Breaking News Live Telugu Updates: అనంతపురం జిల్లాలో తెగిపడ్డ విద్యుత్ తీగలు, ఆరుగురు కూలీలు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Nov 2022 04:03 PM
వర్షం కారణంగా ఆగిన ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ - 17 పరుగులు ముందంజలో బంగ్లా!

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వర్షం అడ్డుకుంది. మ్యాచ్ ఆగే సమయానికి బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 17 పరుగులు ముందుంది.

Anantapur: అనంతపురం జిల్లాలో తెగిపడ్డ విద్యుత్ తీగలు, ఆరుగురు కూలీలు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ పైన కరెంటు తీగలు తెగి పడడం వల్ల ఆరుగురు చనిపోయారు. జిల్లాలోని బొమ్మనహళ్లి మండలం దుర్గా హోన్నూరులో ఈ ఘటన జరిగింది. పంట కోతల పనులు జరుగుతుండగా మెయిన్ విద్యుత్ లైన్ తీగలు తెగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో వ్యవసాయ కూలీలు ఆరుగురు చనిపోయారు. కొంత మందికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.

Road Accident: పశువుల వాహనం - వ్యాన్ ఢీ 

కొమానపల్లి 216 జాతీయ రహదారిపై పశువులను తీసుకెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో పశువులకు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వ్యాన్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అంబాజీపేట నుండి కాకినాడ వైపు పశువులను తరలిస్తున్న టాటా ఏసీ వాహనం కాకినాడ నుండి వస్తున్న ఐసెర్ వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సకాలంలో హైవే వాహన పోలీసులు వచ్చి క్షతగాత్రులను వెలికి తీసి గాయపడిన పశువులను వాహనం నుండి బయటకు తీశారు. వైద్యాధికారి జగదీష్, సిబ్బంది గాయపడిన పశువులకు వైద్యం అందించారు.

Jaggampet Tahsildar: ఏసీబీ వలలో చిక్కిన జగ్గంపేట డిప్యూటీ తహసీల్దార్

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండల డిప్యూటీ తహసీల్దార్. టేకు చెట్లు నరకడం కోసం ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఓ రైతు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ను సంప్రదించారు. అయితే సర్టిఫికెట్ ఇవ్వాలంటే చెట్టుకు రూ.300 చొపువన మొత్తం రూ.16,000 డిమాండ్ చేశాడు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్. దీనికోసం ముందస్తుగా రూ.3,000 తీసుకోగా మిగిలిన సొమ్ముకోసం పదే పదే ఒత్తిడి చేయసాగాడు. దీంతో రైతు డయల్ 1400 ద్వారా ఏసీబీ అధికారులను అశ్రయించాడు. రైతు ఇచ్చిన సమాచారం మేరకు మందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు వల పన్నిన క్రమంలో రైతు వద్దనుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డట్టు ఏసీబీ అడిషనల్ ఏప్పీ సౌజన్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సౌజన్య వెల్లడించారు. ఈదాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, శ్రీనివాస్, డి.వాసుకృష్ణ పాల్గొన్నారు.

Background

ఏపీలో నవంబర్ 4 వరకు భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయిని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. చెన్నైలో వర్షాలు తగ్గి నేరుగా ఏపీలోని తిరుపతి జిల్లా సూళూరుపేట - గూడూరు వైపు, సత్యవేడు, నాయుడూపేట, గూడూరులలో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయి. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.


అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.



తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నవంబర్ 4 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. మంగళవారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ, ఉమ్మడి మహబూబ్ నగర్ సహా కొన్ని జిల్లాల్లో  నుంచి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. నగరంలో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 27 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు దిశ నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. ఈ రోజంతా దక్షిణ ఆంధ్రలో వర్షాలో వర్షాలున్నాయి. ప్రస్తుతం పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా విస్తరిస్తున్నాయి. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ అధికంగా కురవనున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నవంబర్ 2, 3 తేదీలలో చలి గాలులు వీచనున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
చెన్నై కి దగ్గరగా ఉన్న​ తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. చెన్నైలో వర్షాలు తగ్గి నేరుగా ఏపీలోని రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళూరుపేట - గూడూరు వైపు అల్పపీడనం ప్రభావం చూపుతోంది. మరోవైపు ఒంగోలు నుంచి దక్షిణ భాగంలో ఉన్న కుప్పం వరకు తేలికపాటి వర్షాలు రాత్రి వరకూ పడుతునే ఉంటాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 2 న భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.