Breaking News Live Telugu Updates: దావత్ కోసమే రైతుబంధు డబ్బులు, రైతులు తాగాలి ఊగాలి: తిన్మార్ మల్లన్న

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Dec 2022 11:35 PM

Background

బంగాళాఖాతంలోని ఆగ్నేయ భాగంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి ఆదివారం (డిసెంబరు 18) నాటికి దక్షిణ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని తెలిపారు. వచ్చే 3 రోజుల్లో...More

దావత్ కోసమే రైతు బంధు డబ్బులు, రైతులు తాగాలి ఊగాలి: తిన్మార్ మల్లన్న

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తిన్మార్ మల్లన్న యాత్ర


కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎన్.టి.ఆర్.చౌరస్తాలో తీన్మార్ మల్లన్న రోడ్ షో నిర్వహించారు. 7200 ఖండువాలతో రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య తో కలిసి తిన్మార్ మల్లన్న పర్యటించారు. ఈ సందర్భంగా తన యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న కేసీఆర్ ఇచ్చే రైతు బంధు డబ్బులు డిసెంబర్ 31వ తేదిన కొత్త సంవత్సరానికి దావత్ కోసమేనని అన్నారు. రైతులు తాగాలి ఊగాలి అని సంచలన వ్యఖ్యాలు చేశారు. తీన్మార్ మల్లన్న యాత్ర చేస్తే ప్రజలకు కేసీఆర్ చేసే దొంగపనులు బయట పడతాయని, అందుకే యాత్రకు అడ్డుపుల్ల వేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పిఎం కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని పలువురు కార్మికులు తిన్మార్ మల్లన్న దృష్టికి తిసుకురాగా ఉదయం సిర్పూర్ పేపర్ మిల్లు వద్దకు చేరుకొని అందరితో మాట్లాడాతానన్నారు.