Breaking News Live Telugu Updates: ఏపీ మంత్రి రోజా ఇంటి ముందు ఉద్రిక్తత..

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Feb 2023 07:46 PM

Background

దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా...More

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఇంటి ముందు ఉద్రిక్తత..

తిరుపతి : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఇంటి ముందు ఉద్రిక్తత..


ఏపి మంత్రి ఆర్.కే.రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో చీర, గాజులుతో రోజా ఇంటిలోని ముట్టడించేందుకు టిడిపి మహిళలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.. అయితే విషయం తెలుసుకున్న నగిరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్ళకుండా బ్యారీ గేట్లు వేసి అడ్డుకున్నారు.. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది.. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెలుగు మహిళలు, పోలీసులతో వాగ్వాదంకు దిగ్గారు.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.. అయితే తెలుగు మహిళలను, టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేశారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పోలీసు స్టేషను నిండి పోయింది.. ఏపి మంత్రి రోజా కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు అడ్డంగా బైటాయించి తెలుగు తమ్ములు తమ నిరసనను వ్యక్తం చేశారు..