Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు: ఐఎండి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Mar 2023 07:17 PM
ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు: ఐఎండి

ఐఎండి అంచనాల ప్రకారం తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా ద్రోణి కొనసాగుతుందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.


దీని ప్రభావంతో  రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో  పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.


ఎల్లుండి రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి  మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.


రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


నమోదైన వర్షపాతం వివరాలు :
శుక్రవారం ఉదయం  8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు తిరుపతి జిల్లా  నాగలాపురం మండలంలో 73.5 మిమీ, బాపట్ల జిల్లా రేపల్లెలో 48.75 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో  47.25మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 44.5 మిమీ, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూర్ లో 41.5 మిమీ, గుంటూరు జిల్లా  ప్రత్తిపాడులో 26.25 మిమీ,  ప్రకాశం జిల్లా కనిగిరిలో 26.5 మిమీ, వైఎస్సార్ జిల్లా చాపాడులో 24.75 మిమీ వంతున జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.

అమలాపురం పట్టణ సిఐ కొట్టరంటూ టీడీపీ నిరసన

బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా.. 


అమలాపురం పట్టణ సిఐ కొట్టరంటూ టీడీపీ నిరసన...


టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న సిఐ దుర్గాశేఖర్ రెడ్డి...


అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ నాయకులు  ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలలో సిఐ అతి ప్రదర్శించారని టీడీపీ నాయకుల నిరసన...


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ  రెండు చోట్లా గెలవడంపై అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కల్చడంతో టీడీపీ కార్యకర్తపై చెంపదెబ్బ కొట్టిన సీఐ దుర్గా శేఖర్ రెడ్డి...


పట్టణ సీఐపై ఆగ్రహించిన టీడీపీ నాయకులు...


అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చుతుండగా వచ్చి అడ్డుకున్న పోలీసులు.. 


ఈ క్రమంలోని టిడిపి కార్యకర్త ఫై చేయి చేసుకున్న పట్టణ సీఐ.. 


అమలాపురం పట్టణ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బేఠాయించిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP అభ్యర్థి విజయం

విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP గెలుపు...ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు లో  94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించిన తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు.

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. బత్తలపల్లి మండలం పొట్లమర్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తిరుపతి రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ సోదాలు 

తిరుపతిలో రీత్యా కన్స్ట్రక్షన్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని రీత్యా సంస్థ  ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. రీత్యా కన్స్ట్రక్షన్స్ యజమాని బాలచందర్ ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద నిర్మిస్తున్న భారీ అపార్ట్మెంట్ తో పాటుగా, మరికొన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాలచందర్ ఇళ్ళు, బంధువుల ఇళ్ళళ్లో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

Delhi Liquor Scam: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగించారు. మరో 5 రోజులు సిసోడియాకు కస్టడీని పొడిగించారు.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు 

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసింది. తిరిగి జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.  

Bandi Sanjay: గన్ పార్క్‌ను చుట్టుముడుతున్న పోలీసులు

• గన్ పార్క్ వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు, మహిళా పోలీస్ సిబ్బంది


• బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు సిద్ధమైన పోలీసులు


• దీక్షాస్థలి వద్దకొచ్చి బయటకు వెళ్లాలంటూ పోలీసుల హుకూం


• పోలీస్ గో బ్యాక్.... కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్న బీజేపీ కార్యకర్తలు


• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా దీక్ష నుండి కదిలేది లేదని భీష్మిస్తున్న కార్యకర్తలు


• గన్ పార్క్ వదిలివెళ్లాలంటూ బండి సంజయ్ ను కోరుతున్న పోలీసులు


• ట్రాఫిక్ జామ్ అవుతోందంటూ పోలీసుల సాకులు


• ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తున్నామని స్పష్టం చేసిన బండి సంజయ్


• ప్రశాంతంగా దీక్ష చేస్తున్న తమపై బలవంతపు చర్యలొద్దని హెచ్చరించిన బండి సంజయ్


• కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన బండి సంజయ్

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. త్వరగా తన పిటిషన్ ను విచారణ చేయాలని ఆమె తరపు న్యాయవాది కోరగా.. తాము 24నే విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 20 న విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Vikarabad News: వికారాబాద్ జిల్లా మర్పల్లిలో మంత్రుల పర్యటన

  • వికారాబాద్ జిల్లా మర్పల్లికి చేరుకున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు

  • అకాల వర్షం, వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించనున్న మంత్రులు, అధికారులు

  • నిన్న వికారాబాద్‌లో విపరీతంగా వడగండ్ల వాన, మంచు ముక్కలతో నిండిపోయిన రోడ్లు - దెబ్బతిన్న పంటలు

TDP: ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి ముందంజ

  • ఐదో రౌండు పూర్తయ్యేసరికి 17000 ఓట్లు ఆధిక్యంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు

  • కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్

Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చంద్రబాబు పర్యవేక్షణ

  • టీడీపీ పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ

  • కౌంటింగ్ కేంద్రాల్లో, నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి M.K. మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ ఫకీరప్పతో ఫోన్ లో మాట్లాడిన టీడీపీ అధినేత

  • అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి  ఎటువంటి పాసులు లేకుండా చొరబడి...టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్

  • పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు

  • కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరిన చంద్రబాబు

  • ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులకు చంద్రబాబు ఆదేశం

Secunderabad: కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పద్మారావు నగర్ పార్క్ లో గత రాత్రి భారీగా కురిసిన వర్షానికి విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగి పడ్డాయి. ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో వాకింగ్ కు వచ్చిన పార్సిగుట్ట బాపూజీ నగర్ కు చెందిన ఏ. ప్రదీప్ కుమార్ (39) చూసుకోకుండా అడుగు వేయడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కక్కడే  మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Kadapa - Anantapur - Kurnool జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపరచిన ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం

కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శుక్రవారం తెల్లవారుజామున 04:00 గంటల వరకు నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.


ఈ కౌంటింగ్ లో ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపుని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.

MLC Elections Counting: టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించారు. సమీప PRTUTS అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై  సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలిచారు. గురువారం అర్ధరాత్రి 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ (50 శాతానికి మించి) రాలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడో స్థానంలో ఉన్న TSUTF అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించారు.

Background

పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ ఒడిశా వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి.


తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. నేడు (మార్చి 17న) నిజామాబాద్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 


రేపు కూడా వర్షాలు
రేపు (మార్చి 18న)ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.



ఏపీలో వర్షాలు ఇలా
పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.


ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్‌లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.