Breaking News Live Telugu Updates: తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరుల దాడి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Mar 2023 04:08 PM
IND vs AUS, 2nd ODI: రెండో వన్డేలో 117కే భారత్ ఆలౌట్

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (31: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.


తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరుల దాడి

తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై మంత్రి అనుచరులు దాడి


▪️హైదరాబాద్ లోQnews ఆఫీస్ లో విధ్వంసం.


▪️మంత్రి అనుచరులు విచ్చలవిడిగా దాడి.


▪️పూర్తిగా ధ్వంసం అయిన QNEWS ఆఫీస్.


▪️జర్నలిస్టులపై కత్తులతో దాడి చేసినట్లు ఆరోపణలు.


▪️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

CM Jagan News: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్

జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 



  • ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది.

  • ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే

  • చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

  • దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు

  • కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే

  • గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు

  • ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు

  • అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం

  • జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం

Kishan Reddy: స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద కిషన్ రెడ్డి పర్యటన

స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ఆరు మంది మృతి చెందడం పట్ల కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి కోరారు. కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ప్రమాదాల నివారణకు కృషి చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుండి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అక్రమ కట్టడాలకు జిహెచ్ఎంసి ప్రోత్సహిస్తూ రెగ్యులరేషన్ పేరుతో ఖజానా నింపుకోవడమే తప్ప ప్రమాదల నివారణకి ఏమాత్రం పాటుపడడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Elephant Death: ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

చిత్తూరు జిల్లాలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ధర్మపురిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగిలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు. వేటగాళ్ళు అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారా లేక పొరపాటున విద్యుత్ తీగలు తెగి ఏనుగుకు తగలడంతో మృతి చెందిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ నెల 7వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి.

Anantapur News: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రిటర్నింగ్ అధికారికి అక్షింతలు!

◻️  ఎమ్మెల్సీగా గెలిచిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఎందుకివ్వలేదని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం


◻️  ఎమ్మెల్సీగా గెలిచిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఆదేశం


◻️  ఎట్టకేలకు డిక్లరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన రిటర్నింగ్ అధికారి


◻️  ఉదయం 8.30 గంటలకు డిక్లరేషన్ ఇస్తామని టీడీపీ నాయకులకు సమాచారం


◻️ ఉదయం 8.30కి కలెక్టరేట్ వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేటి కార్యక్రమాలు

  • 33వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం

  • ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్న రేవంత్

  • ఉదయం 9 గంటలకు జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా వెళ్లనున్న రేవంత్

  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష

  • టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్

  • మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష

Jagananna Vidya Deevena: నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

  • నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ

  • రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి

  • ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్

Swapnalok Complex: స్వప్న లోక్ కాంప్లెక్స్ బిల్డింగ్ కి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్

  • స్వప్న లోక్ కాంప్లెక్స్ బిల్డింగ్ కి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ నిర్వహించనున్న జేఎన్టీయూ నిపుణుల బృందం

  • అగ్ని ప్రమాదంతో దెబ్బతిన్న అంతస్తులతో పాటు.. బిల్డింగ్ మొత్తానికి టెస్ట్

  • 38 ఏళ్ల నాటి బిల్డింగ్ కావడంతో దెబ్బతిన్న బాల్కనీలు, సన్ షేడ్, ఇతర నిర్మాణాలు

  • భవనాన్ని పరిశీలించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లు డీఎన్ కుమార్, శ్రీలక్ష్మి

  • పూర్తి రిపోర్ట్ ఇవ్వడానికి మరో 5 రోజులు పడుతుందన్న ప్రొఫెసర్లు

Background

దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నిన్న పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే.


తెలంగాణలో వాతావరణ స్థితి
రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వరకు ఈ తుపాను విస్తరించి ఉంది. బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీన పడింది. ఈ క్రమంలో అధికారులు మరోసారి ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, కొత్తగూడెం, సిరిసిల్ల, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నిజామాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆ జిల్లాలతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌లో వడగళ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


మార్చి 19న ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని  తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఆయా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు పొలాల్లో, చెట్ల కింద ఉండకూడదని సూచించింది.


‘‘విజయవాడ నగరం వైపుగా భారీ వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. ఇవి చాలా భారీగా, తీవ్రంగా మారి బెజవాడ వైపుగా వస్తున్నాయి. మరో వైపున విశాఖ వైపుగా తెలంగాణ నుంచి భారీ వర్షాలు విస్తరించనున్నాయి. దీని వలన విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.