Breaking News Live Telugu Updates: తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Sep 2022 04:54 PM
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తెంలగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు, ఏపీలోని అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ  పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

దిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కరీంనగర్ లో ఈడీ సోదాలు

కరీంనగర్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇద్దరు రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

దమ్ముంటే 175 సీట్లలో సింగిల్ గా పోటీచేయి, పవన్‌కు మంత్రి రోజా ఛాలెంజ్

నిన్న వీకెండ్ బై పీకే చూశాం, ఆదివారం వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతాడు : మంత్రి ఆర్కే.రోజా
2019లో నీమాట శాసనం అన్నావ్. అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తానన్నావ్. మాకు 45 వస్తాయంటే ... నీకు 130 వస్తాయా 
ఇలాంటి సర్వేల వల్లే గతంలో బొక్కబోర్లాపడ్డావ్. నీ మాటలు వింటుంటే నవ్వొస్తోంది
ప్రజలు నిన్ను శాసనసభలో కూడా అడుగు పెట్టనివ్వలేదు 
175 చోట్ల పోటీచేసేందుకు జనసేనకు క్యాండెట్లు కూడా లేరు
ముందు కౌన్సిలర్లు, ఎంపీటీసీలుగా మీ పార్టీ వారిని గెలిపించుకో
పవన్ ను చూసి తెలుగు ఇండస్ట్రీ హీరోలంతా తల దించుకుంటున్నారు
2014 లో టీడీపీకి , బీజేపీకి ఓట్లేయించి...ఏం సాధించావ్
రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశావ్ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ 
గతంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోయావ్
విభజన హామీల పై కేంద్రాన్ని ప్రశ్నించకుండా సినిమా షూటింగ్ లు చేసుకున్నావా 
పవన్ కు ఇదేనా ఛాలెంజ్
దమ్ముంటే 175 సీట్లలో సింగిల్ గా పోటీచేయి

Delhi Liquor Scam: మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి: ఎంపీ మాగుంట

Delhi Liquor Scam: ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కామెంట్స్
ప్రకాశం జిల్లా: ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కామెంట్స్
మా పై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో  మేము లేము
మేము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నాము
8 రాష్ట్రలాలో మా వ్యాపారాలు ఉన్నాయి..ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నాము
మా చెన్నె ,ఢిల్లీ వివాసాల్లో ఇడి దాడులు జరిగాయి...
ఏవిధమైన ఆధారాలు, అక్రమాలు జరగలేదని ఈడి అధికారులు తేల్చారు... పంచనామా లో కూడా ఇదే రాశారు
మా పై నే కాదు ..దేశం లో 32 మంది వ్యాపారుల పై కూడా శోదాలు చేశారు.
మా కుటుంబం రాజకీయాలో ,వ్యాపారాలలో నీతి గా ఉన్నాము
ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవు
2024 లో నా కొడుకు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారు..
ఇది కేవలం వ్యాపారపరమైన ఇడి దాడులు గానే భావిస్తున్నాము...ఇడి దాడులు రాజకీయ దాడులు కానే కాదు

Konaseema District: కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్పంచుల ఆందోళన

  • మా నిధులు మాకు ఇప్పించండి అంటూ కలెక్టర్ కు చేతులెత్తి మొక్కిన సర్పంచులు

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్పంచుల ఆందోళన

  • 14, 15 ఆర్థిక సంఘం నిధులు తక్షణం పంచాయతీలకు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సర్పంచులు

  • గ్రామాల్లో తిరగలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచ్ లు

  • గ్రామాల్లో వీధిలైట్లు, శానిటేషన్ చేయలేని పరిస్థితి నెలకొందని కలెక్టర్ కు వినతులు

  • తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14, 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని ఆందోళన

  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోతే నిరాహారదీక్షకు దిగుతామంటూ హెచ్చరించిన కోనసీమ జిల్లా సర్పంచ్ లు

కడప జిల్లా.. దిద్దేకుంటలో  పాత కక్ష్యలతో వ్యక్తి దారుణ హత్య

కడప జిల్లా... పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం దిద్దేకుంట గ్రామంలో  పాత కక్ష్యలతో వ్యక్తి దారుణ హత్య...


బైక్ పై వెళ్తుండగా కాపు కాచి అడ్డగించి నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు..
దిద్దేకుంట గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గా గుర్తింపు.... 
సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు....

సూర్యాపేట కలెక్టరేట్ లో కలకలం, పెట్రోల్ పోసుకుని 2 కుటుంబాలు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో కలకలం


ప్రజావాణి కార్యక్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన రెండు కుటుంబాలు


భూ వివాదంలో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించిన బాధితులు


బాధితులు తల్లి కూతురు మీసాల  స్వాతి, మీసాల  అన్నపూర్ణ


మరో బాధితులు తల్లి తనయులు పున్న వీరమ్మ, సైదులు

Rajahamundry: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తండ్రి

  • తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం

  • ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణం

  • రాజమండ్రి అర్బన్ రాజవోలు చెరువులో దూకి తండ్రి పక్కి సత్యేంద్ర కుమార్ (40) కుమార్తెలు పక్కి రిషిత (12) పక్కి హిద్దీక (7) తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు రాజమండ్రి అర్బన్ వీ ఎల్ పురంకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.

