Breaking News Live Telugu Updates: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పదవీకాలం పొడిగింపు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Jun 2022 09:24 PM
అదనపు కట్నం కోసం భార్యకు ఉరి వేసిన భర్త 

జగిత్యాల జిల్లా మల్యాలలో పల్లెపు మహేందర్ అనే వ్యక్తి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. తాగిన మైకంలో భార్య నవ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వీరికి 4 నెలల పాప ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పదవీకాలం పొడిగింపు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్)గా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అంతేకాదు సీఎం ప్రిన్సిపాల్ అడ్వైజర్ అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ పదవీకాలాన్ని ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

మన్యం జిల్లాలో దారుణం, పదేళ్ల బాలుడిపై యువకుడు కాల్పులు!

మన్యం జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.  నాటు తుపాకీతో పదేళ్ల బాలుడు నీరజ్ పై బోయిన చంద్రారావు అనే యువకుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  పాచిపెంట మండలంలోని ఓ గ్రామంలో ఘటన జరిగినట్లు సమాచారం. 

మన్యం జిల్లాలో దారుణం, పదేళ్ల బాలుడిపై యువకుడు కాల్పులు!

మన్యం జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.  నాటు తుపాకీతో పదేళ్ల బాలుడు నీరజ్ పై బోయిన చంద్రారావు అనే యువకుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  పాచిపెంట మండలంలోని ఓ గ్రామంలో ఘటన జరిగినట్లు సమాచారం. 

Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలిక కిడ్నాప్

  • విజయవాడ రైల్వేస్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక కిడ్నాప్

  • మీమీరావలి, హుస్సేన్ దంపతుల కుమార్తె షాభితను అపహరించికు వెళ్లిన గుర్తుతెలియని మహిళ

  • ఈ నెల 8వ తారీఖు జరిగిన కిడ్నాప్, ఆలస్యంగా వెలుగులోకి

  • కూలీ పనులు చేసుకొంటూ రాత్రి పూట ప్లాట్ ఫారంపై నిద్రించే కుటుంబం నుండి బాలికను కిడ్నాప్ చేసిన మహిళ

  • రైల్వే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి 3 బృందాలను నియమించి దర్యాప్తు

  • సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో మహిళను గుర్తించిన పోలీసులు

  • మహిళ బాలికతో కలసి నెహ్రు చౌక్ వద్ద సంచరించినట్లుగా గుర్తింపు

  • పట్టపగలే బాలిక కిడ్నాప్ కలకలం

3 గంటల పాటు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.





3 గంటల పాటు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.





3 గంటల పాటు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.





Visakhapatnam News: విశాఖలో కేంద్ర విదేశాంగమంత్రి, యూత్ ట్రైనింగ్ సెంటర్ సందర్శన

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి s. జై శంకర్ ఏపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ జిల్లా వేపగుంటలో ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. గిరిజన విద్యార్థులకు సివిల్స్ పరీక్షల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ACB Raids: ఏసీబీ వలలో రాజాం సబ్ ట్రెజరర్

  • రాజాం సబ్ ట్రెజరర్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో..

  • ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సబ్ ట్రెజరర్ ఏపీ గోవిందరాజు.

  • సంతకవిటిలో వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి నుండి సీఎఫ్ఎంఎస్ బిల్స్ కోసం రూ.15 వేలు లంచం ఇవ్వమని డిమాండ్ చేసిన ట్రెజరర్

Jubilee Hills Gang Rape Case: జువైనల్ హోంలో కొట్టుకున్న గ్యాంగ్ రేప్ మైనర్ నిందితులు

  • జూబ్లీహిల్స్ పబ్ కేసు నిందితుల మధ్య ఘర్షణ

  • జువైనల్ హోమ్ లో పరస్పరం దాడి చేసుకున్న నిందితులు

  • భోజనం చేసి ప్లేట్లతో ఒకరిపై ఒకరు దాడి

  • కార్పొరేటర్ కుమారుడు టార్గెట్ గా దాడి జరిగినట్లు సమాచారం

  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఘర్షణ

  • మరింత భద్రత పెంచిన పోలీసులు

ఈడీ ఆఫీసుకు రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయన్ను విచారించనుంది.





Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీతను అడ్డుకున్న పోలీసులు

  • పోలీసుల చేతుల్లోకి అనంతపురం జిల్లా కలెక్టరేట్, ఎక్కడికక్కడ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

  • చలో కలెక్టరేట్ కు వస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ అడ్డుకున్న పోలీసులు

  • అడ్డుకున్న పోలీసులపై మండిపడ్డ పరిటాల సునీత, శ్రీరామ్

  • రైతుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే, అధికార పార్టీ పోలీసులును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తుందంటూ ఫైర్ అయిన పరిటాల

ఈడీ ముందుకు రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. రాహుల్ గాంధీకి సంఘీభావంగా ప్రియాంక గాంధీ.. ఏఐసీసీ కార్యాలయానికి హాజరయ్యారు. కార్యాలయం దగ్గర పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.





Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీకి పోలీసుల అనుమతి

  • నెక్ లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీకి పోలీసుల అనుమతి

  • ఐ మాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించిన పోలీసులు

Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పధాకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తెలిపారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో‌ కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవారి కోసం టిటిడి దేశవ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మించాలని,అన్ని ఆలయాల అభివృద్దికి టిటిడి సహకారం అందించాలని ఆయన కోరారు.. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని,  చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం అభివృద్దిలో వెనుకబడిందన్నారు.. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ అభివృద్ది చేసారని, బిజేపి అధికారం కోసం మాతని వాడుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టికి నాయకుడే లేరని చెప్పారు.. ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తూన్నారని, తెలంగాణ పోరాట సమయంలో కేసిఆర్ ని ఇలానే చులకనగా మాట్లాడారని, భవిష్యత్త్ లో కేంద్ర రాజకీయలలో కేసిఆర్ విజయం సాధిస్తారని తెలియజేశారు.. ప్రధాని పదవి కోసం కేసిఆర్ కేంద్ర రాజకీయాలోకి రావడం లేదని, దేశ ప్రజలను చైతన్య పర్చడానికి కేసీఆర్ వస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు..

Telangana High Court CJ: హైకోర్టు సీజేతో కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మను ఆదివారం కలిశారు. అయితే, ఆయన మర్యాద పూర్వకంగా కలిసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. ఆదివారం మధ్యాహ్నం పీకేతో, అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం అనంతరం కేసీఆర్ హైకోర్టు సీజేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Siddipet: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రయల్‌ను అడ్డుకుంటారనే ఉద్ధేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్‌ చేసి జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తీసుకొని వెళ్లారు. వీరిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంత లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు భూ నిర్వాసితులకు గాయాలు కూడా అయ్యాయి. గుడాటిపల్లి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

Background

నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని పలు ప్రాంతాలకు, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకతో పాటు పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి వేగంగా ముందుకు కదులుతున్నాయి. వాస్తవానికి ఏపీ, తెలంగాణలో ఇదివరకే రుతుపవనాలు వచ్చి వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. 


మరో మూడు రోజుల్లో  ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి, మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉంది. నేడు ఏపీ, తెలంగాణ సహా బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుఅవుతున్నాయి. ఊష్ణతాపం నుంచి విలవిలలాడిపోతున్నారు. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 


ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవన వర్షాలు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో భానుడి భగభగలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం రైతన్నలు ఎదురుచూపులు మరో మూడు, నాలుగు రోజుల్లో ఫలించనున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. నైరుతి రుతుపవనాల వర్షాలు ఇంకా మొదలుకానందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఓ వైపు వడగాల్పులు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.