Breaking News Live Telugu Updates: రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఉరి వేసుకొని తల్లి కొడుకులు ఆత్మహత్య

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 15 Jan 2023 10:41 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఉరి వేసుకొని తల్లి కొడుకులు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా...  వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో విషాదం..


 తల్లి కొడుకులు కొండవేని కనకయ్య, మల్లవ్వ ఉరి వేసుకొని ఆత్మహత్య..


తల్లి కొడుకుల ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..

కాకినాడ జిల్లాలో విషాదం - కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా జగ్గంపేట
కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో  కోడిపందాలు ఆడుతుండగా  కోడి కత్తి  తెగడంతో గండే ప్రకాష్ 45  వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రి లో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచిన పోలీసులు.

8వ నిజాం ముకరం ఝా మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం

8వ నిజాం మిర్ ముకరం ఝా బహదూర్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం....


ముక్కరం ఝా కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసారు..

Warangal News: వందే భారత్ ట్రెన్ ఎఫెక్ట్, వరంగల్ లో ఉద్రిక్తత

వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో మారుమోగింది. ఉదయం ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైలుకు స్వాగతం పలికేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వరంగల్ స్టేషన్ కు చేరుకున్నారు.  దేశ్ కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, మోదీ మోదీ  అంటూ బీజేపీ నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాల నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా రైల్వే, సివిల్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Tirumala Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి తిరుమల దర్శనంకు కారు వస్తుండగా మామండూరు సమీపం దగ్గర ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో సంఘటన స్ధలంలో‌ ఇద్దరు మృతి చెందగా ఒక్కరి పరిస్ధితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలు అయ్యాయి. క్షత్రగాత్రులను 108 వాహనం సహాయంతో తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన వారు హైదరాబాదుకు చేందిన నగేష్ (47), శ్రావణ్ కుమార్ (25)లుగా గుర్తించగా, ఈ ప్రమాదంలో అపర్ణ, స్వాతి, సంజన, లక్ష్మి నారాయణ్, రాధిక తీవ్రంగా గాయపడ్డారు.. సంఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

Vijayawada News: కోడిపందాల బరిలో కొట్టుకున్న రెండు వర్గాలు

విజయవాడ శివారు ప్రాంతంలోని అంబాపురం దగ్గర గల పాముల కాలువ సమీపాన రెండు వర్గాలు బాహా బాహీకి దిగాయి. కోడి పందాల శిబిరంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన కోడిపందాల బరిలో కొందరు యువకులు కొట్టుకున్నారు. తమ కోడి గెలిచినా, డబ్బులు ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు.

Vande Bharat Express News: మరికొద్దిసేపట్లో పరుగులు తీయనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబరు ప్లాట్ ఫాంపై వందేభారత్ ఎక్స్‌‌ప్రెస్ వచ్చి ఉంది. ఈ రైలును మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 

Background

ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. క్రిష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. 


ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.8 డిగ్రీలు, 17.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.


తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 56,730 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 52,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 56,730 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 75,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.