Breaking News Live Telugu Updates: కేసీఆర్ మాట ప్రతి ఒక్కటీ అబద్ధమే - బోధన్‌లో వైఎస్ షర్మిల పాదయాత్ర

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Oct 2022 11:56 AM

Background

ఉపరితల ఆవర్తనం బలపడి ఇదివరకే తేలికపాటి అల్పపీడనంగా మారింది. ఉపరితల ఆవర్తనం కర్ణాటక వైపు వెళ్లినా దీని ప్రభావం ఏపీ, తెలంగాణపై కొనసాగుతోంది. దాంతో నేడు సైతం ఏపీ, తెలంగానలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...More

YS Sharmila: 8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయింది - వైఎస్ షర్మిల

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పంటకుర్థ్ గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతొంది. ఈ సందర్భంగా  షర్మిల మాట్లాడుతూ.. కేసీఅర్ తో తెలంగాణ ప్రజలకు ఎలవంటి న్యాయం జరగలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారామే. ‘‘రుణమాఫీ దగ్గర నుంచి ఇంటికో ఉద్యోగం వరకు ప్రతి మాట మోసమే.... ఉద్యోగాలు లేవు...నోటిఫికేషన్ లేవు అంటే హమాలి పని చేసుకోండి అంటున్నారు కేసీఆర్ అని అన్నారు షర్మిల. పెద్ద కొడుకు అని చెప్పి ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నాడు. ఒకరు బ్రతకండి..ఒకరు చావండి అని చెప్తున్నారు. వైఎస్ ఆర్ హయాంలో రేషన్ కింద నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు’’ అని అన్నారు షర్మిల. వెల్ఫేర్ హాస్టళ్లలో పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని.. ఆ బిడ్డలకు ఓట్లు ఉండవు అని చెప్పి హీనంగా చూస్తున్నారని విమర్శించారు. 


ధరలు భారీగా పెంచేశారు


‘‘పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. వంట సరుకులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారు. వైఎస్ ఆర్  ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెరిగితే ప్రభుత్వం భరించేలా చేశారు. నాయకుడు అంటే వైఎస్ ఆర్. బ్రతికినంత కాలం ప్రజల కోసమే బ్రతికాడు. ప్రజలకోసమే చనిపోయాడు. ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ లేనే లేదని అన్నారు షర్మిల. 8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రజలను మోసం చేశాయి. ప్రజల కోసం.. ప్రజల పక్షాన నిలబడటం కోసం పార్టీ పెట్టాం. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తామని అన్నారు షర్మిల’’ అని షర్మిల అన్నారు.