థాయిలో ప్రారంభానికి సిద్దమైన బి ఆర్ కె ఎస్
• డిసెంబర్ నెలాఖరు కెల్లా 6 రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బిఆర్ఎస్ కిసాన్ సెల్)
• మహారాష్ట్ర, కర్నాటక, ఒడిసా సహా పలు రాష్ట్రాల్లో ఎగరనున్న బిఆర్ఎస్ జెండాలు
• దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ భావజాల వ్యాప్తి కోసం పలు భాషల్లో పాటలు, సాహిత్యం సిద్దం.
• కన్నడ, మరాఠా,ఒడిస్సా సహా పలు భారతీయ భాషల సాహిత్య కారులు, పాటల రచయితలకు ఈ దిశగా సూచనలిస్తున్న బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్
• బిఆర్ఎస్ లో చేరేందుకు పలు రాష్ట్రాలు సహా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున సంప్రదింపులు...మద్దతు
• ఇప్పటికే ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన పలువురు ప్రముఖులు సంస్థలు
• డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశం నిర్వహించనున్న బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్..
• బిఆర్ఎస్ విధి విధానాలు ప్రకటన
సీఎం కేసీఆర్ తో భేటీ అయిన పంజాబ్ సీఎం భగవంత్
ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్....
పలు జాతీయ అంశాలు దేశ రాజకీయాల పై సిఎం కెసిఆర్ తో కొనసాగుతున్న చర్చలు..
నెల్లూరు జిల్లాలో రోడ్డు నిర్మాణ కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది
మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి తన కూతురుతో కలిసి ఈ రోజు (డిసెంబరు 20) తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో యువతిని కిడ్నాప్ చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, జానీ, తాను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటామని యువతి వెల్లడించింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, ఈ పని చేశానంటూ పెళ్లి దుస్తుల్లో వీడియో పోస్ట్ చేసింది. దాంతో ఇది కిడ్నాప్ వ్యవహారం కాదని, ప్రేమ వివాదమని అర్థమవుతోంది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రులు దాడిశెట్టి రాజా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ బి.దయానంద్, తమిళనాడు మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, టీడీనీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గోతిపటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బాధితులకు వచ్చిన నష్ట పరిహారం డబ్బుల్లో సగం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘రైతుల ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి నాపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ను, నిరూపించమని నేను సవాల్ విసిరితే అది చేతకాక పారిపోయి, ఈ రోజు రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
- తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అసమ్మతులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
- అధిష్ఠానం సూచనలతో రంగంలోకి దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి
- కొద్దిసేపట్లో సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి మాట్లాడనున్న మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి..
- ఇప్పటికే ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ సమస్యల పరిష్కార బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్‌లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.
పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి (మణి రెడ్డి) అకాల మరణంతో తండ్రి పార్థివ దేహం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోరున విలపించారు. తనయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొని తల్లి నాగరత్నమ్మ కన్నీటి పర్యాంతం అయ్యారు. తుమ్మలగుంట నివాసం వద్ద మనిరెడ్డి పార్థివ దేహానికి సినీనటుడు మోహన్ బాబు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కలెక్టరు వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించి మణి రెడ్డికి నివాళులు అర్పించారు. రేపు (బుధవారం) ఉదయం 9 గంటలకు తుమ్మలగుంట స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
విశాఖ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు 70 గ్రాముల ఎండీఎంఏ నిషేధిత డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ బిజినెస్ లో నష్టాలు రావడంతో సుంకర ప్రశాంత్ తన స్నేహితులతో కలిసి ఈ డ్రగ్ వ్యాపారంలోకి దిగాడు. ఐదుగురు నిందితులు హోటల్ మేనేజ్మెంట్ కలిసి చదువు కున్నారు. వీరు న్యూ ఇయర్ వేడుకలను క్యాష్ చేసుకుందామని రంగంలోకి దిగి డ్రగ్స్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. దీంతో బెంగుళూరు నుంచి మొత్తం 90 గ్రాములు ఎండీఎంఏ తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ -2 కె.ఆనంద్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎవరైనా డ్రగ్స్ తో పట్టుపడిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన
- ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మద్దతు తెలిపిన మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి
- కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగి నిరసన
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కమిషనర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల డిమాండ్
- తెలంగాణలో విద్య వ్యవస్థ కుంటుపడిపోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలలో టాయిలెట్ సరిగా లేకపోవడం దారుణమన్న దేప భాస్కర్ రెడ్డి
- సమస్యలను పరిష్కారం చేయకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
- సోమవారం వరకు పనులు ప్రారంభం కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిక
Background
దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం భారీ అల్పపీడనం కొనసాగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీక్రుతం అయి ఉంది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం దాదాపు అన్ని చోట్ల పొడిగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
అల్పపీడన ప్రభావంతో మంగళవారం (డిసెంబర్ 20) నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగుతోంది.
‘‘ఇక వర్షాకాలం చివరి దశకి వచ్చేసింది కాబట్టి రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న రోజుల్లో శ్రీలంకకి దగ్గరగా వస్తున్న అల్పపీడనం వలన డిసెంబరు 22 నుంచి 28 మధ్య కాలంలో దక్షిణ భాగాలైన తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ వలన శ్రీలంక తీరం దగ్గరగా వచ్చి ఉత్తర దిశగా కదలనుంది. దీని వలన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయే కానీ భారీ వర్షాలుండవు. మిగిలిన జిల్లాలు, ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు ఏమి ఉండవు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తర కోస్తా, యానాం
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ
వచ్చే మూడు రోజులు (మంగళ, బుధ, గురువారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 14 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -