Breaking News Live Updates: సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Sep 2022 10:40 PM

Background

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల నీటి ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో...More

సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం 

సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. బిల్డింగ్ లోని పై అంతస్తులో ఉన్న లాడ్జి పొగ వ్యాపించింది. లాడ్జి రూమ్ లలో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు.