Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. విశాఖ ఘటనపై పవన్ కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు.
‘‘రైతుల ముసుగులో బ్లేడ్ బ్యాచ్ తిరుగుతోంది. మురికి నీళ్ళ బాటిల్స్, చెప్పులతో దాడి చేశారు తెలుగుదేశం బ్లేడ్ బ్యాచ్. రైతుల పాదయాత్రలో రైతులు లేరు. పోలీసులు వారిలో ఎవరిని వెతికినా వారి వద్ద కత్తులు, బ్లేడులు ఉంటాయి’’ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని మండి పడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
చంద్రబాబు స్నేహంతో పవన్ కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని అన్నారు.
మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే నేడు వికేంద్రీకరణకు వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు.
పవన్ సినిమాల్లో హీరో కావొచ్చు రాజకీయాల్లో జీరో అని విమర్శించారు.
ప్యాకేజీల పవన్ గా రాష్ట్రప్రజలు ఎప్పుడో గుర్తించారు
ఒక్కచోట కూడా పవన్ ని ప్రజలు గెలిపించలేదు
నారావారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్పోర్టు లోనే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ని పోలీసులు అడ్డుకొన్నారు
ఇప్పుడు అంబెడ్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు
చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదు
దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడు
2024 లో కుప్పం లో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదు
చంద్రబాబు ,పవన్ లాలూచీ వల్ల వరిగేదేమి లేదు
చంద్రబాబు ,పవన్ మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం
పవన్ ఏమాత్రం నిలకడ లేని వాడు
సంక్షేమ సారధి వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత పవన్ కి లేదు
జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రెస్స్ గల్లంతైంది
రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు
పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం
పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టం
పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికేమైనా అతీతుడా
సీఎం కావాలని పగటికలలు కంటే సరిపోదు
హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టిడిపి వైసిపి పోటాపోటీ కార్యక్రమాలు స్థానికంగా రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. రాజమండ్రిలో రైతు జేఏసీ వర్సెస్ వికేంద్రీకరణ మద్దతుదారులుగా పరిస్థితి మారింది. ఇరు వర్గాలు పరస్పరం వాటర్ బాటిల్స్, చెప్పులు విసురుకున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు నుంచి 9 గంటలకు ప్రారంభమై దేవీ చౌక్, ఆజాద్ ల మీదుగా సాగనంతగా పది గంటలకు ఆజాద్ చౌక్ వద్ద అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైసిపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే రాజమహేంద్రవరం అంతా అధికార వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు మద్దతుగా నగరం అంతా భారీ హార్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా పలుచోట్ల రైతుల మహా పాదయాత్రకు అనుకూలంగా స్వాగతం చెబుతూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి .
అమరావతి పాదయాత్ర జరుగుతుండగా ఓ రైతుకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు సీపీఆర్ చేసి ఆ రైతుకు ప్రాణం పోశాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసు తక్షణం స్పందించి ప్రాథమిక సాయం చేయడంపై అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వరుసగా తనిఖీలు చేయడం ఇది రెండో రోజు. 20 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముసద్దీలాల్ బంగారం దుకాణం నిర్వహించిన అన్ని బ్యాంకు లావాదేవీలు, బంగారం నిల్వలను పరిశీలిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.
- కడప జిల్లాలో చేరుకున్న నారా లోకేష్
- కాసేపట్లో రోడ్డు మార్గంలో కడప సెంట్రల్ జైలుకు పయనం
- కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ రెడ్డిని కలిసేందుకు 18 మందికి ములాఖాత్ అనుమతించిన జైలు అధికారులు
- జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తో పాటు మరో ఐదుగురికి ములాఖాత్ లో కలిసే అవకాశం
- పోలీసుల ఆంక్షలతో పాటు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- లోకేష్ పర్యటన నేపథ్యంలో చిన్న ఘటన జరిగిన జిల్లా టీడీపీ నేతలదే బాధ్యత అంటూ పోలీసుల నోటీసులు
- పోలీసుల ఆంక్షలు ఉన్న భారీ ఎత్తున కడప చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
- టీడీపీ నేత నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా భారీగా మోహరించిన పోలీసులు
- అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు వెనక్కి పెట్టుకోవాలని సూచించిన పోలీసులు
Background
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం తగ్గడంతో వర్ష ప్రభావం అంతగా లేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అక్టోబర్ 22న ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. రెండు రోజుల తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు సాధారణ వర్షపాతం నమోదు కానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అయితే భారీ వర్షాలు కానందున ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో, జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. సూచనతో ఉత్తరాంధ్ర జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. పశ్చిమ గోదావరి, కొనసీమ కోస్తా ప్రదేశాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో అక్టోబర్ 22న తుఫాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. రాయలసీమ జల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -