Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Mar 2023 09:03 PM
కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేస్ లో పోలీసుల పురోగతి., 
చోరీ కేస్ లో దొంగల ముఠాలో గతంలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, చోరీ జరిగిన నాటి నుండి తప్పించుకు తిరుగుతున్న మరో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన డిఎస్పీ రత్నాపురం ప్రకాష్.,


ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణ మూర్తి, ఎస్సై చిరంజీవి లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.  బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేశారు. కామినేని రామక్రిష్ణ (విశాఖపట్నం సీతమ్మధార), సత్తి రవి శంకర్ రాజమండ్రి బ్రాంచ్, బి శ్రీనివాసరావు విజయవాడ లబ్బిపేట బ్రాంచ్, గొరిజవోలు శివ రామక్రిష్ణ గుంటూరు బ్రాంచ్ నుంచి అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యల్ని సమర్ధించను: ఎంపీ అర్వింద్‌

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై  చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. 

Amit Shah: అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం - హైదరాబాద్‌లోనే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లోని NISA లోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు గుర్తించారు. దీంతో వల్ల హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి బయల్దేరనున్నారు. హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ 54వ రైజింగ్‌ డే పరేడ్‌ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు.

Vikarabad: వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో మూడు రోజుల పసికందు మృతి

వికారాబాద్ మహావిర్ ఆస్పత్రిలో కల్పన, ప్రసాద్ దంపతులకు 9వ తారీఖున మగ బిడ్డకు పుట్టాడు .. నిన్న సాయంత్రం నుండి బాబు  ఆరోగ్యం విషమించిందని డాక్టర్లు నిర్లక్ష్యం వహించడం వల్లే బాబు చనిపోయాడని బాధితులు వాపోయారు. సరైన పరికరాలు లేక డాక్టర్లు సమయానికి స్పందించక మా బాబుని కోల్పోయామని బాబు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయంపై డాక్టర్లు స్పందిస్తూ తల్లిపాలు పట్టిన తర్వాత బర్పింగ్ చేయకపోవడం వల్ల బాబుకి ఎక్కిళ్ళు వచ్చి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.

Same Sex Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడి

  • స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరని తేల్చి చెప్పిన కేంద్రం

  • భారతీయ వివాహ వ్యవస్థలో భార్య, భర్త, వివాహం కారణంగా పొందిన సంతానంతో స్వలింగ విహావాహాలను పోల్చలేమని వెల్లడి

  • సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన కేసులో కేంద్ర ప్రభుత్వం

Revanth Reddy: నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర

  • నిజమాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భింగల్ పట్టణంలో రేవంత్ రెడ్డి కామెంట్స్

  • తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత రైతులను అదుకోలేదు, బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారు

  • పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవు

  • తెలంగాణలో కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు

  • కల్వకుంట్ల కుటుంబానికి వేలకోట్ల ఆస్తుల వచ్చాయి, ఫామ్ హౌస్ భూములు వచ్చాయి

  • ఆదాని, అంబానీలకు దేశ సొత్తును మోదీ దోచి పెడుతున్నారు

  • హరియాణా, పంజాబ్ రైతుల స్పూర్తి నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉంది

  • పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండు

  • 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెరుస్తానని చెప్పి మాట తప్పారు

  • ఈ ప్రాంత రైతులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఆదుకోవడం లేదు

  • తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు అండగా నిలవాలి

  • 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చూసి పార్టీ నష్టపోయిన తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది

Visakhapatnam: ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త, ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావు

  • విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల కు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ కార్యకర్త, ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావు

  • లక్షల రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చి పంచుతుంటే ఈశ్వర్ రావు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు

  • వార్డు నెం 16లోని బూత్ నెం : 232 లో  డబ్బులు పంచుతుండగా పట్టివేత

  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, టీడీపీ నేతలు

  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఎంపీ నిర్మాణ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్న ఈశ్వర్ రావు

Visakhapatnam: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బుల పంపిణీ!

  • విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను మభ్య పెట్టడానికి వైసీపీ డబ్బుల పంపిణీ అంటూ ఆరోపణలు

  • కృష్ణా కాలేజ్ సమీపంలో వైసీపీ కార్యకర్త గా భావిస్తున్న వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు

  • సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ పోలీస్ అధికారుల తనిఖీలు

  • 87,000 డబ్బులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు

  • పంపిణీ చేస్తున్న వారిని ఆరాతీస్తున్న రెవెన్యూ అధికారులు

Medchal News: ఓ రెస్టారెంట్లో బాలుడిపై ఎలక దాడి

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిఫ్రెష్ అవుదామని కుటుంబంతో మెక్ డొనాల్డ్ కు వెళ్ళిన వారికి చేదు అనుభవం ఎదురైంది. అందులో ఓ ఎలుక తమ పిల్లవాడి పై దాడి చేసి గాయపరిచిందని సదరు ఆహార సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం స్థానికంగా ఉండే ఆర్మీ మేజర్ గా పని చేస్తున్న సవియో హెర్క్వీస్ గురువారం రాత్రి పేట్ బషీరాబాద్ హైటెన్షన్ లైన్ లో ఉన్న మెక్ డోనాల్డ్ లో కుటుంబంతో కలిసి వెళ్ళాడు. వాళ్లకు కావాల్సిన ఆర్డర్ ను ఇచ్చి వారి టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇంతలో ఓ ఎలుక అకస్మాత్తుగా వచ్చి అతని తొమ్మిదేళ్ల కొడుకుపైకి ఎక్కి కొరికి పారిపోయింది. దీంతో బాలుడికి తొడపై గాయం అయింది. ఈ విషయంపై మెక్ డొనాల్డ్ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శనివారం బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Chittoor Accident: చిత్తూరు జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం

నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ని కారు ఎదురెదురుగా డీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సింగపూర్ నుండి చెన్నై చేరుకుని అక్కడి నుండి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ లారీని నడుపుతున్న డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న నగిరి పోలీసులు.

YS Bhaskar Reddy CBI Enquiry: విచారణ నుంచి బయటికి వచ్చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి

  • కడప జిల్లా సీబీఐ గెస్ట్ హౌస్ నుండి బయటికి వచ్చిన వైయస్ భాస్కర్ రెడ్డి

  • సీబీఐ అధికారులు ఈ రోజు విచారణకు రావాలని కోరారు.

  • సీబీఐ అధికారుల పిలుపు మేరకు విచారణకు వచ్చా.

  • ఇక్కడ సీబీఐ అధికారులు ఎవరు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నా.

  • మళ్ళీ నోటీసులు ఇస్తే విచారణకు హజరవుతా.

  • వివేకానంద రెడ్డి హత్య కేసు తేలాలంటే సమయంలో ఉన్న లెటర్ బయటికి రావాలి.

  • సీబీఐ ఎలాంటి చర్యలు తీసున్నా సిద్దంగా ఉన్నా.

  • వైఎస్ భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు

Bala Nagar News: బాల నగర్  సాయి నగర్ వినాయక నగర్ లలో కుక్కల స్వైర విహారం

వినాయక్ నగర్, సాయి నగర్ లో ఓ వీధి కుక్క రోడ్డు పై ఆడుకుంటున్న చిన్నారులను, నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరినీ కరిచింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. వీధి కుక్కల నుండి తమకు రక్షణ కల్పించాలని, స్థానికులు కోరుతున్నారు.

CISF in Hakimpet: CISF రైజింగ్ డే సెలబ్రేషన్ లో అమిత్ షా

  • CISF రైజింగ్ డే సెలబ్రేషన్ కు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్

  • CISF రైజింగ్ డే సెలబ్రేషన్ లో  పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్

Amit Shah in Hyderabad: హకీంపేట్‌లో 54వ CISF రైజింగ్ డే పరేడ్, ముఖ్యఅతిథిగా హాజరైన అమిత్ షా

  • హకీంపేట్ నిసా (నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ) కార్యాలయంలో 54వ CISF రైజింగ్ డే పరేడ్ కార్యక్రమం

  • 53 ఏళ్ల సీఐఎస్ఎఫ్ సేవలను గుర్తించి గౌరవించుకోనున్న దేశం

  • ముఖ్య అతిథి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

  • 1969 మార్చి 10న మూడు వేల మంది సిబ్బందితో మొదలైన సీఐఎస్ఎఫ్ 

  • కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, ఎయిర్‌పోర్ట్, సీ పోర్ట్ లు, పవర్ ప్లాంట్స్, నేషనల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కు భద్రత కల్పిస్తున్న సీఐఎస్ఎఫ్ 

  • దేశ వ్యాప్తంగా 1 లక్షా 80 వేల మంది సిబ్బందితో పటిష్ఠ భద్రతా సేవలు

  • హోస్టేజెస్ పరిస్థితి, టెర్రరిస్ట్ అటాక్స్, ఫ్లైట్ హైజాకింగ్స్, బాంబ్ బెదిరింపులు, పేలుడు పదార్థాల గుర్తింపు, వాటి తొలగింపు వాటిల్లో సీఐఎస్ఎఫ్ భద్రత సేవలు

Background

మార్చి నెల సగంలోనే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం (మార్చి 11) పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలు వేడి నుండి కొంత ఉపశమనం పొందవచ్చని అంచనా వేసింది.


వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 13 నుండి 18 వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ స్థితి


పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. అంతేకాక, ఏపీ, యానం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో మొదటి భారీ వర్షాలు, మార్చి 16 న నుంచి మొదలైయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మార్చి 16 న మొదలై మార్చి 17, 18, 19 భారీగా మారి మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


‘‘మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడనుంది. దీని వలన తెలంగాణ తో పాటు ఆంధ్రా వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఒక వైపున ఏమో తేమ గాలులు ఈ గాలుల సంగమం మీదుగా రాగా, మరో వైపున ఇప్పటి దాకా కొనసాగుతున్న పొడిగాలులు గాలుల సంగమంలో ఉంటుంది. ఈ రెండు కలయిక వలన వర్షాలు బాగా పిడుగులతో, బలమైన ఈదురుగాలులతో పడనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్


తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.