Breaking News Live Telugu Updates: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో కెమికల్ గ్యాస్ లీక్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Aug 2022 10:22 PM
అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో కెమికల్ గ్యాస్ లీక్

*అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో కెమికల్ గ్యాస్ లీక్


*50 మంది మహిళలకు అస్వస్థత*....


*సీడ్స్ కంపెనీ నుంచి లీకైన రసాయన వాయువు*.....


*రెండు నెలల క్రిందట ఇదే సీడ్స్ పరిశ్రమలో  లీకైన గ్యాస్*... 


*వాంతులతో స్పృహ కోల్పోయిన మహిళ ఉద్యోగులు*.... 


*బాధిత మహిళలకు పరిశ్రమ లోపల ప్రాథమిక చికిత్స*....


అచ్యుతాపురం ఘటనపై స్పందించిన మంత్రి అమర్ నాథ్ 


అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు 


బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి అమర్ నాథ్

ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా- ఉపఎన్నికలతో మునుగోడుకు న్యాయం జరగాలని ఆకాంక్ష

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానన్నారు. ఇంకా 18 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిధులు వస్తాయని అభివృద్ధి చేస్తారన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఈ రాజీనామా అంశాన్ని కూడా ప్రభుత్వ అనుకూల మీడియా తెరపైకి తీసుకొచ్చింది. చాలా సార్లు చెప్పాను ప్రజల కోసం ఏ స్థాయికైనా వెళ్తాను అన్నాను.  


 పోడు భూముల సమస్య ఉంది. ప్రభుత్వం చాలా సార్లు పరిష్కరిస్తామని చెప్పింది కానీ ఇంత వరకు చేయలేదన్నారు. చాలా మంది ప్రజలు ఈ విషయంలో బాధ పడుతున్నారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించలేని పదవులు ఎందుకని ఆలోచించాను అన్నారు. తన రాజీనామాపై చాలా కాలంగా చర్చ నడుస్తోందన్నారు. ఇంకా దీన్ని సాగ దీసే ఉద్దేశం లేదని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడ్డా రాజగోపాల్‌రెడ్డి... మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడదామని చాలా సార్లు చూశానని వెల్లడించారు. కానీ ప్రయోజనం కనిపించలేదన్నారు. ఇప్పుడు ఉపఎన్నికలు వస్తేనే నిధులు వస్తాయని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 


ప్రతి విషయంలో కూడా ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఒక ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆ ఫ్యామిలీ చేతిలో పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలకు విలువ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. నయా నిజాంలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని విమర్శించారు. మూడు ఎకరాల సంగతి కేసీఆర్‌ ఎప్పుడో మర్చిపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారని ధ్వజమెత్తారు. అయినా ఎక్కడా తెలంగాణలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కొద్ది మందికి దోచి పెడుతున్నారన్నారు. దేశంలో ఇంత ఘోరంగా ఎక్కడా పాలన సాగడం లేదు. పరిపాలనను రాచరిక వ్యవస్థలా మార్చేశారు.


రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడూ అమ్ముడుపోలేదన్నారు. ఎప్పుడూ అమ్ముడు పోడు. సొంతపార్టీ, సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తనకే పదవులు కావాలంటే ఎప్పుడో టీఆర్‌ఎస్‌లో చేరేవాళ్లమన్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని చేయలేదు... చేయబోమన్నారు. అలాంటి వ్యక్తులను ఇంతటి మాటలు అంటుంటే... బాధనిపిస్తోందన్నారు. మునుగోడు ప్రజలకు తన రాజీనామా న్యాయం చేయాలన్నారు. 

ప్రికాషన్ డోస్‌ కింద కొర్బావాక్స్​ వేసేందుకు ఎన్‌టీఏజీఐ సిఫార్సు

కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వేసుకున్న వారికి ప్రికాషన్ డోస్‌ కింద కొర్బావాక్స్​ వేసేందుకు అనుమతి ఇవ్వాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) సిఫార్సు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను బయోలాజికల్‌ ఈ సంస్థ దీన్ని తయారు చేసింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ రెండింటిలో ఏదైనా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న 18 ఏళ్లకు మించిన వారందరికీ ప్రికాషన్ డోస్‌ కింద్ కొర్బావాక్స్‌ ఇవ్వొచ్చని సూచించినట్టు అధికారులు వెల్లడించారు.  

కోనసీమలోని ఓఎన్జీసీపై ఎన్జీటీ ఆగ్రహం- రూ. 22.76 కోట్ల జరిమానా

పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఓన్జీసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అంతే కాకుండా భారీ జరిమానా కూడా విధించింది. 22.76 కోట్ల రూపాయలు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ కారణంగా కోనసీమ జిల్లాలో భూ, జల కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి సూచించింది. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ఖర్చు పెట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

గుడివాడలో ఇద్దరు బాలికల కిడ్నాప్-లోకల్‌గా ఉన్న వ్యక్తిపై అనుమానం

గుడివాడలో విద్యార్థినుల కిడ్నాప్ కలకలం రేపింది. గుడిజోషి అనే వ్యక్తి విద్యార్థులను అపహరించి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కిడ్నాప్ అయ్యారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.  

Chikoti Praveen: పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు

  • రెండో రోజు ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న చీకోటి ప్రవీణ్  విచారణ

  • సోషల్ మీడియాలో చీకోటి ట్వీట్స్ హల్చల్ 

  • చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ 

  • ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

  • @praveenchikotii పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతా

  • ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు తప్పుడు పోస్ట్ లు

  • సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్ లు 

  • సోషల్ మీడియా ఫేక్  అకౌంట్ లపై ఇన్స్టాగ్రాం లో స్పందించిన ప్రవీణ్

  • తప్పుడు ఫేక్ అకౌంట్ లపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు

Konaseema District: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో విద్యార్థుల నిరసన

  • కోనసీమ జిల్లా మామిడికుదురు (మం) పాశర్లపూడి గ్రామంలో ఎంపీపీ ప్రైమరీ 3, 4, 5 తరగతుల విద్యార్థిని విద్యార్దులను హైస్కూల్లో విలీనం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు.

  • నిత్యం రద్దీగా ఉండే NH 216 రోడ్ మార్గం ద్వారా చిన్న పిల్లలను పంపించి రిస్క్ చేయలేమంటూ తమ పిల్లలను ఎవరి ఇంటికి వారు తీసుకు పోయిన వైనం

  • అవసరం అయితే ప్రైవేటు పాఠశాలలో అయినా పిల్లలను చదివించుకుంటామని చెప్పిన తల్లిదండ్రులు

  • ఏ స్కూల్ వద్దు మా స్కూలే ముద్దంటూ వినూత్నంగా గోడ కుర్చి వేసి నిరసన తెలియచేసిన విద్యార్థిని విద్యార్థులు

Pingali Venkayya Jayanthi: పింగళి వెంకయ్య జయంతి - 2కె వాక్ ప్రారంభించిన మంత్రి మేరుగు

బాపట్ల జిల్లా -బాపట్ల లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం హైస్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 2కె వాక్ కార్యక్రమాన్ని మంత్రి మేరుగు నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద   మంత్రి మాట్లాడుతూ ఈ రోజు భారత దేశాన్ని పాలించిన తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించి భారతదేశాన్ని కాపాడిన మహనీయుల త్యాగఫలం తోనే మనమందరం ఎంతో స్వేచ్ఛగా,ఆనందంగా జీవితాలను గడుపుతున్నామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు త్యాగధనుల త్యాగాలను విద్యార్థులకు, ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ, ఉప సభాపతి కోన రఘుపతి,శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత,జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

CM KCR: కే కేశవరావు కమిటీతో సీఎం కేసీఆర్ భేటీ నేడు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు సంబంధించి కార్యాచరణను నేడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు ఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను ఎంపీ కే కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం అవుతారు. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించాక కార్యాచరణను ఖరారు చేస్తారు.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ కేంద్రం ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. కొన్ని దక్షిణ కోస్తాంధ్రకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు.


తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధికంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, చొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.