Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Aug 2022 07:10 PM

Background

ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ముప్పు తొలగిపోయిందనుకుంటున్న సమయంలో భారత వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి ప్రకటన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని వెల్లడించింది. ఉత్తర -...More

అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యుత్‌శాఖ ఏఈపై దాడి

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రాయంపల్లిలో విద్యుత్ శాఖ ఏఈ గురుమూర్తి పై నెరమెట్ల గ్రామ సర్పంచ్ యోగేంద్ర రెడ్డి దాడి చేశారు. విద్యుత్ బకాయిల వసూలుకు వెళ్లిన ఏఈ గురుమూర్తి పై అమానుషంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాయంపల్లి గ్రామంలో బకాయిల వసూలు చేస్తున్న విద్యుత్ ఏఈ కి, అటుగా వచ్చిన యోగేంద్ర రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెప్పుతో దాడి చేసి బూతులు తిట్టినట్టు అధికారులు వివరించారు. ఈమేరకు ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విద్యుత్ శాఖ ఉద్యోగులు. తమ ఉద్యోగిపై దాడిని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు.