Breaking News Live Telugu Updates: విశాఖలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
పల్నాడు జిల్లా... కాకీ కీచకుడు
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్ నాగబాబు..
దాచేపల్లి స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగబాబు.
కప్లైంట్ ఇచ్చిన బాలిక బంధువులు.
పోలీసుల అదుపులో కానిస్టేబుల్..
అవమానంగా భావించి ఆత్మహత్య కు యత్నించిన కానిస్టేబుల్ భార్య.
గమనించిన బంధువులు..
హాస్పిటల్ కు తరలింపు అవుటాఫ్ డేజర్..
విశాఖలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.
విశాఖ ఎయిర్పోర్ట్ జోన్ లోనే 100 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
వెస్ట్ బెంగాల్ ను చెందిన ఏడుగురిని అదుపులో తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎయిర్పోర్ట్ పోలీసులు
BRS Atmiya Sammelanam In Khammam: ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీకి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు వస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన వారు శంకరగిరి మాన్యాలలో కలిసి పోయారని అన్నారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ సీఎండీ వీసీ సజ్జనార్ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం పీఠానికి వెళ్ళి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన నేపధ్యంలో పీఠాన్ని సందర్శించి అమ్మవారి ఆలయాన్ని సందర్శించానని సజ్జనార్ తెలిపారు. పీఠాధిపతులతో తనకున్న అనుబంధాన్ని వీసీ సజ్జనార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్నానని తెలిపారు. తొలిసారిగా పీఠానికి వచ్చిన సజ్జనార్‌కు స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రతిమను బహుకరించారు
హైదరాబాద్
ఉస్మానియా ఆసుపత్రిలో భాస్కర్ రెడ్డి కి వైద్య పరీక్షలు
వైఎస్ భాస్కర్ రెడ్డి కి ఒక్కసారిగా పెరిగిన బీపీ లెవల్స్
బీపీ పెరగడం తో ఈసిజి 2 D ECHO పరిక్షలు చేస్తున్న వైద్యులు
వైద్య పరీక్షలు తర్వాత సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జిముందు హాజరుపరచనున్న అధికారులు..
భాస్కర్ రెడ్డి ను కస్టడీ కోరనున్న సీబీఐ
బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయి విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో నిర్వహిస్తున్న మూడవ భారీ బహిరంగ సభ ఈ నెల 24వ తేదీన ఔరంగాబాద్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజినగర్ జిల్లా (ఔరంగాబాద్) లో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో బోధన్ గౌరవ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో IDC చైర్మన్ వేణుగోపాల్ చారి, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మనిక్ కదం, హర్షవర్ధన్ జాదవ్ (మాజీ ఎమ్మెల్యే) అభయ్ పాటిల్, ఖదీర్ మౌలానా, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అక్రమ అరెస్ట్ చేశారంటూ, కడప నగరంలోని వైఎస్సార్ సర్కిల్ లో మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సీబీఐ డౌన్ డౌన్ నినాదాలు చేశారు.
మేయర్ సురేష్ బాబు కామెంట్స్..
వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తుంది
కావాలనే ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నం చేస్తోంది
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గపు చర్య
వైసీపీ శ్రేణులు భాస్కర్ రెడ్డి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం
సీబీఐ ఏకపక్షంగా కేసు విచారణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాం
సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
విజయవాడలోని వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5.45 – 7.15 గంటల వరకు ఇఫ్తార్ విందులో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక టింబర్ డిపోలో మంటలు అంటుకుని నలుగురు సజీవ దహనం అయ్యారు. పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లమీదకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన నరేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Background
నిన్న తూర్పు విదర్భ నుండి ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీనివల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు పక్కల జిల్లాలలో 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మీ)తో 4, 5 జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 55 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
నేఎండలు విపరీతం అయ్యాయి. ఈమధ్య అత్యధికంగా ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒక ప్రకాశం జిల్లానే కాదు కోస్తాంధ్ర వ్యాప్తంగా, రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో వేడి బాగా పెరిగింది. చాలా చోట్లల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు ఈ వేడి కంటే ఇంకాస్త వేడి ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత నెలలో వర్షాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెలలో ఎండలు మామూలుగా లేవు. మరి ఇంకా మంచి ఎండలు ముందు ఉన్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తరాదిన వాతావరణం ఇలా
ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండ వేడిమి మొదలైంది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది, ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ. దీంతో మరో రెండు రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని గంగా ప్రాంతాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు ఉండే అవకాశం ఉంది.
అంతకుముందు, ఏప్రిల్ ప్రారంభంలో, వాతావరణ శాఖ వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ కాలంలో, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడి తరంగాలు ఉండే అవకాశం కూడా ఉంది.
18-19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది
IMD శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ శనివారం (ఏప్రిల్ 15) వార్తా సంస్థ ANI కి మరో వెస్ట్రర్న్ డిస్ట్రబెన్స్ రాబోతోందని, దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మైదాన ప్రాంతాల్లో 18-19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈరోజు ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. వాతావరణం మళ్లీ మారుతుంది. ఇటీవల ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
- - - - - - - - - Advertisement - - - - - - - - -