  • అకౌంటెంట్ గా పనిచేస్తున్న సత్యేంద్ర కుమార్ ఉద్యోగంలో ఒత్తిడి వలన ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలిపిన పోలీసులు

  • రెండు రోజుల క్రితం భార్య ఊరు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న భర్త, పిల్లలు

  • భార్య తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో వారికోసం గాలించగా ఎటువంటి వివరాలు వెల్లడి కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

  • రాజవోలు చెరువులో మృతదేహాలు లబ్యం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Khammam: గుర్తుతెలియని వ్యక్తి ఇంజక్షన్ వేయటంతో వ్యక్తి మృతి

  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి సమీపంలో జమాల్ సాబ్ అనే వ్యక్తికి ఇంజక్షన్ వేసిన గుర్తు తెలియని వ్యక్తి

  • కింద పడిపోయిన జమాల్ సాహెబ్ ను స్థానిక వల్లభ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చిన స్థానికులు

  • వైద్యులు పరీక్షిస్తుండగానే  మృతి చెందిన జమాల్ సాహెబ్

  • చింతకాని మండలం బొప్పారానికి చెందిన జమాల్ సాహెబ్ వల్లభి నుంచి గండ్రాయి వెళుతుండగా వల్లభి సమీపంలో లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనం ఎక్కి ఇంజక్షన్ చేసిన వ్యక్తి

NIA Raids: అదుపులోకి తీసుకున్న నలుగురిని ఎన్ఐఏ కోర్టుకు తరలించిన అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్ఐఏ సోదాలు 
సోదాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు 
హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి ఆదివారం రాత్రి తరలింపు 
కొద్ది సేపటి క్రితమే నలుగురుని తీసుకొని బయటికి వెళ్ళిన ఎన్ఐఏ అధికారులు 
అదుపులోకి తీసుకున్న నలుగురిని ఎన్ఐఏ కోర్టుకు తరలించినట్లు సమాచారం 
ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చిన నోటీసులు అందుకున్న పలువురు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

  • ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు సార్లు సోదాలు చేసిన ఈడీ

  • సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ

  • లిక్కర్ స్కాం కేసులో పెద్ద ఎత్తున ఢిల్లీ పెద్దలకు ముడుపులు చెల్లించారని ఆధారాలు సేకరించిన ఈడీ

  • ఇటీవల హైదరాబాద్ లో 25 బృందాలతో ఈడీ సోదాలు

  • సోదాల అనంతరం పలువురికి నోటీసులు జారీ చేసిన ఈడీ

  • ఇందులో భాగంగా నిన్న ఈ కేసులో ఏ -14 గా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళైను విచారించిన ఈడీ

  • సుమారు 8 గంటల పాటు అరుణ్ రామచంద్ర పిళ్ళైను ప్రశ్నించిన ఈడీ

  • అరుణ్ రామచంద్ర పిళ్ళై బ్యాంకు లావాదేవీలు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా

  • నేడు మరికొంత మందిని ఈడీ విచారించే అవకాశం

  • రాజకీయ ప్రముఖులపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం

నేటి నుంచి బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు

ప్రజలను జాగృతం చేసి 2024 ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం రావడమే ఈ ప్రజా పోరు ప్రధాన లక్ష్యం అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.


రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తారు . సునీల్ దేవధర్  జాతీయ కార్యదర్శి కర్నూలు జిల్లాలో ,సత్యకుమార్  జాతీయ కార్యదర్శి సత్యసాయి జిల్లాలో పార్లమెంట్ సభ్యుడు జీ,వి, యల్  అనంతపురం జిల్లాలో విష్ణుకుమార్ రాజు విశాఖపట్నంలో ఆదినారాయణ రెడ్డి చిత్తూరు జిల్లాలో , ఇలాగే 26 జిల్లాలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ప్రారంభం చేస్తారు .టీజీ వెంకటేష్  నెల్లూరు జిల్లాలో సుజనా చౌదరి  ప్రకాశంలో ప్రారంభిస్తారు .


అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిరంతరంగా ప్రతిరోజు యాత్రికులు కొనసాగుతాయి , కేంద్ర మంత్రులు జాతీయ నేతలు సైతం రాష్ట్రంలో ఈ యాత్రల్లో పాల్గొంటారు 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ రచ్చ రచ్చ

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ భీభత్సం చేశాడు. ఎమ్మెల్యే పీఏ విజయ్ పెళ్లైన ఓ మహిళ గొంతు కోశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన విజయ్, న్యూడ్ కాల్స్ చేసి మహిళను వేధించడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో మహిళ ఒప్పుకోలేదు. ఆవేశంతో ఊగిపోయిన పీఏ బీర్ బాటిల్‌తో మహిళపై దాడి చేశాడు.

Background

తెలుగు రాష్ట్రాలకు ఈ వారం భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. నేడు (సెప్టెంబరు 19) బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో నేడు మోస్తరు వర్ష సూచన ఉండగా, రేపటి నుంచి మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దిగువ ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి.


తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather Updates)
నేడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావం నేడు అంతంతమాత్రమే. కానీ రేపటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సెప్టెంబర్ 20 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


ఈ 20 నుంచి భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా్ల్లో అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు 21 వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు వర్షాలు  కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయి. నేటి (సెప్టెంబర్ 19) నుంచి మరో అల్పపీడనం ప్రభావం రాష్ట్రం పై మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షాలుంటాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఈ ప్రాంతానికి ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ చేయలేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.